ఎంతనోము నోచినాము మేమనీ...మేము మనిషికన్న అంతోఇంతో నయమనీ..
>> Sunday, February 8, 2009
ఎంత నోము నోచినాము మేమనీ...
మేము మనిషికన్న అంతో ఇంతో నయమనీ..
పెదవివిప్పి పలికినవీ కొన్నీ తమ మదిలోని మాటలనీ..
వెదురులన్నవీ.. తాము తనువు వంచి రామ ధనసు లైనామనీ....
పక్షులన్నవీ ..ఆపడతిజాడ ముందుగ మేం తెలిపినామనీ
ఇవయన్నీ అదుగుతున్నవీ... మీరేమి చేసినారనీ
మనుషులుగా మీరేమి చేసినారనీ.. //ఎంత//
పడవలన్నవీ ఆరాముని మేం గంగను దాటించినామనీ
పాదుకలన్నవీ ..పదునాలుగేండ్లు రాజ్యము మేమేలినామనీ
ఇవయన్నీ అడుగుతున్నవీ
మీరేమి చేసినారనీ...
మనుషులుగా మీరేమి చేసినారనీ..... //ఎంత//
కోతులన్నవీ కొం..డంతసాయము అందించినామనీ
వుడతలన్నవీ ...ఆవారధిలో ఇసుకను మేం రాల్పినామనీ
ఇవయన్నీ అడుగుతున్నవీ మీరేమి చేసినారనీ
మనుషులుగా మీరేమి చేసినారని... //ఎంత//
సృష్టి లో సకలజీవరాశి భగవంతుని సేవలో ఏదోవొక పని చేసి పాలు పంచుకుంటున్నది.
మరి మానవ జన్మ నెత్తినందుకు మీరేమిచేశారని మనలను ప్రశ్నిస్తే ఈగీతము లో లాగా ఏమని చెప్పాలి మనము.ఎలా సమర్ధించుకోవాలి మానవజాతి?
.ఎంతనోము నోచినాము మేమనీ...మేము మనిషికన్న అంతోఇంతో నయమనీ..
1 వ్యాఖ్యలు:
ప్రకృతి నిత్యం ఈ సత్యాన్ని పలు విధాలుగా చూపి బోధించినా అది గ్రహించలేని అజ్ఞాని మనిషని అన్యాపదేశంగా తెలిపారు. జ్ఞానసముపార్జన మార్గంలోనే సాగుతున్నానన్న నమ్మకమున్న నాకు ఇకసారి మళ్ళీ నన్ను నేనే పరికించుకునే అవసరం కలిపించారు + అవకాశమిచ్చారు. కృతజ్ఞతలు.
Post a Comment