పసుపు కుంకుమలివ్వండి ముత్తైదువులకు
>> Wednesday, July 29, 2009
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా 1
కురువింద మణిశ్రేణీ కనకత్కోటీర మండితా 2
శుక్రవారం పూట మహిళలు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని పూజచేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
అదీ శుక్రవారం పూట లలితసహస్రమ నామ స్తోత్రమును పూర్తిగా పఠిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. కుదరని పక్షంలో శుక్రవారం పూట పై మంత్రముతో అమ్మవారిని స్తుతించి కర్పూర హారతులు సమర్పించుకుంటే ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.
ఇంకా శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమలిస్తే.. వంశం వృద్ధి, సకల సంపదలు, ఉద్యోగరీత్యా వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి. దీంతో పాటు శుక్రవారం పూట పసుపు కుంకుమలిచ్చే మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం.



 

 
 
 
 
 
 
 
 
 
1 వ్యాఖ్యలు:
ముసిరిన కర్మదుష్ఫలము పూజలుచేయగ బుద్ధి బాపగా
కసురుకొనేటి కర్మమును కాంచుటకైనను లేకజేయు నా
బిసరుహనేత్ర లక్ష్మి సుమపేశలమానస, కొల్చు వారికిన్
పసుపునుకుంకుమన్ పరమభక్తినొసంగుడు పేరటాండ్రకున్
శ్రావణమాసమందు సువిశాలహృదంతరవాసి యౌచు పల్
ధీవరులింటనిల్చుసిరి తృప్తిగ సంపద లంద జేయుచున్.
సేవలుచేసి యామెకృప చేకొనుడందరు.స్త్రీ జనంబులన్
యావరలక్ష్మిగా తలచి యాదరమొప్పగ కొల్చుటొప్పెడిన్.
అమ్మా!శ్రీహరి రాణి!నీదు కృపతో అష్టస్వరూపాత్మవై
నెమ్మిన్మాగృహమందునుండతగునోయమ్మా!కృపాంభోనిధీ!
మమ్మున్గావగనెవ్వరమ్మకలుగున్ మాయమ్మనీకన్న?నిన్
సమ్మాన్యంబుగనందరందుకనుటన్సత్కృత్యమున్గొల్పుమా!
Post a Comment