శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చిరంజీవి శశాంక్ కోసం ప్రార్ధించండి

>> Monday, November 17, 2008

చిరంజీవి శశాంక్ కు విధివిలాసంగా జరిగిన దుర్మార్గం ఎవరూ సరిచేయలేనిది. ఎక్కడో మనకు దూరంగా మృత్యువుతో పోరాడుతున్న ఆచిరంజివి క్షేమంగా వుండాలని మనందరకూ వుంది. కాని మనము అక్కడకెళ్ళి మనమేమి చేయలేనివారమైనాము. కాని మానవ మనోసంకల్పం గొప్పది. మనసులన్ని కలసి సంకల్పిస్తే ఆసంకల్పమే మహాశక్తిగా మారి ఆచిరన్జీవికి రక్షణ గానిలుస్తుంది , మృత్యుం జయుడైన ఆపరమేశ్వరుని కరుణ అపారము. మనందరమూ కలసి ప్రార్ధిస్తే ఆస్వామి అనుగ్రహించి తప్పక కాపాడుతాడని నా నమ్మకం .ఈరోజునుంచి పీఠములో అతని కొరకు రుద్రాభిషేకము మృత్యుంజయ మంత్రజపము చేయటం జరుగుతుంది. మీరంతా కలసి అతని కొరకు ఆబోలాశంకరుని ఓం నమ:శివాయ అనే మంత్రంతో అతనికి అపమృత్యువు తొలగాలని త్వరగా కోలుకోవాలని మిశక్త్యానుసారం జపించాలని మనవి.

2 వ్యాఖ్యలు:

లక్ష్మి November 17, 2008 at 6:13 AM  

may God bless him!!!

చిలమకూరు విజయమోహన్ November 17, 2008 at 8:08 AM  

చి.శశాంక్ ఆపదనుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP