శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహారోగం మలబద్దకం [నేడు వరల్ద్ పైల్స్ డే సందర్భంగా]

>> Thursday, November 20, 2008

మానవుని పీడిస్తున్న వ్యాధులలో ప్రముఖమయినది,ప్రస్తుతము 80 శాతం వ్యాధులకు కారణమవుతున్న ప్రధాన సమస్య ఇదే. దీనివలన వస్తున్న వ్యాధులన్నీ మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. మలబద్దకమువలన మనిషిని మానసిక అశాంతి,విసుగు కోపము, నిరుత్సాహము ఆవరిస్తాయి. తద్వారా తన దైనందిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించలేడు. ఎప్పుడైతే విసర్జింపవలసిన వ్యర్ధాలు శరీరములో నిలువ వుంటాయో అవి విషపూరితమయి ,గ్యాస్ ట్రబుల్ ,బి.పి షుగర్ లాఁటివ్యాధులకు కూడా ఒక కారణముగ మారుతున్నయి. అన్నిఁటికఁటే మనిషికి ప్రత్యక్ష నరకము చూపించే మలలు వ్యాధికి ఇదేఅసలు కారణమయి జీవితాన్ని దుర్భరం చేస్తుంటుంది.ఈరోజు ప్రపంచమలలవ్యాధి దినముగా వైద్యరంగము గుర్తించినదంటే అంత తీవ్రతకు. కారణము మలబద్దకమే. ఆయుర్వేదములో ప్రధానమయిన విధి .మూలచ్చేదన చేయటం. అంటే కారణము యొక్క వేరునుతెగగొట్టటం. వ్యాధులకు కారణమైన ఈ మలబద్దకాన్ని నివారించుకోగలిగితే సంస్యలను దూరం చెయ్యొచ్చు.

మనిషి ఆహార విహారాలలో తీవ్రమయిన మార్పులు రావటం మనదేశములో మలబద్ధకానికి కారణము. మనుషులు గంటలతరబడి కూర్చొని పనిచేయవలసి రావటం. శారీరిక వ్యాయామము తగ్గి పేగుల కదలిక సరిగాలేక పోవటం ఒక్ కారణము. అలాగే సాహజముగా పీచుపదార్ధాలు వుండే మన సాంప్రదాయక వంటకాల స్థానమ్లో పిజ్జాలు బర్గర్లు ,పీచుపదార్ధాలు లేని వంటకాలు వచ్చి చేరాయి. దానివలన ఆహారకదలికలు మందగించి పేగులలో మలం పేరుకుని పోతున్నది. అప్పుడప్పుడూ మన పూర్వీకులు విరోచనానికి వేసుకునేవారు తప్పని సరిగా దానివలన ఆహారణాళము పూర్తిగా శుభ్ర పడేది. ఆ మంచి అలవాటును పోగొట్టుకున్నాము. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడుతినటం వలన జీర్ణక్రియా వ్యవస్త క్రమశిక్షణను కోల్పోయి విసర్జన సరిగా జరగటం లేదు. దాని వలన మలవిసర్జన సమయములో గట్తిగా ముక్కటము వలన మలలు వస్తున్నాయి, వాటిబాధ తట్టుకోలేక మలవిసర్జన సరిగా జరగకుండానె లేచిరావటము మూలంగా సమస్య మరింత జటిలము అవుతున్నది.

కొద్దిగా వ్యాయామము ,పీచుపదార్ధాలున్న ఆహారము,పళ్లరసాలు వేళకు అన్నంతినటం. మజ్జిగ బాగా తాగటం నీరు వలసినంతగా తాగటం ఈసమస్యను తగ్గిస్తాయి .

చిన్నచిట్కా: - తాడికాయ,ఉసిరికాయ,కరక్కాయ ఇవిమూడూ పచారీషాపులలో దొరుకుతాయి. ఇవి సమాన భాగాలు తెచ్చుకుని వాటిని పొడుము చేసుకుని రాత్రిల్లు పనుకోబోయేముందు. ఒక స్పూన్ మజిగతోగాని మంచినీటితోగాని తీసుకోండి. పొద్దుటనే సాఫీగా విరోచనమవుతుంది. దానితో పాటు మలలు ,వెంట్రుకలు అకాలమ్లో తెల్లబడటం మొదలయిన చాలావ్యాధులు తగ్గుతాయి. దీనినే త్రిఫల చూర్ణం అంటారు.ఆయుర్వేదములో. చాలా బాగా పనిచేస్తుంది. ప్రయత్నించి చూడండి. స్వంతగానే తయారు చేసుకోవచ్చు దీనిని. అలాగే ఆరునెలల కొకసారైనా విరోచనానికి వేసుకోవడం అలవాటు చేసుకోండి.

7 వ్యాఖ్యలు:

Anonymous November 20, 2008 at 6:14 AM  

మంచి సమాచారం. మీరు వాటర్ థెరపీని కూడా నమ్ముతారా?

durgeswara November 20, 2008 at 7:00 AM  

waater theraphini koodaa prayogimchi phalitaalu mamchivi vaste acharimchavachchu

చిలమకూరు విజయమోహన్ November 20, 2008 at 2:18 PM  

water therapy ని నేను 2003 సం. అమలు చేస్తున్నాను .మంచి ఫలితాలున్నాయి.

Anonymous November 20, 2008 at 9:15 PM  

6 నెలలకొకసారి విరోచన సాధన అంటే ... బయట ఇంగ్లీష్ మందుల ద్వారా అయితే నాకు ఇష్టం లేదు.. ఆ సాధన ఎలాగో తెలుపగలరు... నేను మంచిదని చెప్పి అంతకుముందు నుంచే త్రిఫలచూర్ణం వాడుతున్నాను...

durgeswara November 21, 2008 at 2:45 AM  

sivagaaroo virochanaaniki aayurvedamamdulu koodaa vunnaayi medical shopulo dorukutayi

Anonymous March 17, 2010 at 10:07 PM  

taadikaya ante edntidi koddigaa cheppa galara.

balajilinks March 5, 2015 at 6:42 AM  

yes triphala churna is right medicine

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP