శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్త్రీలను నెలసరిలో దూరంగావుంచటము..చర్చపై నా సమాధానము

>> Tuesday, January 27, 2009

ప్రకృతి కొన్నిధర్మాలను ఏర్పాటు చేసినది. వాటిని అర్ధం చేసుకుని ,సరయిన విధముగా జీవనాన్ని ఎలా సాగించాలో మన మహర్షులు ్ ఆచారాలుగా పొందుపరచారు. వాటిలో ఒకటి నెలసరి రోజులలో స్త్రీలను గృహ కార్యాలనుండి దూరంగావుంచటము.దీని వెనుకున్న కారణాలను తెలుసుకోవటము తరతరాలుగా మనకు పెద్దలనుండి వస్తున్నదే. ఐతే కొత్తతరాలకు ఇది తెలుసుకునే సమయము ఆసక్తి లేకపోవటము అర్ధవిజ్ఞానుల వితండవాదమే నిజమేమోనని నమ్మే పరిస్థితులవల్ల ఇలా మానవునికి మేలు చేసే ఆచారాలు కనుమరుగయ్యే ప్రమాదము కలుగుతుంది కనుక ఇలా కొన్ని చోట్లన్నా చర్చ జరిగినప్పుడు వాస్థవాలు తెలిసి ఈ ఆచారాలు విలువ గమనించు కుంటామనే ఉద్దేశ్యముతోనే ఇక్కడ చర్చ ప్రారంభించాము.చూసినవందలాది మందికి,స్పందించి తమ అభిప్రాయాలు తెలిపిన తాడెపల్లివారికి,ఎవరో అనామకులవారు వారికి,సోదరి మున్ని,జిలేబి,సుజాత పెద్దలు సహృదయులు బొల్లోజు బాబా,శ్రీ గారికి మరియు మాఆవిడ[ఆవిడకూడా తన అభిప్రాయం చెప్పినది గనుక] కు ముందుగా ధన్యవాదములు .
నా పరిశీలనలో విషయాలను కూడా వివరిస్తాను అవధరించండి.
*******************************************************************************************

1 స్త్రీ పురుషునికంటే ఎక్కువ పని చేస్తుంది. కనుక నెలలో నాలుగు రోజులు విశ్రాంతి ఇవ్వాలని ఈ ఆచారం పెట్టినట్లు వ్రాసారు అదీ నిజమే , అలాగే తాడేపల్లి వారి వివరణ సహేతుకమైనదే.
2. ఈమధ్య మహిళా ఖైదీలపై ఒక పరిశీలన జరి పారు. వారి లో ఎక్కువ శాతం నేరస్తులు తామునెలసరి రోజులలో ఉన్నప్పుడే ఈ నేరాలు చేసినట్లు వెల్లడైనది. నెలసరి రోజులలో వుద్రేకము కోపము చికాకు వంటి లక్షణాలు తమలో ఎక్కువగా వుంటాయని వారు వెళ్లడించటమ్ జరిగినది. ఆసమయములో మహిళలకు విశ్రాంతి నివ్వటం మేలనే నేటి మానసికవైద్యుల సలహా గూడా మనపూర్వీకుల వైజ్ఞానిక దృష్టిని తెలుపుతున్నాయి.

3 రెండు సంవత్సరాల క్రితం జరిగిన శాస్త్రజ్ఞుల పరిశోధన గొప్ప రహస్యాన్ని వెళ్లడించింది. మహిళ లో నెలసరి రోజులలో విడుదలయ్యే హార్మోన్ మెనిన్[దీనిపేరు సరిగా గుర్తులేదు కనుక్కుని మరలా పేరుదిద్దుతాను} వలన ఆమె శరీరం చుట్టూ విపరీతముగా బాక్టీరియాలు సూక్ష్మజీవులు వృద్ది పొందుతున్నాయని ,వీనిలో చాలా హానికరమైనవని వారు వెల్లడించారు. అంటే ఇటువంటి వైజ్ఞానిక రహస్యము తెలుసు కనుక మన పెద్దలు వారిని ఇల్లంతా తిరగవద్దని ఒకచోటమాత్రమే వుందాలనే కట్టు బాట్లు పెట్టారు.ఇందువల్ల ఆసూక్ష్మజీవులు అన్ని చోట్లా వ్యాపించకుండా వుండాలనే జాగ్రత్తతో. త్వరగా వీటితాకిడికి గురయ్యే పసిబిడ్డలను కూడా బహిష్టయిన స్త్రీ తాకరాదుఅని,సున్నితమైన పూల మొక్కలను కూడా తాకరాదని నిబంధనలు విధించారు.

4 ఇక వాళ్లకు తామస గుణాన్ని అంటె ఉద్రేకాలను పెంచే కారం ఉప్పు రుచులను తగ్గించి ఆసమయములో సాత్వికమైన తిండి నివ్వటములో ఎంత వైద్య విజ్ఞానము ఇమిడివున్నదో చూశారా! [ఇలా ఐతే మనం ఒప్పుకోము ఏ కార్పోరేట్ గురూజీనో ఇలా తినకూడదు ఉప్పు లేనిది తినాలి అంటే అప్పుడు గౌరవంగా ఆచరిస్తాము.]

5 ఇన్ని వైజ్ఞానిక సూచనలను మనం పైసా ఖర్చుపెట్టకుండా ఇచ్చారు కనుక చాదస్తముగా కొట్టి పారేస్తాము .అదే ఏ కార్పోరేట్ హాస్పటల్ వాల్లో పరీక్షలు జరిపి వచ్చ్న రోగాలు ఈ కారణమేనని చెబితే పేషంట్ లా బుధ్దిగా ఆచరిస్తామేమో.
6 ఇక ఆథ్యాత్మిక విషయాలకొస్తే మనిషిచుట్టూ జీవశక్తివలన ఒక తేజోవలయం వుంటుంది, సాధకులలో ,భగవంతుని ఆశ్రయించిన వారి లో ఈ తేజస్సు ఇంకా ఎక్కువ, అలాగే దైవపూజ జరిగే స్తలాలలో ఈ శక్తి ద్విగుణీకృతమవుతుంది.నెలసరి లోవున్న మహిళలలు ఆప్రాంతములో తిరగటము వలన ఆదివ్యశక్తి క్షీణిస్తుంది. జరగవలసిన మేలు జరుగదు.అంతేకాదు నెలసరి సమయాన సంభోగములో పాల్గొనటము వలన వచ్చే వ్యాధులను ఆయుర్వేదము వివరిస్తున్నది .కనుక వారిని దూరంగా వుంచటము మేలు. ఈ ప్రమాదాలన్నీ గమనించే మనవాళ్ళు ఈ నిబంధనలను విధించారు

మనకు మనపెద్దలు మలవిసర్జనకు వెళ్ళినప్పుడు నీళ్లతో శుభ్రం చేసుకోవాలనే ఆచారం పెట్టారు.మీరుఅనాగరికులు మీకుతెలియదు నాగరికత. మేము చూడు కాగితాలతో తుడుచుకుంటామనే నాగరికులు,వారి భావజాలాలతో ప్రభావితమై మన ఆచారాలను విమర్షిస్తూ ,అసలు మిగతా జీవజాతి మలవిసర్జనతరువాత కడుక్కుంటుందా ? మేము కడుక్కోవలసిన అవసరమేమిటీ మీది మూఢనమ్మకమని వాదించే మేధావివర్గాలను అలానే వర్ధిల్లనివ్వండి.

ఒక్కమనవి వినండి మనపెద్దలు పెట్టిన ఆచారాలన్నీ మానవజీవితానికి ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్నిచ్చేవే వాటిని పాటించటం మనకుమనము చేసుకునే మేలు.అది గమనించండి. వీలుచేసుకుని మన ఆచారాలను మనం పాటిద్దాము మన తరువాత తరానికందిద్దాము తద్వారా మహర్షుల ఆకాంక్షయగు మానవ సౌభాగ్యానికి తోడ్పడదాము.

6 వ్యాఖ్యలు:

Unknown January 28, 2009 at 4:17 AM  

మీ వివరణ బాగుంది

Anonymous January 28, 2009 at 5:30 AM  

it is a pity that people like yourselves can not understand the Hinduism concepts.This is not a subject to discuss/disapprove/approve. I can prove that my opinion is right but let us do something constructive.

durgeswara January 28, 2009 at 7:21 AM  

అర్జునునికి ధన్యవాదములు

ఇక మిత్రులు మీపేరేమిటో తెలియదు.కాని స్పందించి ఇక్కదకు వచ్చినందుకు ధన్యవాదములు.మీ ఆవేదన అర్ధమైనది. కాని మీరు ఈచర్చఏవుద్దేశ్యముతో జరిపినదో సరిగా అర్ధము చెసుకొనుటలేదు.హిందూ ధర్మము సంపూర్ణమానవ జీవితానికి ఖచ్చిఅతమయిన మార్గాలను చూపినది.దానిలో అనేక అంశాలు అనేక రీతులుగా బోధించబడ్డాయి మహర్షులచేత.సాంసారిక జీవనములో వున్న వ్యక్తులకు కొన్ని నియమాలు విధివిధానాలు నియమించారు వైజ్ఞానికరహస్యాలను మేళవించి .అవన్నీ మానవజీవితములో మానశిక,శారీరిక ఆరోగ్యాలను కాపాడేవే.వాటిని నిర్లక్ష్యము చేయటము వలన తరువాత దుష్ప్రభావాలు మనసుపై బడి మనసును ఉన్నతమైఅన ఆథ్యాత్మిక మార్గాన సరిగా పయనించనీయకుం్డా ఆటంకాలనేర్పరుస్తాయి.కనుక సాంసారిక జీవనములో వుండేవారికి నిర్దేశించిన విషయాలపట్ల పరిజ్ఞానము కలిగియుండటము అవసరము.దానిపై చర్చద్వారా అవగాహన కలిగించుకోవటం కోసము ఇలా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి.ఇక్కడ మనవిజ్ఞానాన్ని తెలియజేసుకోవటమే జరుగుతున్నదిగాని వేరొకటి కాదే? ఈ విషయాలే హిందూధర్మ సమస్తమని మేము చెప్పటము లేదే? కనుక అన్ని విషయాలు చర్చిస్తూ మనకున్న పరిధిలో మనము ధర్మాచరణ చేస్తూ ధర్మ ప్రచారము కూడా చేద్దాము. మీలాంటి నిబద్దత సాధికారత వున్నవ్యక్తుల అవసరము ఎంతో వున్నది.మీరు నన్ను పూర్తిగా అర్ధమ్ చెసుకుంటారని ఆశిస్తున్నాను.

మధురవాణి January 28, 2009 at 8:47 AM  

దుర్గేశ్వర గారూ..
మన ఆచార వ్యవహారల్లోని తెలియని కొన్ని కోణాలను చర్చించినందుకు ధన్యవాదాలు.

Anonymous January 29, 2009 at 11:13 AM  

Point Number 6 seems unlikely. If you have a great aura around you, it should cleanse the people around you and not diminish by other people's bad stuff. If your aura is diminishing because of people around you, you are nothing then.

Anonymous February 12, 2009 at 3:39 AM  

Oh my god...you have crossed your mad ness limits...

Idiot..first go and follow what I said in Geeta...get nirvaana by yourselves...and then come and write here....

if you write any one word after reading this blog means you have no respect for me....

Itlu...

God from heaven...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP