శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠంలో ఈరోజు వరలక్ష్మీ విభవం
>> Friday, July 31, 2009
అనంతరూపాల భాసిస్తూ ,ఆశ్రితులను కాపాడు ఆదిపరాశక్తి ఆతల్లి వరలక్ష్మిగా అవతరించి భక్తుల సేవలందుకునే సుదినం ఈరోజు . శ్రావణమాసాన ఆతల్లిని ఆరాధించే అతివలు ఆమెకృపకు పాతృలై అనంత సంపదలను పొందుతారు.
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము లో ఈరోజు ప్రాత: కాలమునుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి .
ఉదయాన్నుండి మూలమూర్తులకు పురుషసూక్త ,రుద్రసూక్తములతో వేంకటేశ్వర,రామలింగేశ్వరులకు ,శ్రీసూక్తప్రకారంగా అమ్మవారికి పంచామృతాలు ,కుంకుమ ,గంధ,హరిద్రాచూర్ణయుక్త జలములతో అభిషేకములు నిర్వహింపబడ్డాయి. తదనంతరం శ్రీచక్రార్చన ,పూజలు జరిగాయి . ఆతరువాత గోత్రనామాలు పంపిన భక్తులతరపున కుంకుమార్చన జరుపబడినది.
ఆతరువాత మాయింటి కోడల్లు ,ఆలయానికి వచ్చిన భక్తురాళ్లచేత సామూహికంగా వరలక్ష్మీ వ్రతం భక్తి శ్రద్దలతో సాగినది. ఆతరువాత ప్రత్యేకించి చేసిన ఐదురకాలైన ప్రసాదాలను అమ్మకు నివేదించి వాయినదానాలు ఇచ్చిపుచ్చుకున్నారు పరస్పరం .
సాయంత్రం మరలా సంధ్యహారతి అనంతరం అమ్మవారికి లలితా సహస్రనామాలతో పుష్పాలతో పూజ జరుపబడినది. అలాగే జ్యోతిస్వరూపమైన ఆతల్లికి దివ్యజ్యోతుల నీరజనం సమర్పించబడినది.




1 వ్యాఖ్యలు:
గుడి ఎంతో పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంది,అమ్మవారి ఫోటోస్ బాగా వచ్చాయి.చాలా బాగుంది.
Post a Comment