అన్నీ ఇచ్చే దేవుడేడి?
>> Thursday, February 4, 2010
అన్నీ ఇచ్చే దేవుడేడి?
రోజుకొక దేవుడిని పూజించలేక నానా అవస్థలు పడుతున్నాం. మనకి అన్నీ ఇచ్చే ఒక దేవుడిని గురించి చెప్పండి?
- ఏలూరి నారాయణ, రావినూతల
మీ ఉద్దేశం చాలా మంచిది. వివిధ దేవుళ్ళకూ, దేవతలకూ, పరమాత్మకూ తేడా మనకు తెలిస్తే, ఇంత మంది దేవుళ్ళను పూజించే అవసరం ఉండదు. సురులు అంటే... దేవతలు, దేవుళ్ళు, నరులు(మానవులు). తిర్యక్కులు(అడ్డంగా తిరిగే జంతువులు) స్థావరాలు(కదలకుండా ఉండే చెట్లు మున్నగునవి)- ఈ అన్నింటి కన్న విశిష్టమైన తత్త్వం ఒకటున్నదని, అదే పరబ్రహ్మ, పరతత్త్వం, పరమాత్మ, భగవంతుడు అని పిలువబడుతుందని వ్యాస భగవానుడు బ్రహ్మ సూత్రాలలో వివరించి నిరూపించారు. విశ్వ వ్యాప్తంగా అన్నింటికీ ఆధారమై ఉన్న ఆ పరమాత్మ తత్త్వం ఒక్కటే. ఆయన్ను ఆరాధిస్తే అన్నింటిని ఆరాధించినట్లే. 'ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు' అని అన్నమయ్య చెప్పినట్లుగా తిరుమల శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన మరొక పరతత్త్వము లేడు. మీ అన్ని కోర్కెల్ని ఆ శ్రీనివాసునికే నివేదించి, ఆరాధించి తరించండి.
-ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ
[from andhra jyothi daily]
0 వ్యాఖ్యలు:
Post a Comment