శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆదిదంపతుల కళ్యాణం .అందరం పెద్దలమే .తప్పనిసరిగా రావాలి మీరు

>> Friday, January 22, 2010

కళ్యాణము "చేతము" రారండి !


ముహూర్తం : స్వస్తి శ్రీ విరోధినామ సంవత్సర శుద్దదశమి సోమవారం 25-1-2010


వేదిక : శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం ,శ్రీచక్రవనం ,రవ్వవరం ,నూజండ్లమండలం ,గుంటూరు జిల్లా .
పెండ్లికుమారుడు : శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు .ఆదిమత్యాంతరహితుడు ,అనంతకోటి నామధేయుడు లీలామోహనరూపుడు,పరమపురుషబిరుదాంకితులు


శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామివారు

పెండ్లికుమార్తెలు : జగజ్జనని జగన్మాతసకలసంపత్తులనిచ్చి పోషించు మనతల్లులు శ్రీదేవి ,భూదేవి వారలు .






మరొక జంట



వరుడు : ఆదిదేవుడు ,భక్తజనబాంధవుడు నిరాకార పరబ్రహ్మ శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి వారు


వధువు : అమ్మలగన్నయమ్మ పరాశక్తి శ్రీశ్రీశ్రీ దుర్గాపరమేశ్వరి వారు


జగన్మాతాపితరులకు మనంజరుపు కుంటున్న కమనీయకళ్యాణోత్సవము లో పాల్గొని మనకు ,మనవారికి ,సకల జగత్తుకు శుభాలు కలిగించాలని వేడుకచేసుకుందాం . ఆత్మీయబంధువులైన మీ అందరూ సపరివారబంధుమిత్రసమేతంగా విచ్చేయవలెనని వేడుకుంటున్నాము .

------------------------------------------------------------------------------------
శ్రీమన్నారాయణ శరణాగతి యాగం పూర్ణాహుతి


రాష్ట్రం లోను దేశం లోను సంభవిస్తున్న ఉపద్రవములనుండి భక్తజనులను రక్షించాలని కోరుతూ పీఠములో నలుబది రోజులకాలంగా సాగుతున్న విష్ణుసహస్రనామ పారాయణ,అష్టాక్షరి మంత్రజప అనుసంధానిత శ్రీమన్నారాయణ శరణాగతి యాగం పూర్ణాహుతి .
వేదిక : శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం ,రవ్వవరం.

సమయం: 25-01-2010 సోమవారం .ఉదయం 8 గం. నుండి

----------------------------------------------------------------------------------

రూట్ : పీఠము విజయవాడ -నుండి కర్నూల్ పోవు జాతీయ రహదారిపై ఉన్న వినుకొండ పట్టణానికి అరగంట ప్రయాణసమయం లో చేరుకోగల దూరం లో వున్నది. హైదరాబాద్ నుంచి వచ్చువారు ,గుంటూరు వెళ్ళి అక్కడనుండి వినుకొండ వచ్చి రావటం ఒకటి. నేరుగా హైదరాబాద్ నుండి నాగార్జునసాగర్ ,మాచర్లమీదుగా వినుకొండ ఆరుగంటల ప్రయాణంతో చేరుకోవచ్చు.
చెన్నై వైపునుంచి వచ్చేవాళ్ళు ఒంగోలు నుండి అద్దంకి అక్కడనుండి దర్శి రూట్లో ఉల్లగల్లు అనేస్టేజీలో దిగి రవ్వవరం రావచ్చు.

విశాఖ పట్టణం నుండి ప్రశాంతి ఎక్స్ ప్రెస్ నేరుగా వినుకొండలో ఆగుతుంది దానిలోగాని విజయవాడవచ్చిగాని రావచ్చు.
వినుకొండ లో మీకు ఇబ్బంది లేకుండా మనకుర్రవాళ్ళు రిసీవ్ చేసుకునే ఏర్పాట్లున్నాయి . పీఠములో మీకు సాధారణవసతికి ఇబ్బంది లేదు . బయలుదేరినప్పటి నుండి ఫోన్ లో సంప్రదిస్తుంటే రూట్ లో అనుమానాలు నివృత్తి చేస్తుంటాము.



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP