శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హెచ్చరికలొస్తున్నా పట్టించుకోవటం లేదు

>> Tuesday, February 17, 2009

తనతండ్రి చేయాలనుకున్న అనేకపనులు చేయకుండానే అంటే చేయాలనుకున్నవి,పూర్తిచేయకుండానే చనిపోయాడు.అది చూసిన అతని కుమారునికి చావంటే భయం కలిగినది.దాంతో చావును జయించాలనే కోరిక కలిగినది. యముడికోసం తపస్సు ప్రారంభించాడు.తీవ్రమయిన అతని తపస్సుకు మెచ్చి యమధర్మరాజు ప్రత్యక్షమయి ఏవరం కావాలో కోరుకోమన్నాడు.

"నాకు చావు రాని వరం ఇవ్వు స్వామి"

పుట్టాకగిట్టకతప్పదు .చావులేనివరం ఎవరూ ఇవ్వలేరు ,నిరాకరించాడు యముడు.
ఎలామరి.మానాన్నలా నేను చేయాల్సిన పనులు పూర్తి చేయకుండా చావటం నాకిష్టములేదు.చెప్పాడతను.

నీమరణానికి ముందుగా నిన్ను నాలుగుసార్లు హెచ్చరిస్తా ,చేయాల్సిన పనులన్ని త్వరగా చేసుకో ,కావాలంటే ఆవరం ఇస్తాను అన్నాడు యముడు.

సరే,గుడ్డిలో మెల్ల అదన్నా ఇవ్వండి.అంగీకరించాడతను.

ఆతర్వాత యముడు అతనికి మరెన్నాడూ కనపడలేదు. కానీ అతనిని తీసుకు వెళ్లటానికి యమభటులొచ్చారొకరోజు.

ఇదన్యాయం!వెళ్ళి మీప్రభువునడగండి నన్ను మరణానికి ముందు నాలుగు సార్లు హెచ్చరిస్తానన్నాడాయన.ఆవరం ఏమైనదో కనుక్కుని నన్ను తీసుకు వెల్లండి. అభ్యంతరం చెప్పాడతను.

ఇందులో ఎలాంటి అన్యాయం లేదు. మాప్రభువు నిన్ను నాలుగుసార్లు హెచ్చ్రరించానని చెప్పారు మాతో కావాలంటే నీ అనుమానము మాతోవచ్చి ఆయననే అడుగు.అన్నారు వారు.

నువ్వు నన్ను ఒక్కసారికూడా హెచ్చరించలేదు.అన్యాంగా నన్ను తెప్పించావు,నిష్టూరమాడాడాతను.

నీకు మాటిచ్చిన ప్రకారమే నాలుగుసార్లు హెచ్చరికలు పంపానయ్యా ,అన్నాడు యముడు.

ఎప్పుడు చెప్పావు? ప్రశ్నించాడు.

నీజుట్టు తెల్లబడటం నామొదటి హెచ్చరిక.నీపళ్ళు వదులవటం ఊడటం మొదలు పెట్టినది నారెండవహెచ్చరిక

నీకంటి చూపు మందగించటమే నా మూడవ హెచ్చరిక

నీవంటి మీద చర్మం మడతలు రావటము ఆఖరి హెచ్చరిక ,జవాబు చెప్పాడాయన.

ఈ హెచ్చరికలు ప్రతివారికీ పంపుతూనే వున్నాడు యమధర్మరాజు అందరికి.రంగులేసి మనసును మభ్యపెట్టుకోవటము కాకుండా మనము చేయవలసిన మంచిపనులను త్వరగా చేయాలి. చేయాల్సిన అసలు పని భగవంతుని చేరుకునే ప్రయత్నము త్వరగా చేయాలి.లేకుంటే సమయము ఆగదు మనకోసము.

3 వ్యాఖ్యలు:

Unknown February 17, 2009 at 3:12 PM  

బాగుందండి

Unknown February 17, 2009 at 4:30 PM  

నిజమే, దేవుడు ఎన్నో సూచనలు హెచ్చరికలు ఇస్తాడు . అయినా ఆయన చెప్పేవి అర్ధం చేసుకుంటే మనం మానవులమెందుకవుతాం. దేవునితో సమానమవ్వమా!!

పరిమళం February 17, 2009 at 8:47 PM  

బావుందండీ ...యమధర్మ రాజు హెచ్చరిక .భగవంతుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చక్కటి కధతో చెప్పారు. ధన్యవాదాలు .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP