శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భగవద్భంధువులారా! సమయదానాన్నివ్వండి

>> Monday, March 9, 2009




భగవద్బంధువులారా ! ఈమహత్తర కార్యానికి మీచేయూతనివ్వండి.


రానున్న విరోధినామ సంవత్సరాన కూడా ప్రమాదాలు ,కల్లోలాలు మనలను కలవర పరచనున్నాయని సూచనలు తెలుస్తున్నాయి. ఈసమయం లో లోకక్షేమం కోరి హనుమత్ రక్షాయాగము ప్రారంభమవుతున్నది. ఈకార్యక్రమానికి భగవత్సేవకులందరూ సహకారాన్ని అదించవలసినదిగా మనవి చేస్తున్నాము.

దీని కోసము మిమ్మల్ని ఆర్ధికంగా సహాయము చెయ్యమని అడగటమ్ లేదు.[ మీకుఇంతకు మునుపే మనవిచేసుకున్నాము ,ఇక్కడ పీఠములో ఎవరినీ యాచించే సాంప్రదాయం లేదు. భగవత్శక్తి ఎవరికి ప్రేరణ కలిగిస్తే వారంతట వారేముందుకొస్తారు కనుక అది సమస్యకాదు.]

మేమడుగుతున్నది సమయదానము. భగవంతుడు ఇచ్చిన 24 గంటల సమయం లో మీకొరకు ,మీకుటుంబం కొరకు 23 1/2 గంటలు ఖర్ఛుపెట్టుకుని ఒక్క అరగంట సమయం ఈ కార్యక్రమానికి ఇవ్వండి. ఆసమయాన్ని మీశక్త్యానుసారం ఎలా వినియోగించాలో మేము సూచిస్తాము.

ఎలా వుపయోగించవచ్చు మీరు దానము చేస్తున్న సమయాన్ని?
--------------------------------------

1 ఈసమయాన్ని మీసాధనకు వుపయోగించవచ్చు.

2. కొద్దిసమయము వెచ్చించి మీకు తెలిసినవారికందరకు దీనిని తెలియజేసి వారిని కూడా సాధనకు ప్రేరేపించవచ్చు.

3 మీరు మీద్వారా ఈకార్యక్రమములో పాల్గొంటున్నవారి గోత్రనామాలను పంపి పూర్ణాహుతి తరువాత పంపే హనుమత్ రక్షలను వారికి ఛేర్చేబాధ్యత స్వీకరించవచ్చు.
4. మీరు ఆథ్యాత్మిక సంస్థలు,సత్సంగాల సభ్యులైతే సామూహికంగా మీ సత్సంగ సభ్యులచే పారాయణ చేపించవచ్చు.
అలాగే హనుమజ్జయంతి నాడు మీసమీపంలో గల హనుమత్ క్షేత్రం,లేక ఆలయం లో పూజ్యఅన్నదానం చిదంబరశాస్త్రిగారిద్వారా సూచించబడుతున్న విధి ననుససరించి అక్కడ హోమము చేపించవచ్చు.
5, అలాగే 108 సార్లు చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
6. మీ స్వంత గ్రామాలలో గ్రామ రక్షణకోసము సామూహికంగా హనుమదభిషేకములు చేపించవచ్చు.[ఈకార్యక్రమాన్ని మేము చేపించిన గ్రామాలలో ఆత్మీయతలకుప్రతిరూపాలైన గ్రామీణులలో రాజకీయంగా ,ఇతర కారణాలవల్ల చెలరేగిన హింస,కక్షలు కార్పణ్యాలు కూడా అణగిపోయి ఆయాగ్రామాలలో శాంతి నెలకొనడం మాఅనుభవపూర్వక ప్రమాణము. ] ఈకార్యక్రమానికి ముందుకు వచ్చేవారికి ఆర్ధికంగా ఎటువంటి భారము కలగకుండా మేము పద్దతిని తెలియజేస్తాము.
అలాగే పట్టణాలలో కూడా అన్ని ఆలయాలలో ఒకేసమయములో ఈకార్యక్రమన్ని జరుపవచ్చుకనుక ఎక్కువమందికి మేలు కలుగుతుంది. అక్కడ వుండే ఆథ్యాత్మిక సంస్థలను కలుపుకుని ఈకార్యక్రమాన్ని జరిపేందుకు మీసహాయన్ని అందించవచ్చు.

7. మీకు అందుబాటులోనున్న అథ్యాత్మిక సంస్థలతో ఈకార్యక్రమ ప్రతినిధులుగా మీరు సంప్రదింపులు జరిపి వారి సహకారాన్ని కోరవచ్చు.
8. ఇక్కడ మీరుగాని మేము గానీ చేస్తున్నది భక్తిమార్గములో దాసజన పోషకుడైన హనుమంతుని సేవేకనుక మీరు ఈసేవలో స్వామి కరుణఅపారంగా పొందవచ్చు.

9. మీలో ఉండే సాధకులు మీసంకల్పాలను లోకక్షేమం కోసము చెప్పుకుని అందుకొరకు మీకు ప్రాప్తించిన ఉపదేశమంత్రసాధనలు చేయవచ్చు.
10. మీలో వున్న సంభాషణా నైపుణ్యాలను ఉపయోగించి పలువురకు సత్సంగాలద్వారా హనుమత్ మహిమలను బోధించి వారిలో ప్రేరణ కలిగించవచ్చు.
11. మీరు ఈకార్యక్రమానికి స్వయంప్రకటిత కార్యకర్తలై పీఠమునకు,సాధకులకు అనుసంధానకర్తలవ్వవచ్చు.[ఇక్కడొక చిన్నమనవి.ఈకార్యక్రమానికికై పీఠముతరపున ఎవరిదగ్గరనుంచి ఆర్ధికంగా సహాయాన్ని యాచించరాదు.]

12. ఈసమయములో రాస్ట్రములో హనుమ్మద్దీక్షలు తిసుకునే స్వాములు వుంతారు కనుక వారిని కలుపుకుని ఈకార్యక్రమానికి విస్తృత రూపాన్నివ్వవచ్చు.

పూజ్యులు అన్నదానం చిదంబరశాస్త్రి గారిలాంతి హనుమదుపాసకులు ,పలువురు బ్లాగ్ మిత్రులు సత్సంగ నిర్వాహకులు తమతమ సహకారాలను అందివ్వదానికి ముందుకొస్తుండటం ,స్వామివారి మహిమకు నిదర్శనం.పలుగ్రామాలనుండి తమగ్రామాలలో ఈకార్యక్రమాలు జరిపేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తున్నారు.
సమయము చాలాతక్కువ ,ఆర్ధికంగా ఎటువంటి అండ లేదు,స్వామి అనుగ్రహమనే కొండతప్ప. కనుక ఈకార్యక్రమాన్ని ముందుకు తీసుకెల్లటం అనే భారాన్ని భక్తులమీదనే మోపటం జరుగుతున్నది.ఇక్కడ ఎవరో చెబితే,ఎవరి అదేశాలతోనో మీరు ఈసేవ చేయటం లేదు అనే విషయాన్ని మనసులో ఉంచుకోవాలి మీరు. ,మనచుట్టుపక్కలవాల్లంతా క్షేమముగావుంటేనే మనము సుఖం గావుండగలము కనుక ,కలియుగములో పెరుగుతున్న పాపాలఫలితంగా ఎదురవుతున్న ఉత్పాతాలనెదుర్కొనే ధర్మవీరులుగా హనుమత్ భక్తులుగా మనందరము ఇందులో కలసి సాగుదాము.

ఈకార్యక్రమము పట్ల ఎటువంటి అనుమానాలున్నా నిర్మొహమాటంగా మమ్మల్ను ప్రశ్నించవచ్చు. మీ సందేహాలని తీర్చుకొవచ్చు.

బ్లాగర్లకొకమనవి
---------
ఈకార్యక్రమాన్ని మరింతమందికి చేర్చేందుకు సహకరిస్తుంది కనుక ఈక్రింది లింకును మీ బ్లాగులో ఉంచిగలిగితే
యాగము పూర్ణాహుతైనదాకా ఉంచవలసినదిగా మనవి.

http://durgeswara.blogspot.com/2009/03/blog-post_02.html">http://www.ramaraju.org/hanuman.png"/>

భక్తజన పాదదాసులు
హనుమత్ రక్షా యాగ నిర్వాహకదాసులు
మరియు

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
ప్రధాన సేవకుడు
దుర్గేశ్వర

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP