మీ ఇంట నోచిన నోముగురించి ఇక్కడ పదిమందికి తెలియజేయండి
>> Thursday, July 30, 2009
.
మాతృస్వరూపిణులైన తల్లులకు నమస్కారం
        ఈజాతి జీవధారమీరు .ఇక్కడ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడి తరువాతతరాలకు అందిస్తూ సజీవంగా వుంచుతున్న జ్ఞానఝరులు మీరు. వందమంది మగవాళ్లం ఐవ్వలేని శిక్షణ తరువాతి తరాలకు మీరొక్కరొక్కరే ఇవ్వగలరు. కనుకనే ఈజాతి తనసాంప్రదాయాన్ని ధార్మికతను ,విలువలను కాపాడుకోగలుగుతున్నది ఇప్పటీవరకు .
కాకుంటే కొత్తతరాలకు ఈవిద్యను అందించటం లో అనేక కారణాలవలన ఆఆటంకాలు ఎదురవుతున్నాయి .నిరంతరం జీవితాన్ని పరుగులమయంగామార్చుకుని అన్నివిలువలను ,అన్ని సత్సాంప్రదాయాలను అందుకోలేక కొత్తతరం ఈ దివ్య విజ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడినది.
  ఈస్థితిలో ఈ మానవ కళ్యాణ కారకమైన ఈ సనాతన సాంప్రదాయాలను కొత్తతరానికి అందించవలసిన బాధ్యతకూడా మీ పైనేవున్నది. ఈ ఆచారాలలో ఇమిడివున్న ,ఆథ్యాత్మిక ,ఔషదీయ ,మానవీయ ,ప్రేమమయ జీవన విలువలు తెలియపరచాల్సివున్నది. ఈపండుగలు మీరు జరపటం లో పొందే ఆనందము ,తద్వార కుటుంబములో పొంగిపొరలే ఆప్యాతానురాగాలు తెలుసుకున్న తరువాత, భౌతికవనరుల సంపాదనే గొప్పనుకుని మనసును ఎడారిగామార్చుకుని తల్లడిల్లుతున్న ఈతరానికి ఈసాంప్రదాయ ఆచరణవలన కలిగే మేలు తెలుస్తుంది . గతం లో ఎవరికి వారుగా ఈపండుగలను పాటించేవారు. అప్పటి తరం లో అందరికీ ఈ విజ్ఞానము తెలుసుకనుక  ఇంకొకరికి చెప్పవలసిన అవసరం వుండేది కాదు. కానీ కాలం మారింది మంచినైనా పదిసార్లు చెప్పిచేపిస్తేగాని స్వీకరించని దురవస్థ దాపురించింది. కనుక మీరు ఆచరించే ఈపండుగలగూర్చి ,చేసిన విధముగూర్చి  పదిమంది పదిచోట్ల చెబితే అది ధర్మప్రచారమవుతుంది. ధార్మిక సేవ అవుతుంది. 
    నిన్నొక సోదరి నన్నడిగినది  . సత్కార్యానికి కూడా ప్రచారము అవసరమా మాస్టారూ ! అని
 నేను ఖచ్చితంగా చెబుతున్నాను . మనిషికి రెండు ఆప్షన్స్ వున్నాయి   .ప్రస్తుతం  ,ఒకటి మంచి ,రెండు చెడు అదిలేకుంటే ఇది మనిషిమనసులోకి చొచ్చుకు పోతుంది. ఈ ఆచారాలవలన మనసులు పవిత్రమై ,పవిత్రభావలతో ,ప్రేమానురాగలతో కుంటుంబములలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి ,భగవంతుని అనుగ్రహం కూడా తోడవుతుంది కనుక.  ఇవి వదిలెసేలా మనసుకు వీటిపట్ల అనాసక్తిని పెంచుతున్న " కలి" సేనల ప్రచారప్రభావాలనుండి  ఒక్కరు మీ ఆచరణను చూసి కాపాడబడినా .ఈసంస్కృతి పట్ల అనురక్తి పెంచుకున్నా మీకు పుణ్యమే . మీరు పండుగను వ్రతాన్ని ఆచరించినతరువాత  ,ఆవివరాలను ఇక్కడ మీ బ్లాగులలో వ్రాయండి లేదా మీవారు బ్లాగునడుపుతున్నట్లైతే దానిలో వ్రాయండి . నాకైనా మెయిల్ లోవివరాలు పంపండి  ఇక్కడుంచుతాను   . మహాలక్ష్మీ సమానులైన మీఅందరికీ  వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న ఈ శుభసమయాన శుభాకాంక్షలు .ధన్యవాదములు .



 

 
 
 
 
 
 
 
 
 
0 వ్యాఖ్యలు:
Post a Comment