ఫకీరు హృదయము
>> Saturday, February 6, 2010
మహమ్మదీయ పవిత్ర గ్రంథము తజ్ కరాత్_ఉల్-ఔలియాలో ఒక కథ ఉంది.
ఒకప్పుడొక ఫకీరు సుదూర యాత్ర చేస్తున్నాడు. దారిలో తినుటకు కావలసిన రొట్టెలను మూటగట్టుకుని ప్రయాణిస్తున్నాడు.
మొదటి రోజు సాయంత్రమునకొక మసీదు చెరుకుని విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటిరోజు పెందరాలే మేల్కొని ఎండ ఎక్కువకాకముందే చాలాదూరము పోవలెనని వడివడిగా నదచి దాదాపు పది మైళ్ల దూరం వెళ్ళాడు. ఎండపెరగటం అలుపురావటం వలన కొద్దిగా రొట్టెలను తిని ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు.మూటవిప్పి చూస్తే ఏముంది ? రొట్టెల నిండా చీమలు పట్టుకుని ఉన్నాయి.
అయితే ఆయన సామాన్యునిలా నారొట్టెలన్నీ పాడుచేసాయి చీమలు అని ఆలో చించక "అయ్యో ! ఇవి మసీదులోని చీమలు. రాత్రి రొట్టెకోసం వచ్చి మూటలో ఉన్నాయి . వీటిని ఇంతదూరం తెస్తిని. పాపం ఇవి తమ ఇంటికి దూరమైనవి. ఇక్కడ వదలివేస్తే అవి తమ పిల్లలను బంధువులను తలిదండ్రులను గానక దు:ఖపడును." అని విచార పడ్డాడు.
వెంటనే ఆయన తిరుగు ప్రయాణమై అంతదూరం మరలా నడచి వచ్చి మసిదులో వాటిని విడిచి సంతృప్తి చెందాడు.
పరమార్ధము మనకు దయను కరుణను మాత్రమే నేర్పుతుంది. హింసను కాదు.
2 వ్యాఖ్యలు:
"అన్నింటికంటేఉత్తమమైన గుణం ఏది?” అన్న ప్రశ్నకు
ప్రవక్తముహమ్మద్ “ఆకలి గొన్నఅన్నార్తులకు, పేదవారికి అన్నంపెట్టడం,పరిచయంఉన్నవారికీ లేనివారికీకూడానమస్కారం (సలాము) చేయడం" - అని జవాబిచ్చారు.
There is no god protecting the Hindus and Muslims. It is they who are destroying each other to protect Him at Babri Masjid and Ramajanmabhoomi. ---B. Premanand
Post a Comment