శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్వామియేశరణమయ్యప్ప

>> Tuesday, November 18, 2008


స్వామియేశరణమయ్యప్పా అనే శరణఘోషలు ఆంధ్రప్రాంతమంతా మిన్నుమిట్టుతున్నాయి. ఎక్కడచూసినా నల్లనివస్త్రాలుధరించిన స్వాములు నిష్టానియమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పల్లవింపజేస్తున్నారు. భక్తితో తెల్లవారుఝాముననేలేచి చన్నీటిస్నానాలతో వారు భగవద్ భావనలో మునిగితేలుతూ మనసాంప్రదాయాన్ని అందులోనివిశిష్టతనూ సజీవంగ నిలుపుతూవున్నారు. ఆర్తులకండదండగా నిలచిన ఆదత్తమూర్తి అయ్యప్పగా వెలసి గాడితప్పుతున్న మానవాళికి సద్బోధచేసి మనుషుల లక్ష్యమెమిటో గుర్తుచేస్తున్నాడు. కలిమాయా ప్రభావానికి లోనై తమధర్మలను మరచిన మనుషులను ఆమాయా ప్రభావాన్నుంచి రక్షించడానికే ఆ శబరిగిరివాసుడు అఖండబ్రహ్మచర్యా దీక్షానిబద్ధుడై మార్గదర్శనం చేస్తున్నాడు.సమస్త మానవాళి సన్మార్గం వైపు మల్లేవరకు ఆదివ్య మకరజ్యోతి అలా దారిచూపిస్తూనేవుంటుంది .అదే ఆ అవతార లక్ష్యంకూడా. తమసోమా జ్యోతిర్గమయ. స్వామియే శరణం అయ్యప్పా.

5 వ్యాఖ్యలు:

Rani November 18, 2008 at 7:58 AM  

స్వామియేశరణమయ్యప్ప

Anonymous November 18, 2008 at 8:03 AM  

mI AnjanEya bomma kiMda ilA rAsi uMdi.

vaMdE saMtaM hanumaMtaM..

nAku gurtunnaMtalO adi ilA uMDAli.

vaMdE saMtaM SrIhanumaMtaM..

pATa/krUti O sAri check cEyaMDi.

MURALI November 18, 2008 at 9:40 PM  

స్వామీ, దీక్షలోని నియమాల వెనుక దాగి ఉన్న అర్ధం, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యాన్ని వివరిస్తే బాగుంటుంది.

Anonymous November 18, 2008 at 10:58 PM  

అయ్యప్ప స్వామి దీక్ష మండలం (4౦)రోజులు చేస్తారు కదా
ఆ నలభయ్ రోజులూ చెడు అలవాట్లకి దూరం గా వుంటారు కదా
సాధారణం గా ఒక జీవన విధానాన్ని నలభయ్ రోజులు అనుసరిస్తే దానిని జీవితం అంతా అనుసరించగలం .
అంటే ఆ నలభయ్ రోజులూ పొగ త్రాగడం కాని మద్యం సేవించడం వంటి పనులకి దూరం గా వుంటారు కదా ఆ విధానానికి మన శరీరం అలవాటు పడుతుంది ఆ తర్వాత మనం ఆ చెడు వ్యసనాల్ని సులభం గా మాని వేయవచ్చు .

ఇంకా స్వామి మాల లో వున్నా అన్ని రోజులూ నేల మీదే పడుకుంటారు అది మంచిదీ అంటారు చాల మంది
ఇంకా స్వాములు చాల శాంతం గా వుండాలి అందుకే భోజనం లో ఉల్లి వాడరు .ఎందుకంటే ఉల్లి రజోగుణాన్ని పెంచుతుంది ఆ గుణాన్ని అదుపులో పెడుతూ శాంతం గా వుండే అందుకే ఉల్లి వాడరు
ఇక దుంపలు తినకూడదు అంటారు అన్ని రోజులూ వాళ్లు నేల మీదే పడుకుంటారు కదా దుంప కూరలు తింటే వాతం ఎక్కువ అవుతుంది దానికి తోడూ చన్నీటి స్నానం కదా అందుకే దుంపలు తినరు .

ఆ నలభయ్ రోజులూ అబద్దాలు చెప్పరు శాంత మూర్తులయ్యి వుంటారు చూడగానే ఏదో ప్రసన్నత కనిపిస్తూ వుంటుంది వారి ముఖాలలో ఇటువంటి జీవన విధానం లో ఆనందాన్ని చవి చూసిన వారు తర్వాతి కాలం లో అలాగే వుండటానికి ప్రయత్నిస్తారు అని మా నాన్నారు చెప్పేరు

మా నాన్నారు ఈ రోజే ఇరుముడి ఎత్తుకుని శబరిమలై వెళ్లారు
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా !!!

(నేను రాసినదాంట్లో ఏమైనా తప్పులుంటే మన్నించగలరు నాకు తెలిసింది రాసాను :) )

durgeswara November 19, 2008 at 2:49 AM  

లచ్చిమి గారూ చాలా బాగావ్రాశారు.నాన్నగారు శబరిమలకు వెల్లారన్నారుగదా .శుభమ్ స్వామియేశరణమయ్యప్ప

మురళిగారూ ఇంకావివరించమంటారా.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP