ఈ బ్లాగ్ వీక్షకులకొక విజ్ఞప్తి
>> Saturday, February 7, 2009
ఈ బ్లాగ్ వీక్షకులకొక విజ్ఞప్తి
శ్రీవేంకటే శ్వర జగన్మాత పీఠం దాసులుగా సనాతన సాంప్రదాయాలను, విజ్ఞానాన్ని పదిమందికి మరొకసారి గుర్తుకు తెచ్చి దాని ఫలితాలను కలసి పంచుకోవాలనే ప్రయత్నములో భాగముగా ఈ బ్లాగును ప్రారంభించాము. భగవత్ ప్రేరణతో సాగుతున్న ఈ ప్రయత్నము విజయవంతమయి భగవద్భక్తుల సేవలో దిగ్విజయముగా సాగుతున్నది. ఎంతో మంది తామెదుర్కొంటున్న సమస్యలను ఆత్మీయతతో మాకు తెలియపరచటం,వాటి పరిష్కారానికి మహాత్ములందించిన భగవదుపాసనా మార్గాల లో సూచనలు ఇవ్వటము జరుగుతున్నది .భక్తి పూరిత హృదయాలతో వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు ,సత్ఫలితాలనిచ్చి వారికి ఎంతో మేలు జరిగినదని వారు తెలియజేస్తున్నారు. వారి వారి సమస్యలు పరిష్కారమవుతున్నాయని సంతోషము వ్యక్తము చేస్తున్నారు.దీనికి కారణము మహర్షులు ప్రసాదించిన ఆ మహత్తర నామముల మహిమ ,మీయొక్క భక్తి మాత్రమే కారణము అని వినమ్రమము గా మనవి చేసుకుంటున్నాము.
భగవంతు డిచ్చిన ఈ అవకాశమును వినియోగించుకుని భగవద్ భక్తులకొరకు ఇక్కడ పూజాదికములు జరపటము మా అదృష్టముగా నమ్ముతున్నాము.
" ఇక ప్రస్తుతము చాలామంది తమ జాతకఫలితాలు ఎలా వున్నాయని తమకెప్పుడు మంచి ఫలితాలు రానున్నాయని ,ఇలా
రకరకాలుగా తమ జన్మతేదీలను చూసి చెప్పమని పంపుతున్నారు."
మీ అందరికీ ఒక మనవి. మేము ఇక్కద భగవత్ సేవకు నియమింపబడ్ద దాసులము. మేము జాతకాదులను పరిశీలించి చెప్పే పని చేయలేము. ఆసమయము మాకు లేదు. బాధలు ,కష్టాలతో తల్లడిల్లుతున్న వారికొరకు భగవంతుని ప్రార్ధించి వారికొరకు పూజలు హోమాదులను జరపటమే చేయగలుగుతాము అదీ ఎవరినీ యాచించక ,వారంతట వారుగా భక్తులు సమర్పించే ద్రవ్యాలతో.అదికూడా మేము సూచించిన విధముగా భక్తితోభగవంతుని ఆశ్రయించగలవారి కోసమే.
ఐతే సమస్యా పరిష్కారాలలో జాతకఫలిత వివరాలు చాలా సహాయపడతాయి. కాని వాటిని విశ్లేషించి చూడగలిగే సమయము మాకు లేకున్నది.అందుకు తగిన పరిశ్రమకూడా మాకు లేదు. కాని ఎంతో ఆశతో మన జ్యోతిషవిజ్ఞానాన్ని నమ్మి ఆశతో తెలుసుకోవాలని వచ్చే వారిని నిరాశ పరచలేకున్నాము. ఇక్కడ తెలుగు బ్లాగర్ లలో ఎంతో మంది ఉద్దండులైన జ్యోతిషవేత్తలున్నారు. వారిని సహాయ పడమని అడిగాము. తాడెపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు,సత్యశర్మగారు,శ్రీపతి శర్మగారు లాంటి వారు న్నారు ఇక్కడ.ఐతే వారికున్న పనుల వత్తిడివలన అందరూ సహాయాన్ని అందించలేకపోయినా కొందరు ఉదారముగా నామ మాత్రము దక్షిణతీసుకుని జాతక పరిశీలన జరిపి వివరించటానికి ముందుకొచ్చారు. సమస్యలతో మా సహాయాన్ని కోరేవారు మాకు తెలియ జేస్తే ,అందుబాటులో వున్న ఆ జ్యోతిషవేత్తల అడ్రస్ లనిస్తాము వారికి మీ వివరాలు పంపి జాతక పరిశీలన జరిపించుకుని మాకు పంపితే మాకు చేతనైన విఢముగా భగవద్ సేవ ద్వారా వారికి సహాయపడటానికి సిద్దముగా నున్నాము.
దయచేసి మా పరిస్థితిని అర్ధము చేసుకోగలరు. ధన్యావాదములు మీఅందరికీ.భగవత్ సేవలో
భక్తజన పాద దాసుడు
దుర్గేశ్వర
1 వ్యాఖ్యలు:
మంచి ప్రయత్నం.హరేకృష్ణ
Post a Comment