జ్యోతిష్యవిద్య భయ పెట్ట టానికి కాదు భయం తీర్చడానికి
>> Saturday, February 14, 2009
జ్యోతిషశాస్త్ర విజ్ఞానమును మనకిచ్చిన మహర్షుల ఉద్దేశ్యము భవిష్యత్తును చూచి భయపడి పారిపోవటానికో దుఖి:స్తూ కృషించడానికి కాదు. భయంకరమైన నది లాంటి సంసారము లో ఈదే జీవులు ఇక్కడసుడిగుండాలున్నాయో,ఎక్కడ భయంకర కాలసర్పాలున్నాయో,ఏప్రాంతములో ఏసమయానికి మిమ్మల్నిమింగాలనిమొసల్లు కాచుకుని వుంటాయో తెలియజేయటము.తెలియటము ద్వారా భయపడటము కాక జాగ్రత్తలు తీసుకుని ఆప్రమాదాలనుంచి లేక ఇబ్బందులనుంచి తెలివిగా తప్పుకుని సాగిపోవటమే వారు కరుణతో మనకందించిన ఈవిద్య లక్ష్యము. ఈ ప్రయాణము ఆపుదామన్నా ఆగేది కాదు,దాని సమయము పూర్తయినదాకా.కనుక నదిని ఈది దాటటము ప్రమాదకరము,కష్టతరము.కాని నదిని ఈదక తప్పదు. మొండిగా ఈదుతానిని దిగి కొందరు అలసి సొలసి ఈదితే,ఈలోపలకొందరు అంతమయ్యేదికూడా మధ్యలో జరుగుతుంది.
తెలివి అదృష్టవంతుడు ఒక చెక్కనో దుంగనో ఆధారము చేసుకుని ఈదుతూ తన శ్రమను కొద్దిగా తగ్గించుకుంటాడు.తెలివి కలవాడు ఒక పడవను తయారు చేసుకుని దానిని నడుపుకుంటూ ప్రమాదాలు దాటుకుంటూ వెళతాడు. భగవన్నామము అను ఓడను ఎక్కిన వాడు పూర్ణవిశ్వాసముతో నిశ్చితముగా ,హాయిగా ,విశ్రాంతిగా ,సునాయాసముగా ఈనదిని తరిస్తాడు.
ఈఈ ప్రమాదాలు ,గండాల గుండాలు ఎక్కడున్నాయో ప్రయాణముళో ఏసమయానికి మీకెదురవుతాయో తెలియజేసే స్పష్టమైన మ్యాపు జ్యోతిష్యము మనకిస్తుంది. దానిని చూసి భయపడి ప్రయాణము చేసినంతసేపు ఏడవడము కాదు.వివరాలు తెలిసాయికదా అన్న ధైర్యముతో సాగాలి.
ఆవిద్యను కూడా మనకిచ్చారా మహానుభావులు. అసలు మనిషి జీవిత విధానము ఈ ప్రకృతి లో ఏశక్తులు నియంత్రిస్తున్నాయో పరిశోధించి దర్శించి వాటి పరిష్కార మార్గాలను కూడా ఇచ్చారు.ఇంకా ఈప్రాకృతికశక్తులన్నీ ఏదివ్యచైతన్యముద్వారా నియమాత్మకముగా నడపబడుతున్నాయో ఆ పరాశక్తి ని ఆశ్రయిస్తే ,ఆశక్తితో మమేకమైతే ఇక సృష్టిలో ఎవరికీ భయపడవలసిన అవసరము లేదనే సత్యాన్నివారు కరుణతో మనకు బోధించారు. ఈపుణ్యభూమిలో మాత్రమే లభించినది ఈదివ్య విద్య.
ఇక మనకు ఈమధ్య ఆరోగ్య సృహ బాగాపెరిగినది. వ్యాధి రాకముందే అనేక రకాల వైద్య పరీక్షలు చేపించుకుంటున్నాము.అక్కద అన్ని పరీక్షలు చేసి వైద్యులు నాయనా ! నువ్వు ఈనూనెలు ఎక్కువ వాడితే నీకు గుండెపోటు రావచ్చు.నీ శరీరములో ఫలానా పదార్ధము ఎక్కువవుతున్నది దీనిద్వారా ఫలానా వ్యాధి వచ్చేఅవకాశమున్నది అని హెచ్చరిస్తే మనమేమి చేస్తాము. ఏడుస్తూ నాకావ్యాధి వచ్చేస్తున్నది అని తిండితిప్పలు మాని కూర్చుంటామా? లేదే! దానికి తగు జాగ్రత్తలు తీసుకుని రాబోయేప్రమాదాలనుంచి తప్పించుకుంటాము. ఎందుకండీ ఏపరీక్షలు లేనిపోనిది వల్లు చెప్పాక బాధపడాలి అని ఆపరీక్షలజోలి కెల్లకపోవటము మన ఇష్టాఇష్టాలకు సంబంధించినది. ఎక్కడో ఒక చోట కొందరు దుర్మార్గులైన వైద్యులు లేని రోగలక్షణాలను చెప్పి దోచుకునేవారుండవచ్చు,అంతమాత్రాన అది వైద్య విద్యకు సంబంధించిన లోపము కాదుకదా?
ఇక్కడ ఇంత ఉపోద్ఘాతము చెప్పేదెందుకంటే ఈమధ్య ఏదో ఉడతాభక్తిగా నేను చేస్తున్న ప్రయత్నానికి స్పందించి చాలామంది మిత్రులు అనేకవిషయాలపై నామీద నమ్మకముంచి నన్ను తమ ఆత్మీయునిగా భావించి తమ కుటుంబసభ్యులకు కూడా తెలుపని విష్యాలు నాకు తెలుపుతూ సమస్యకు కారణాలు పరిష్కారాలు సూచించమని వ్రాస్తున్నారు.ముందుగా నాపై ఇంతనమ్మకముంచిన నావారందరికి ధన్యవాదములు.
ఇక జ్యోతిష్యశాస్త్ర ఆధారముతో వారి సమస్యలకు మూలాలను తెలుసుకుని.నాకు గురువులు ప్రసాదించిన భగవన్నామమనే సంజీవనిని నాకోసమేగాక వారికి కూడా అందిస్తున్నాను. ఆకలైన వారు కోసము వంటచేసుకునితినాలి.ఓపిక లేనప్పుడో,లేక చేతకానప్పుడో మనమేదో వండి పెడతాము కానీ తిని ఆకలి తీర్చుకోవలసిన పని వారికేసాద్యము,వారే ఆపనిచేయాలి. కాదులే మాస్టారూ ,తినే ఓపిక లేదు మీరేతిని పెట్టండి అనే సోమరి పోతులకు మనమేమీ చేయలేము.ఆతినే స్థితి కూడా లేనివారి కోసమైతే ఏదో ఒక" సెలైన్ "ఓపిక తెచ్చేందుకు కట్టడానికి సాధ్యమవుతుంది కాని పూర్తి శక్తిని పొందాలంటే తిరిగి ఆజీవి తన ఆహారాన్ని తానే తినాలి.ఇదీ నాకు తెలిసిన మార్గము .
నాకు సమయము తక్కువగా వుండటము ,విశ్లేషణలో పలువురి పరిశీలన లో ఎక్కడలోపాలున్నా బయటపడతాయనే ఉద్దేశ్యము తో ముందుగా మీరు ఎవరన్నాజ్యోతిష్యవేత్తలను కలుసుకుని మీజాతకము పరిశీలించి ప్రస్తుత స్థితిని తెలపమని కోరుతున్నాను. ఇక్కడ బ్లాగులలో వున్న కొంతమంది నిష్ణాతులైన జ్యోతిష్యవేత్తలకు పంపమని వారి చిరునామాలిస్తున్నాను ఈమధ్య.వారిలో కొందరు నామమాత్ర దక్షిణతో వారి జాతక వివరాలు వ్రాసి పెడుతున్నారు. భగవంతుని దయవలన నాకు చేతయిన నోటి మాటగా చెప్పిన భగవత్సెవా క్రియలు అనుసరించి చాలామంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్న వారివలన నాకు సంతోషమవుతున్నది.నేప్రారంభించిన పని వలన వీళ్లకన్నా మేలు జరుగుతున్నదని.అయితే భక్తివారిది,శక్తి ఆపరమాత్మది. ఇందులో నాప్రమేయమేమీ లేదు. ఇది నిజం.
ఇక వీరిలో ఒకరిద్దరు ఈ జాతక వివరాలు చూసి తాము నిసృహ చెందామని వ్రాస్తున్నారు. వారి కోసమే ఇదంతావ్రాయటము. వివరాలు తెలిశాక సంతోషించలికాని బాధపడటమెందుకు. వైద్యులు విశ్లేషణచేశాక అనేక రోగలక్షనాలతో వాటి నివారణకు పలు ఔషదాలు సూచించవచ్చు అది వారి ధర్మము. కాని కాంప్లెక్శ్ ఔషధము లాంటిది భగవన్నామము .ఆదివ్యౌషధాన్ని సేవించినవారికి తిరుగులేదు.అద్బుతాలు జరుగుతాయి. ఇవి నేను ఎవరో చెబితేవిని,చదివి చెప్పే మాటలు కాదు నాజీవితమును ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాలగా మలచుకొని సాధించిన[ఇక్కడఅమాటతప్పలేదు,అవి భగవంతుడు ప్రసాదించినవే] ఫలితాల ద్వారా మీకు చెప్పగలుగుతున్నాను. కనుక మీరు తీవ్రముగా శ్రమించండి. ఎలా అంటే అమెరికా ఎల్లాలంటే అనుమతి పత్రాలకోసము రోజులతరబడి లైన్లో నిలబడి ప్రయత్నిస్తారే అలా! ఒకరు మీరు చెప్పిన విధముగా 108 ఒకే ఆసనములో హనుమాన చాలీసా చేయలేకపోయానండీ నావల్ల కాలేదు .నాస్థితి ఇలావున్నదని వదలి వేసేలా మాట్లాడారు.ఇక్కడేమి జరిగినది.ఆలోచించండి. అది పనిలా భావించారు.అందువలన విసుగొచ్చినది. అదే మనకి ఇష్ట మయిన దానికోసమయితే ఎంతశ్రమకైనా బాధపడము.ఔనా?కాదా?
ఒక్కటి నిజం నమ్మండి ,భగవన్నామము,గురువు, ,మంత్రము,వైద్యము విశ్వాసాన్ననుసరించి మాత్రమే ఫలితాలనిస్తాయి. ఇది ఎవరికోసమో మనము చేయటము లేదు.అన్నింటికన్నా ఆనందదాయకమైన భగవంతుని సాన్నిహిత్యానికి అర్హతపొందుతున్నమన్న సృహ రావాలి .ఏదో మొక్కుబడిగా పనిచెస్తే లాభం లేదు. కబీర్ దాస్ గారన్నట్లు చేతిలో జపమాల గిరగిరా తిరుగుతోంది,దానికన్నా వేగంగా మనసు ప్రపంచాన్ని చుట్టివస్తున్నది అన్నట్లుగా వుంటె ఫలితం శూన్యము. ఇక వెర్రోడో మొర్రోడో చెప్పిన వానిపైన పూర్ణవిశ్వాసముంచాలి ,చెప్పిన విషయము పట్ల నమ్మకముండాలి.ఏదో ఒక రాయి విసిరితే తప్పేమున్నది అనేలా సాగకూడదు సాధన.
నెను దీనిద్వారా తప్పనిసరిగా సాధించగలననే నమ్మకము భగవశక్తి పట్ల విశ్వాసముముఖ్యము.మీకిందకంటె నేనేమి చెప్పలేను.శుభం భూయాత్.
1 వ్యాఖ్యలు:
చాలా బాగా చెప్పారు
Post a Comment