e-తెలుగు కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల..మా తల్లీ కన్నీరుపెడుతోందో....
>> Thursday, February 12, 2009
నిన్న నాకొక మిత్రుడు చాట్ లో కలశాడు.ఆయన వ్యక్తపరచిన అభిప్ర్రయాలను మీముందుంచటము నా బాధ్యత అని తలచి ఇక్కడవుంచుతున్నాను.ఇది నిజమో కాదో తేల్చాల్సిన అవసరము మనకున్నది.నన్ను అనవసరముగా నిందించవద్దు.వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు కదా పెద్దలు.చదవండి ఆలోచించండి.నిజమేదో తేల్చండి.
*******************************************************************************************
మిత్రుడు: నమస్తే దుర్గేశ్వరగారూ,బ్లాగులలో చెలరేగుతున్న అలజడులను గురించి మీరు వ్రాసిన పోస్ట్ చదివాను.
నేను : ధన్యవాదములు
మిత్రుడు: మీ వైపుననుంచి మీ ఆలోచనలననుసరించి వ్రాసినది కాదనను గానీ,అసలు కారణము గమనించటము లేదనిపిస్తున్నది.
నేను : ఏదో తెలియక వచ్చిన విబేధమేకదండీ! సర్దుకుంటాయి లే .కాలం అన్ని గాయాలను మాన్పుతుంది.
మిత్రుడు: ఇది ఖచ్చితముగా కావాలని వ్యూహాత్మకంగా పన్నుతున్న కుట్రండి.
నేను : ఇందులో కుట్రలకు తావెక్కడున్నదండీ? ఎవరాస్తులు ఎవరికొస్తాయి.ఎవరిసొమ్ము ఎవరికి దక్కుతుంది కుట్రలవల్ల?అలాంటి పని ఎవరి కవసరము
మిత్రుడు: అక్కడే దారి తప్పుతున్నారు.
నేను : అదేమిటి అలా అన్నారు?
మిత్రుడు: నేనుదాదాపు తెలుగు బ్లాగులు మొదలెట్టిన కాడనుండి చూస్తున్నానండి.వ్రాయటము లేదుగాని.నేను గమనించిన విషయాలు మీకర్ధము కావాలంటే నేనడిగేవాటికి సమాధానము చెప్పండి.మీరెప్పుడు వచ్చారు ఇక్కడకు?
నేను : దాదాపు ఎనిమిది నెలలు పూర్తికావస్తున్నది.
మిత్రుడు: అప్పటికి అంతర్జాలములో వ్రాస్తున్నవారు వెయ్యి లోపే.ప్రారంభములో వేళ్లమీద లెక్కపెట్టేటంతమంది మాత్రమే.ఉండేవారు.
ఇప్పటి పరిస్థితి చూశారా గణనీయముగా పెరుగుతున్నారు.తెలుగు బ్లాగర్లు.మీరెలా వచ్చారు ఇక్కడకు?
నేను : నేను తెలుగు దినపత్రికలో చూశాను,ఆతర్వాత ప్రయత్నించి వచ్చి కొంతమంది బ్లాగ్ మిత్రులసహకారము ,జ్యోతిలాంటివారి సాంకేతిక సహాయముతో ఇక్కడ వ్రాస్తున్నాను.
మిత్రుడు: అంటే ప్రచారము ఎక్కువవుతున్నకొద్దీ ,తెలుగు బ్లాగులు జనాలను ఆకర్శిస్తున్నాయి ,బ్లాగర్ల సంఖ్య పెరుగుతున్నది.అవునుకదా?
నేను: అవును.
మిత్రుడు: మరి పెరగటము వలన ప్రయోజనమేమిటి?
నేను : అదృశ్యమవబోతున్న భాషల లిశ్ట్ నుంచి తెలుగును కాపాడుకునే ఒకానొక ప్రయత్నము ఇది.దీని మూలముగా మాతృభాష పట్ల అభిమానము కలవాల్లు అంతా ఒకచోట కలసుకుని తమ అభిప్రాయాలను పంచుకుని తగుప్రయత్నాలు చేయవచ్చు.
మితృడు : అలా చేయటము వలన సంస్కృతీ సంపదలను కాపాడుకునే అవకాశమున్నది కదా?
నేను : అవునండీ
మిత్రూడు: మరి సంస్కృతీ ధ్వంసము చేయాలని ప్రయతనము చేసే శక్తులకు ఇది కంటగింపుకదా?
నేను : కావచ్చు. కానీ ఈచిన్నప్రయత్న మొకటే సంస్కృతులను కాపాడుతుందా?
మిత్రుడు: ఇందులో మరొక విశేషమున్నది. గతములో ఏ సాఫ్ట్వేర్ రంగానికి చెందినవారో మాత్రమే ఇక్కడకొచ్చేవారు. ఈరోజు ఉపాధ్యాయులవద్దనుండి ,వివిధవృత్తులవారు ఇక్కడ ప్రవేశిస్తున్నారు. అంటే మధ్యతరగతి మేధావి వర్గమంతా ఇక్కడ సమీకరించబడుతున్నది. భాష అనేఅంతస్సూత్రము ఇక్కడ వారి ఆలోచనలను ఒకటి చేస్తున్నది.ఇంకా ఆలోచించండి.
నేను : అవును ప్రతివారికీ తమ ఆలోచనలను వ్రాసి ప్రచురించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవాలనే కోరిక ఇక్కడతీరుతుంది.
ప్రస్తుతము ఫిఫ్త్ ఎస్టేట్ ప్రాధాన్యము పెరుగుతున్నది.ప్రజలే వివిధ అంశాలపై పత్రికలు పోషించవలసిన పాత్రను పోషించే వ్యవస్త రూపుదిద్దుకుంటున్నది.దాని లో ఒకరూపమే బ్లాగులు కూడా.
మిత్రుడు: ఇక్కడేవున్నది కీలకమంతా.ఏఉద్యమానికైనా మధ్యతరగతి మూలకారణముగా కనిపిస్తుంది చరిత్రపరిశీలిస్తే. ఇక్కడ భాషా సంరక్షణ కొరకు ప్రారంభించిన ఈవుద్యమము త్వరలోనే విశ్వరూపము ధరిస్తుంది. సాంకేతిక విజ్ఞానము అందరికీ అందుబాటులో వస్తున్నదివేగముగా. దానితో ఈసమీకరణ పెద్దదయి భావ వినిమయము జరిగి తమభాషను,సంస్ఖృతులను పరిరక్షించు కోవాలనే వాంఛ తీవ్రమయి నప్పుడు అది సంస్కృతీ పరిరక్షణ ఉధ్యమాలు పుట్టటానికి కూడా కారణము కావచ్చు . ముఖ్యముగా యువత జాగృతము కావచ్చు , సంస్కృతీ పరిరక్షణ ఉద్యమాల పట్ల ఆకర్షితులవవచ్చు కూడా భవిష్యత్తులో .కనుక ఈభాషలను, సంస్కృతులను ధ్వంసము చేయాలని అనేకవ్యూహాలను అమలు చేస్తున్న శక్తులకిది రుచించదు. కాబట్టి వాళ్లద్రుష్టి దీనిని మొగ్గలోనే తుంచాలని ఇటు మల్లవచ్చు కదా? గ్రంథాలయ ఉద్యమము నిజామురాజ్యాన్ని మట్టి గరపటానికి కారణమైనది కదా?
నేను : ఆలోచించవలసినదే.
మిత్రుడు: కనుకనే మొగ్గలో తుంచటానికి వాళ్లకున్న ఆయుధము విభజించు పాలించు[ధ్వంసముచేయి అని అనుకోవచ్చు] అనే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లున్నది కదా.
నేను : ఎలాగంటారూ?
మిత్రుడు: ఇప్పుడు కొంతమంది భాషపట్ల అభిమానము కానివ్వండి ,లేక వాళ్ల అభిప్రాయాలు సమాజానికి తెలియ నివ్వటానికి కానివ్వండి తమ వంతు కృషిచేసి ఇక్కడ ప్రచారాలద్వారా ,కూడలి లాంటి వేదికలను ఏర్పరచటము ద్వారా విజయవంతముగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.ఏదో ఒక ఆధారముంటేనేకదా ముందుకు సాగేది.కనుక ఆ ఆధారాలను దెబ్బకొట్టి బలహీనపరచటము లేదా ఈ వుద్యమానికి దూరంగా పరిగెత్తేలా చేయటము ఈ వ్యూహం.
నేను : కావచ్చు.దీనిని మీపరిశీలనలో ఎలా ధృవీకరించుకున్నారు?
మిత్రుడు : మీకు తెలియదు. మీరు రాకముందు దేశభక్తి యుతమైన ,దైవభక్తి యుతమైన బ్లాగులను ఎవరన్నా ప్రారంభిస్తే వారిని అవహేళన చేసి,రకరకాల వ్యాఖ్యానాలతో ఉక్కిరి బిక్కిరి చేసి ముప్పుతిప్పలు పెట్టెవారు కొందరు. కొందరు ఏమిటీ పీడ అని తమ బ్లాగులను మూసి వేశారు కూడా. తాడేపల్లి వారు,మీలాంటి మొండివారుమాత్రమేవారిని ఎదిరించినిలబడి ఆథ్యాత్మిక బ్లాగులను నిలబడి నడుపుతున్నారు.
నేను : ఇది మరీ ముఖస్తుతిలాగుందండీ
మిత్రుడు: నాకా అవసరము లేదండీ. ఇంకావినండి.ఇప్పుడు సహజముగా సున్నిత మనస్కులైన ఆడవారిని రెచ్చ్గగొట్టి వారిస్పందనలు రాగానే సాకుగా చూపుతూ వారి మానసిక స్థితి దెబ్బతినే దాడి చేస్తున్నారు. తద్వారా తెలుగు రచనల పట్లవుత్సాహమున్న స్త్రీలను ఈవైపుకు రాకుండాచేసే దుర్మార్గమైన వ్యూహమిది. ఆతరువాత బ్లాగు లోకములోనున్న ప్రముఖ బ్లాగర్లనందరినీ ఒక గ్రూపని ప్రచారము చేయటము ద్వారా వారిలో పరస్పర అనుమానాలు, కొత్తగావచ్చేవారికి వీరిపై భావన కలిగించి .చవుకబారు రచనలతో దీనిని నింపి,ఏమిటీ చండాలము అని బయటనుండి వచ్చేవారు గేటుదగ్గరనుండే వెనుతిరగటము చేయాలనేది ఉద్దేశ్యము.ఆతరువాత మాకెందుకీ గోల అని తమస్వంతఖర్చులతో అంతర్జాలములో తెలుగు ప్రచారానికి పాటుపడుతున్నవారంతా ఒక్కొక్కరుగా వెనుదిరిగేలా చెయ్యటము వ్యూహములో తరువాత దశలు.
నేను : నేను ఒకేసారి చూశానండీ .తెలుగు కోసము తపన పడుతున్న బ్లాగర్ లను హైదరాబాదులో.ఏ స్వార్ధము లేకుండా వాళ్ళు చేస్తున్న సేవ అభినందనీయము.
మిత్రుడు : వాళ్లలో e-తెలుగు గా ఏర్పడి మాత్రుభాషను ప్రచారము చేయాలని అనుకుంటున్నవారిలో ఎవరికన్నా ఏదైనా ప్రతిఫలమొస్తుందా? లేక ఈబ్లాగర్లతరపున ఏదయినా ఎమ్మెల్సీ సీటు ఇస్తారా? లేదు కదా? వీవెన్,శ్రీధర్ లాంటి వారు తమ సాంకేతిక నైపుణ్యమునుపయోగించి ఇక్కడ వెచ్చించే సమయంలో బయట వేల రూపాయలు సంపాదించుకోగలరు. కాని వాళ్ళకు ఏమిలాభమొస్తున్నదని ఈపని చేస్తున్నారు. కేవలము ఆత్మసంతృప్తి . వాళ్ళిద్దరని కాదు.నేననేది ఈరోజు భాషను బ్రతికించుకోవాలని అంతర్జాలములో తెలుగు వెలుగులను పెంచాలని పట్టుదలతో కృషి చేస్తున్న వారంతా రాబోయేతరానికి ఆదర్శపాత్రులే.వాళ్ళు ఈరోజు చేస్తున్నపని వాళ్లకోసము కాదు .తెలుగు జాతి భాషా సంస్కృతులని కాపాడు కోవటానికొరకే.
నేను: అవునండీ .వాళ్లలో తక్కువమందిని చూశాను.చదువరి,చావాకిరన్,మురళీ ,అనిల్. చాలామంది గురించి చదివాను, విన్నాను,సుజాత జ్యొతి,అరుణ ,దూర్వాసులగారు ,భవదీయుడు,కత్తిమహేష్, విహారి,వంశీ.యోగి ,శ్రీకాంత్ఇలా చాలామంది తెలుగును బ్రతికించుకోవాలని పాటుపడుతున్నారని కృషిచేస్తున్నారని.నాలాంటి వారు వాళ్లకృషిని కేవలము ఉపయోగించుకుంటున్నామని కూడా అంగీకరిస్తున్నాను.
మిత్రుడు : మరి ఇలావున్నవారిని మానసికముగా హింసలు పెట్టడము ద్వారా ఈపనినుండి పక్కకు వెళ్ళేలా చేయటము ద్వారా ఈఉద్యమాన్ని నిర్వీర్య పరచవచ్చు కదా?
నేను : ఆపని ఎవరు చేస్తున్నారని మీభావన
మిత్రుడు: నన్ను అడుగుతారేమి .ఆశక్తులకు చెందిన ఏజంట్లు అన్ని చోట్లా వ్యాపిస్తారు. ఇక్కడకూడా కాదంటారా?
నేను : ఏమో..కావచ్చు. మరొకటి కూడా జరగొచ్చు. మనవాళ్ళే కొందరు ఈ వ్యూహములో వాళ్లవుచ్చులో చిక్కుకుని ఏజంట్లుగా కనపడవచ్చుకదా?
మిత్రుడు : నిజం .ఆశక్తు లెప్పుడూ ప్రత్యక్షముగా తెరమీదకు రావు. భారతదేశచరిత్రలో మనవాళ్లతో బ్రిటీషవారి తరపున పోరాడినది కూడా మనవాళ్ళే సైనికులుగా .ఎటు చచ్చినా వాళ్లకే లాభం
నేను: హతవిధీ! చరిత్ర పునరావృతమవుతుందా?
మిత్రుడు : భలేవారే !వాళ్ళు వ్యూహాన్నెప్పుడు ముగించారు.ధశలవారీగా అమలు పరుస్తూనే వున్నారు.
నేను : కాలం మారినది. మనవాళ్ళు ఇంకా అంత అమాయకంగా వాళ్లచేతులలో వుండరు.నిజం గ్రహించి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తారు. వాళ్ల వ్యూహములో చిక్కి అశువులు బాసే అభిమన్యులేకాదు ఎన్ని పద్మవ్యూహాలనైనా ఛేదించగల సవ్యసాచులు మన బ్లాగుగుంపులలో నున్న యోధులు.ఆపై కురువృధ్ధులు,గురువృధ్ధులు వుండనే వున్నారు ప్రతివ్యూహరచనలను చేయటానికి.
మాతెలుగుతల్లికీ మల్లె పూదండ మాకన్న తల్లికీ మంగళారతులూ.
-----------------------------------------------
12 వ్యాఖ్యలు:
:)
ఛ!
దుర్గేశ్వరగారు, ఇందులో ఎవరి కుట్రలు కుతంత్రాలు లేవు. కొన్నిసార్లు అభిప్రాయభేదాలు వచ్చిన మాట నిజం. ఇక గొడవలకు కారణం అమెరికానో రష్యానో కాదు. మీరే చెప్పండి, కొద్ది నెలల క్రితం మొదటిసారి బ్లాగులోకంలో గొడవ అయింది. దానికి మూలకారణం ఎవరు? బ్లాగుల్లో దేశ వ్యతిరేక భావనలు వ్యాప్తి చేసేవారు, మనోభావాలు నొప్పించి రెచ్చకొట్టే వారు ఎవరు? అలాంటి "బ్లాగు తీవ్రవాది" వల్ల ఇలాంటి గొడవలు కానీ ఇందులో కుట్రలు కుతంత్రాలు లేవు. అలాంటి తీవ్రవాదులను తరిమికొడితే బ్లాగులు మళ్ళీ ప్రశాంతంగా కళకళలాడుతుంటాయి. ముందు ఆ తీవ్రవాదులను తరిమి కొట్టండి, అన్నీ అవే సర్దుకుంటాయి.
అంటే కణిక వ్యవస్ధ ఇక్కడ కూడా తన కార్యక్రమాలు మొదలుపెట్టిందన్న మాట(అమ్మఒడి.బ్లాగ్స్పాట్.కామ్). నిన్న కూడా నా బ్లాగులో ఎవరో కొత్తపాళీ గారి పేరుతో నా బ్లాగులో కామెంట్ రాసారు.పరికించి చూస్తే అది కొత్తపాళీగారు(బ్లాగర్ లోగో, ఫోటో మిస్సింగ్) కాదు.
for reference see 4th comment and first one in
http://newjings.blogspot.com/2009/02/blog-post_11.html
EmO...nijamEnEmO?? evariki eruka...
ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సి వార్త?
ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వారి నివేదికా?
చారులా, గూఢచారులా, పత్తేదారులా, వేగులా?
ఎవరక్కడ?
***
మొత్తానికి తాలిబానైజేషన్ ఆఫ్ తెలుగు బ్లాగ్‌లోకం అన్నమాట! అందుకనేనా మొన్నటి సభ గురించి ఎవరు ఇంకా నివేదికని ఇవ్వలేదు. e-తెలుగు వారు కూడ కిమ్మనటం లేదు.
***
ఆ ఐ న్యూస్ వారంటున్నారండి, "చెప్పాల్సింది ఇంకా ఉందంట."
అలా చెయ్యటం ఎవరికీ అంత సులభం కాదేమోనండి, ఎందుకంటే బ్లాగ్స్ ని విసిత్ చేసేవాళ్ళు అంత విద్యాధికులే . తొందరలోనే ఈ గొడవ అంతా సర్దుకుంటుంది.. కొంచెం ఓపిక పట్టండి..
'నేను రాయను గానీ అన్నీ గమనిస్తుంటాను' అని చెప్పుకున్నప్పటికీ, మీతో పై చాట్ చేసినది ఒక బ్లాగరి కావచ్చునని నాకనిపిస్తుంది. తన బ్లాగు టపాల ద్వారా ఆవిడ వ్యక్తపరిచే భావాలు, మీతో చాట్ చేసిన వ్యక్తి భావాలు ఒకేలా ఉన్నాయి.
ప్రపంచంలో ఎక్కడేమి జరిగినా అది భారతీయులకో, తెలుగువారికో వ్యతిరేకంగా చేసే కుట్ర అనే భావాన్ని వదిలించుకోవాలి మనం. ప్రతిదానికీ ఉలికిపడటం ఏ రకంగానూ వృద్ధికారకం కాదు.
ఆర్యా! దుర్గేశ్వర రావు గారూ! నమస్తే.
ఈ తెలుగు కన్నిరు పెడుతోంది లో మీరు మిత్రునితో జరిపిన సంభాషణ చూచాను.
మీ మిత్రుడు చెప్పుతున్నాట్టు యే వొక్కరూ దేనినైనా చెడదీసే ప్రయత్నం చేయరని నే ననను గాని మన తెలుగు బ్లాగ్లోకాన్ని మూసే మూకుడు ఉండదనిమాత్రం అంటున్నాను.
ఎవరడిగినా ఒకటే చెప్పండి.
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట అని.
తాటాకు చప్పుళ్ళను లెక్క చేసేవారేపనీ చేయ సమర్థులు కాలేరు. అని చెప్పండి.
జైహింద్.
భలే భలే! బాగా నవ్వించారు!:)
This is for Atom feed of comments.
అలెగ్జాండర్ దండయాత్ర దగ్గరనుండి అమెరికా అమలుపరచే కుట్రలదాకా ఒకే నిర్లక్ష్యము మనది.అదే మనపుట్టి ముంచుతుందంటున్నారు మిత్రులు.
సరే ముందుజాగ్రత్తలైనా తీసుకుంటే మంచిదే కదా!
ఇక ఈవ్యాసానికి అమ్మఒడి బ్లాగర్ కుఎటువంటి సంబంధము లేదు.దేశ భవిష్యత్తు కోసము తన జీవితాన్ని ఫణముగా పెట్టి పోరాటము జరుపుతున్న ఉన్నతురాలావిడ .చాటుమాటు పేర్లతో వ్యవహరించే రకము కాదని స్పశ్టమవుతున్నది ఆవిడ రచనలను చూస్తే.
ఇక తాలిబానీకరణ అన్న ఒంగోలుగిత్తా. వాళ్ళు మీకంటే వేయిరెట్లు నయం.వాళ్ళ్ భావాలు డైరెక్ట్గ్ గానన్నా చెబుతారు.మనసులో ఈదేశాన్ని ఏదో....నీకరణ చేయాలనే ఉద్దేశ్యము వుండి,పైకి మాత్రం హేతువాదముసుగులు తొడుక్కుని పనిచెస్తున్నవారితోనే అత్యంతప్రమాదము.వాళ్లపట్ల జాగ్రత్తగా వుందాము.
Post a Comment