విమర్శించే సమయంలో చదువుకుంటే తెలుస్తుంది కదా ???
>> Tuesday, May 3, 2011
మానవజాతి అజ్ఞాన సాగరంలో నుంచి జ్ఞానతేజంలోకి ఉద్దరించడానికి భగవంతుడు  తిరిగి తిరిగి పూర్ణపురుషుల రూపంలో అవతరిస్తాడని మహనీయులు చెబుతారు. ఆ భగవంతుడు మానవోద్ధరణకై దూతలను పంపాడని వారు వివిధదేశ ప్రజలకు తగురీతిని భగవంతుని ఆదేశాలను బోధిస్తారని ఖురాన్ లో చెప్పబడింది .ధర్మబోధను సరియైన విధంగా మానవజాతికి అందించడానికి అవతరించే మహనీయులు నిజమైన "దేవుని బిడ్దలు" అని బైబిల్ ఏసుజీవితాన్ని బోధించడం ద్వారా నిరూపిస్తుంది . అట్టిమహనీయులందరూ తామే దైవమని నిరూపించే రీతిని తమ ఆచరణ,లీలలుబోధనలను ప్రకటింపజేస్తారు. అట్టివారు సాక్షాత్ దైవస్వరూపాలని,జ్ఞానులకు పరమాత్మనయిన తనకు బేధం లేదని కృష్ణుడుగీతలో బోధిస్తాడు. నేను,[స్వర్గంలోని] నాతండ్రి ఒక్కటే " అనిఏసు ఈవిషయాన్ని నిర్ధారించారు . మహనీయుల ఈ తత్వాన్ని సార్వజనీనంగా మనకందించారు భరద్వాజ గారు.
    నిజమైన ఈమహనీయులనుగూర్చిన విజ్ఞానం జనసామాన్యానికి కలగనిదే సత్యమైన ఆథ్యాత్మికతత్వం పున:ప్రతిష్టితం కాదనేవారాయన .ఈరీతిన అనేక మహనీయుల ఏకత్వాన్ని వారి చరిత్రలద్వారా మనకు అందించారు ఆచార్యభరద్వాజగారు.
 మౌలికమైన ఈసూత్రం అర్ధంకావకపోవటం వలననే వివిధమతాలమధ్య వైషమ్యాలేర్పడుతున్నాయి. అందుకే ఆచార్య్లు రచించిన మతం ఎందుకు ? అన్నగ్రంథం భగవంతుని తత్వాన్ని తెలిపే "ఏదినిజం?" అన్నగ్రంథం ప్రతి  ఒక్కరు చదివితీరాలి. వాటితో పాటు మహనీయుల చరిత్రలు చదవాలి.
అయితే ఇన్ని చదివినా "ఈమతంలో ఇలా ఉంటే ఆ మతంలో అలా ఎందుకుంది ?వంటి ప్రశ్నలు మనకు ఉదయించకమానవు. అప్పుడు రెండే సమాధానాలు "అది ఎలాఉంటే నాకెందుకు ? నేనుచేయాల్సినదానిని మహనీయులు చెప్పారుకదా ! చేసి చూపారుకదా !దానిని అనుసరించడం మొదటి కర్తవ్యం "అని నిర్ధారించుకుని విచికిత్సను పండితులకు వదిలి ఆథ్యాత్మిక రసాన్ని స్వీకరించడం ఒక రకం. రెండు మనకై మనమే ఆమతాలలోని వివిధమహనీయుల బోధలను గ్రహించి క్రోడీకరించి అధ్యయనం చేసి నిర్ధారిమ్చుకోవడం .  ఎటుచేసినా మహనీయుల బోధలనుఅనుసరించడమొక్కటే  మనవిధి.  అందుకని అట్టివాదనను స్పర్ధలనూ పండితులకు విడిచేయటం ఉత్తమం.ఈ విషయమై మాష్టర్  ఇ.కే. చరిత్రలో ఒక ఘట్టముంది.
 శ్రీ పసుమర్తి సుబ్రహ్మణ్యం అమ్మాయి వివాహం జరుగుతుంటే భోజనాలదగ్గరంతా హడావుడిగాఉంది. ఒక చురుకైన ముత్తైదువ  ఇ.కె.తో ఇలా అంది. "చాలాకాలంనుండి రామాయణంలో కొన్ని ధర్మసందేహాలు నాకున్నాయి .వాటిని మీతో చర్చించవలెనని కుతూహలంగాఉంది" అన్నది.
దానికి మాష్టర్ గారు" చర్చించడానికి నాకు టైమ్ లేదు . రామాయణం చదువుకొనడం,అందులో ఉన్నధర్మాలను తెలుసుకొని ఆచరించడానికి యత్నిస్తేలాభంగాని,చర్చిస్తే ఏ మొస్తుంది? అన్నారు.
వెంటనే తెలివిగా "మీబోటి పండితులతో చర్చిస్తేనేకదా సందేహాలు తీరేది ? అన్నది.
మాష్టర్ గారు "నేను పండితుణ్ణి కాను .మానవుడిని రామాయణం చదువుకొనటం మీదనే నాకు నమ్మకంగాని చర్చించడం మీదలేదు. 
అమె కొంత సర్దుకుని  " ఆ!ఈమధ్య  రామాయణాన్నిగూర్చి రకరకాలుగా విమర్శిస్తున్నారు కదా ? వాటిగూర్చివాటిని గూర్చి ఎవరైనా వాదిస్తే మనం తెలుసుకుని ఉండాలిగా అందుకనే మీబోటివాళ్లు  తెలియజెప్పాలి " అన్నది.
వెంతనే మాష్టర్ గారు " వాళ్లకు కూడాఅదే తెలియ చెప్పండి . రామాయణం మీద విమర్శలను చదువుకునే టైం లో రామయణాన్నే చదువుకుని తెలుసుకోవచ్చు.
  [చెణుకులు అనే పుస్తకం నుండి]



 

 
 
 
 
 
 
 
 
 
 
 
1 వ్యాఖ్యలు:
$దుర్గేశ్వర గారు
చక్కగా చెప్పారు... తాత్పర్యం నాకు నచ్చింది. ఆ రోజుల్లోలాగా విషయాన్వేషణ నేడు కష్టతరం కాదు ఈ తరానికి. అయినా పిల్లకాకుల్లాగా ప్రశ్నలు సంధి౦చడానికే సమయం వృధా చేసుకుంటే కడుబాధ వేస్తుంది. నాకున మౌలికమైన బాధలో అదొకటి!
Post a Comment