>> Saturday, October 25, 2008
క్షేపము మధ్యకాలములో రామాయణాన్ని అందులోని పాత్రల చర్యలని విమ్మర్శిస్తూ జరుగుతున్న చర్చలను చూస్తున్నాను. నాకు పనులవత్తిడివలన అందులోపాల్గొనటానికి సమయము దొరకలేదు. నా అభిప్రాయాలను మీతోపంచుకోవటానికి వీలుకాలేదు. నావుద్దేశాన్ని సరిగా అర్ధంచేసుకోగలరని ఇదివ్రాస్తున్నాను. నేను మీకంటే అధికంగా తెలిసిన వాడిననేగర్వముతోకాక రామాయణ ఔన్నత్యాన్ని విమర్శించడముద్వారా సంభవించేదుష్పరిమాణాల పట్ల భీతితోవ్రాస్తున్నాను.
ఏదైనా ఒక విషయాన్ని,లేదా వ్యక్తులచర్యలను మనం విమర్శించాలంటే మనం, ఒక విషయం గమనించాలి. ఆవిషయము పట్ల మనం సమగ్రమయిన అవగాహన కలిగి ఆవ్యక్తి కంటె వున్నత భావాలు .ఆచరణ కలిగి ఉండాలి. వారి చర్యలకంటె ఉన్నత చర్యలను సూచించగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. .మరి ఎదుటువారిలో.లేక వారి ప్రవర్తన తప్పుపట్టామంటే మనం వారికంటే ఉన్నతమయి ఉంటేనేకదా అర్హత. అర్హత లేకున్నా విమర్శించట మంటె ఆకాశం మీద ఉమ్మెయ్యటం లాంటిది. నాతోపాటు భారత సాంస్కృతీ సాంప్రదాయాలకు చెందిన వారిమంతా శ్రీరామున్ని భగవంతునిగా కొలుస్తాము. ఈదేశ ధార్మిక సామాజిక నీతులన్నీ రామాయణములాంటి మహా గ్రంథాలమీద ఆధార పడిసాగుతున్నాయని నమ్మేవాళ్ళము. కనుక మా మనోభావలను బధపెట్టె వారు మాకు కొన్ని అనుమానాలకు సమాధానాలివ్వాలు ఇవ్వ వలసిన బాధ్యత కలిగివుంటారు. అదే ఏ ఇతర మత గ్రంథాలనైనా విమర్శిస్తే ప్రతిస్పందనలు ఎలావుంటాయోమీకు అనుభవపూర్వకముగా తెలుసుగనుక మీ రెటూ వాటిజోలికి పోరు. వెళ్లమని మాఅర్థం కాదు. మాకు మా పెద్దలు సహనం ద్వారానే సమస్యలను ఎదుర్కొనటం అనేమార్గాన్ని బోధించి ఆచరించి చూపారుకనుక భారతధర్మానికి వారసులమని గర్వపడేమాకు మాపెద్దల మార్గములో నడవడమే చాతనవుతుంది. ఇప్పుడు ఈ రూపములోనయినా స్పందించకుంటే కలియుగములో అసత్య వాదనలకు మనుషులు లోనయి పక్కదారిపడతారనిచెప్పిన భవిష్య పురాణాది గ్రంధాలన్ని గుర్తుతెచ్చుకుని, ఈ అసత్యాల చే వంచించబడి కలిపురుషుని ప్రభావానికి లోనయి తమధర్మాన్ని తామేవిమర్శించుకుంటున్న కొందరు మాసోదరీసోదరులకు నిజం తెలుసుకునేఅవకాశం దూరం చేసినవారమవుతామనే ఉద్దేశ్యంతో ఇందులో పాల్గొంటున్నాము. శ్రీ రాముని తత్వాన్ని భగవంతునిగా కాకున్నా, ఒక వ్యక్తిగా విమర్శించాలన్నా ముందు ఈ క్రింది ప్రశ్నలకు మీమనసులో మీరే జవాబు చెప్పుకుని సాగండి.
1... ... రాముని వ్యక్తిత్వ మేమిటి. ఆయన సత్యవాక్పరిపాలకుడు. తానెప్పుడూ అసత్యమాడడు. పెద్దలఎడల గౌరవభావాన్ని ఏస్థితిలోనూ వదలడు. ఈ శరీరానికి కారణమయిన తండ్రి, తల్లి పట్ల ఎనలేని కృతజ్ఞతా భావాన్ని కలిగి వారిమాటెన్నడూ జవదాటడు. ఉదయాన్నే రాజయి రాజ్య మేలబోతున్నాడు. అపార సంపదలకు భోగభాగ్యాలకు అధిపతి కానున్నాడు. కానీ హఠాత్తుగా అడవులకు పొమ్మని తండ్రి ఆజ్ఞ . అదీ ఆయన చెప్పలేని స్థితిలో. ఇచ్చిన మాటకూ, ప్రేమకూ కట్టుపడి మతి చలించినంత పరిస్థితిలో అయినా సరే ఏమాత్రం చలించలేదు. మనసులో ఏ కల్లోలమూ లేదు. చిరునవ్వుతో సమాధానంగా ప్రయాణమయ్యాడు.
మీతండ్రి భాగపంపకాలలో మీ సోదరీ సోదరులకంటె కొంచెం తక్కువగా మీకు పంచినా లేక మీకు భాగం లేదు పొమ్మాన్నా. మీరుఇలానేస్పందించగలరా? త,డ్రినిర్ణయాన్ని తప్పుబట్టకుండా ఆయనను విమర్శించకుండా , ఎన్ని కష్టాలకోర్చయినా బ్రతకటానికి మీరు వెళ్ళగలరా? అంతటి స్వతంత్రవ్యక్తిత్వ సామర్ధ్యం మీకున్నదా?
2....... ... రాముడు అడవికి వెళుతుంటే ఎండకన్నెరగని ధనవంతుల బిడ్ద .ఎంత కష్టమో వనవాసం. అయినా తనను వారించిన భర్తను ఎత్తిపొడిచి, నేను ఇల్లాలిననుకున్నావా మరొకటా? భర్త సుఖాలలోవున్నప్పుడు పక్కనుండి ,కష్టాలలో పుట్టినింటికి వెళ్లటానికి ?అని వాదించి ఆయన వెంట వెళ్ళిన సీతామాత వంటి సంస్కారబలం కలవారు?గదా మీరు, ఆ .స్థిలో భాగం సరిగా పంచుకురాకపోతే మీరేమ్ మగాళ్ళు మనభాగమతా వెళ్ళి పంచుకువచ్చినదాకా నేను అన్నమ్ముట్టను. నీళ్ళుతాగని వేధించి అత్తమామలను సాధించే వైఖరి కలవారా?. [ మొగుడు తాగుబోతయినా. తిరుగుబోతయినా అతనిని వీడక కాపుఅరం సరిచేసుకుని భారత స్త్రీఔన్నత్యాన్ని లోకానికి చాటి చూపుతున్న తల్లులందరకూ పాదాభివందనం చేస్తూ క్షమించమని వేడుకుంటున్నాను] భారత స్త్రీల ఔన్నత్యానికి సీతమ్మను ఆదర్శంగా తీసుకోవటమే కారణమని భారతీయులందరి అభిప్రాయం. రావణుడు అపహరించిన తరువాత తన భర్త ఎక్కడున్నాడొ తెలియదు. వస్తాడొ రాడో తెలియదు. వాడు తనకు లొంగితేసర్వ సంపదలకు అధిపతినిచేస్తానన్నా, వాడిని చీకొట్టి గడ్దిపరకగా చూసి నట్లు చూసి, చావటానికయినా సిద్ధపడినదేకాని మానమును కోల్పోక కోట్లాది భారతీయనారీమణుల మనసులను పవిత్రభావముతో వుంచుతున్న ఆతల్లి ప్రభావం కాదనగలవారున్నారా? తనను అనుమానించినట్లుగా భావన తెలిసినా భార్యగా , ఆయన ఆజ్ఞను తలదాల్చిన ఆతల్లి మనోబలం మరొకరికున్నదా?? లోకానికి ఆదర్శపురుషునిగావుందవలసిన వ్యక్తికిసహచరిత్వం ఎంతకష్టమయినదయినా సార్ధకత చేకూర్చిన ఆతల్లి అడుగుజాడలను మించిన ఆదర్శం ఇంకొకటున్నదా?
3................తనకు అడవులకు పోవలసిన అవసరం లేదు. అయినా అన్నగారిసేవ కొరకు బయలుదేరినవాడు లక్ష్మణుడు. రాజ్యంనిరాటంకంచేసిపెట్టినది తల్లి. ఇద్దరు భాగస్తులు అడవులు పట్టిపోయారు. అయినా తన అన్నకు లేని రాజ్యభోగాలు తనకెందుకని కోపించి,త్యజించి ,అన్నదగ్గరకు వెళ్ళి రమ్మనిబ్రతిమాలి, ఆయన రాకుంటే నందిగ్రామములోనే నివసిస్తూ కఠినముగా తనశరీరాన్ని దీక్షలకు గురిచేసి బాధ్యతలను అన్నతరపున నిర్వహించిన భరతుడు అన్నదమ్ముల ప్రేమకు నిలువెత్తు నిదర్శనము. మీకు మీ స్వార్ధాన్ని త్యాగం చేసి అన్నదమ్ములకోసం పరితపించే మనసువున్నదా? అన్నదమ్ములకోసం అవసరమయితే మీ ధనాదులను కూడా వదలుకోగల సౌజన్యము త్యాగనిరతి మీకున్నదా? అప్పుడు మీరు రామాయణాన్ని విమర్శించ్టానికి ప్రయత్నం చెయ్యొచ్చు. ఇంకొంచెమ్ముందుకు పోదాము.
4....................... తండ్రి చనిపోయినా, తమ్ముడువచ్చి పిలచినా పెద్దలు సర్దుబాటు పద్దతులు చెప్పినా, జాబాలి లాంటివారు నాస్తిక వాదన చేసి మనసును మల్లించటానికి చూసినా చలించలేదు తన సత్యవాక్పాలననుండి. రాముడు. అవకాశము వచ్చినా ఋజుమార్గమునుండి పక్కకు మల్లని ఆత్మధైర్యం మీకున్నదా?
5......................అడవిలో వున్నప్పుడు అందగత్తెగా సూర్పణక వచ్చి వలచినది, ఎగతాళి చేసి పంపినాడెకాని పరస్త్రీని తప్పుభావనతో చూదలెదు. పెల్లాం పక్కనేవున్నా, చక్కగా వున్న పక్కవారిని దొంగచూపులు చూసే బుద్ధి మీకులేదుకదా? అది సినిమా హీరోఇన్లనయినాసరె. పరస్త్రీలను కాముకదృష్టితో చూడని గొప్ప ,చలించని మనోనిగ్రహం కలవారు రామాయణాన్ని విమర్శించేందుకు ఒక అర్హతకలవారు కావచ్చనుకుంటా?
6.. ......... భార్యను ఎవడో దుర్మార్గుడపహరిస్తే దు\:ఖాతిశయముతో మతిని కోల్పోయినవాలివలెనయి. ప్రతి చెట్టునూ పుట్టనూ నాసీత ఎక్కడ అంటూ విలపించిన ఆస్వామి ప్రేమకంటే మీ భార్యపట్ల ఇంకా ఎక్కువ ప్రేమ కలవారు ఐతే మీరు ముందుకు సాగవచ్చు. తన కు భార్య లేకుంటే యాగానికి అనర్హుడనైనప్పుడు బంగారు బొమ్మను పెట్టుకున్న ఆతండ్రి ఏకపత్నీ వ్రతమెక్కడ? సందుదొరికితే సెకండ్ సెటప్ పెట్టటానికి వెనుకాడని ఈ నాటి మాయ ప్రేమలెక్కడ. రాముని వంటి ప్రేమ మీకున్నదా? పరిశీలించండి. మీమనసులో మీ భార్యపట్ల.
6..... సహాయము కోరిన సుగ్రీవునికంటే వాలి బలవంతుడు.తనపని సులభముగా చేసి పెట్టగలడు. ఐ నా సరే నమ్మిన వారిని కాపాడెందుకే మొగ్గుచూపాడా కాని తనపనిజరుగుతుందికదా అని అవినీతిపరుడిని ఆశ్రయించలేదాయన. మన జీవితాలలో అవసరానికనుగుణంగా అభిప్రాయాలు మార్చుకునేవారము, అవసరమయితే లంచాలిచ్చి పనిచేసుకునేవారు , నమ్మిన వారిని అవకాశమొస్తే వదలివేయనివారు గావున్నవారు విమర్శకులవవచ్చు.
7....శరణని వచ్చిన విభీషణునే కాదు ,అవసరమయితే అభయమడిగితే రావణునయినా రక్షిస్తానని పలికాడు రాముడు. అంతటి క్షమాగుణసంపన్నులు. వున్నారా మనలో?
8.... యుద్ధములో మూర్చిల్లిన లక్ష్మణునికోసం చిన్నపిల్లవానిలా ఏడ్చిన సోదరప్రేమ ,సూర్యుని ఉదయాన్ని సహితమాపటానికి ప్రయత్నించిన పరాక్రమ శక్తి కలవారమా మనము?
9.... ...... యుద్ధము ముగిసిన తరువాత తన ప్రాణాధిదేవత ఎదురొస్తుంటే ,తనలో ప్రేమోద్వేగాన్ని అణచుకుని ధర్మానికి కట్టుబడి ధర్మ రక్షకునిగా తన అచరణ లో ఏలోపము లేకుండా వుడేందుకు కఠినంగా వ్యవహరించవలసివచ్చ్నప్పుడు ఎంతవేదనననుభవించాడో ఎవరికెరుక. ఆతల్లి పరమ పవిత్రురాలని తెలుసు. లేకుంటే అసలు యుద్ధప్రయత్నమే చేసేవాడుకాడు. కానీ లోకం సత్యాన్ని ప్రత్యక్షప్రమాణముతోగాని నిర్ధారించదు. రేపురాజుగా పరిపాలనసాగించేటప్పుడు., తాను శిక్షలు విధించినప్పుడు ఎవరూ తమ మనసులోకూడా రాముని గురించి సీతగురించి తక్కువగా మాట్లాడకూడదు. కనుకనే సీత పవిత్రత ఇక్కడే నిరూపించి చూపాలి .ఆశక్తి ఆపతివ్రతామతల్లికి వున్నదని పూర్ణముగావిశ్వాసం రామునికి .అందుకే అగ్ని పరీక్షకు ఆదేశించాడు. వాస్తవానికి ఆయన వాళ్లు అన్నదమ్ములేలా కాలక్షేపము ,తప్ప మరొకటికాదు కల్పిమ్చుకున్నది,తనశక్తి చూపి భవిష్యత్ తరాలకు పాతివ్రత్యమహిమ తెలిపేందుకు.
అంతేకాక ఇక్కడొక సూక్ష్మామ్శమున్నది. అదిధర్మానికి సంబంధించినది . ఏపాపం ఎరుగని లక్ష్మనుని నానా మాటలు అన్న పాపఖర్మ కొంత అనుభవించవలసి వున్నది. ఆరోజు లక్ష్మణుడు ఎంత దు:ఖానికి లోనయ్యాడో ఆతల్లికికూడా అనుభవపూర్వకంగా తెలియవలసి ఉన్నందున ధర్మ రక్షకునిగా తనమన చూడకుండా ఆ శిక్ష విధించాడు రాముడు
.తమవద్దకొచ్చేసరికి. ధర్మాన్ని తప్పే న్యాయమూర్తి కాదాయన. అలా జరగకున్నట్లయితే ఈ నాడుసీతామాత గురించి మాట్లాడిన చాకలిని అనుసరించి మాట్లాడెదేమో ఈ లోకం . భార్య లేకుంటే బంగారపు బొమ్మను ప్రతిగా పెట్టుకుని యాగం సాగించాడే కాని ఎకపత్ని వ్రతాన్ని విడనాడలేదు. తుచ్చమయిన శారిరికసౌఖ్యాలకోసం తనమనసులోని ప్రేమమూర్తిని తొలగించి మరొకరికి ఆవకాశం ఇవ్వలేదు . భార్య పోగానే నాలుగురోజులకు ఆ ప్రేమను మరచి కొత్తభార్యకోరకు ఎదురుచూసే ఇప్పటి వారికి రాముని ప్రేమను అనుమానించే ఆవకాశం ఎలా వుంటుంది.?
లోకానికి ధర్మాన్ని చెప్పవలసిన రాజు తానూ మనసా వాచా కర్మణా సత్యాన్ని పాతిమ్చగాలిగితేనే ఆపదవికి న్యాయం చేసినవాడవుతాడు. లేకుంటే ప్రజలపాపాలకు ఆటను కారణమవుతాడు. అడినిరూపిమ్చి, మానవుఅలలో పాలకులు ఎలా నడవాలో చూపించాడు. తానుఎన్నిబాధలు సాహిమ్చయినా? అది తెలిసిన పూర్వపు నాయకులు సర్వస్వాన్ని వదులుకుని నిజమయిన ప్రజాసేవకులుగా చరిత్రలోకేక్కారు. తమస్వార్ధమేతప్ప ధర్మంతెలియని వారు నాడూ నేడూ ప్రజలను దోచుకుని లోకకంటకులయిన పాలకులుగా మారుతున్నారు. కులం మతం పార్టీలు తప్ప అతను dharmaatmuDaa? కాదా అనే విచక్షణ చేయకుండా వాళ్ళను ఎన్నుకుంటున్న మనం మన మనోస్తితితో రాముని లాంటి నాయకుని ప్రవర్తనను తప్పులెన్నటానికి ప్రయత్నిస్తున్నాము.
బిడ్డగా,అన్నగా, భర్తగా స్నేహితునిగా, రాజుగా ,ధర్మరక్షకునిగా,ప్రేమమూర్తిగా ఆయన లోకం గుండెలలో నిలచిపోయాడు. ఆయన ప్రేమతత్వాన్ని తట్టుకోలేని అసూయాగ్రస్తహృదయాలు ఆయన చరితకే కళంకం తేవాలని ప్రయత్నించి విఫలమవుతున్నాయి. కొన్ని ప్రక్షిప్తాలను చేర్చి అందుకు ప్రయత్నించిన సంఘటనలున్నాయి. వాటిలో ఒకటి విన్నవిస్తాను.
రాముడు సంభూకుని వధించాడు అని.ఒక ప్రక్షిప్తాన్ని చొప్పించారు. మధ్యలో ఎవరో మూర్ఖులు. వాల్మికి గాయత్రి మంత్రాక్షరాల సంఖ్యలో 24000 శ్లోకాల తో గ్రంథ రచన సాగించినట్లు తెలుస్తున్నది. కాని ఉత్తరరామాయణములో దిఇన్ని ప్రక్షిప్తము చేసారని చరిత్రకారుల అభిప్రాయము. గుహుడు,శబరి,వానరులు పక్షులను సహితము ఆదరించి వారి తపస్సులను ఫలిమ్పజేసిన స్వామి తపోదీక్షలో వున్న శంభూకుని ఎందుకు చంపుతాడు. కాలప్రవాహములో రాగిచెంబుకు చిలుము పట్టినట్లు మహాగ్రంతాలలో కూడా కొందరు ఆనాడున్న స్వార్ధపరులు తమచర్యలకు ప్రమాణము చూపిమ్చుకోవటానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లున్నది. దీనిమీద సమగ్రపరిసోధన చేసిన వారు చెబుతున్న మాటయిది. , విషజంతువులు విషవృక్షాలు రామాయణ కల్పతరువును ఏమీ చేయలేక అలా మరుగునపడి పోతూనే వున్నాయి. కానీ అవికక్కిన కొన్ని విశబిమ్దువులు మాత్రం మానవ మనస్సులను కల్లోలపరుస్తున్నాయి.
సముద్రములో రత్నాలను ఎన్నిఏరినా ఇంకా దొరుకుతూనే ఉంటాయి .రామాయణాన్ని దాని ప్రభావాన్ని వర్ణించటం చుక్కలు లెక్కపెట్టటం లాంటిదికనుక . నాఅసమర్ధతను చెప్పుకుంటున్నాను.
లోకానికి రీతి,నీతి బోధించటానికి అవతరించిన సీతారాముల ప్రేమలో లోపాలెంచకండి. సత్గ్రంథాలను ,సత్పురుషులను విమర్శిమ్చటము పాపమయి చుట్టుకుని వేధిస్తుంది.
ఇక దేవుని నమ్మక పోయినా ఫరవాలేదు. సత్య ధర్మాలను నమ్మే వారుగా ,లోకహితిభిలాశులుగా వున్న మిగతావారుకూడా రాముని మమ్చిగుణాలను ఎన్నింటిని మనం ఆచరించ గలుగుతున్నామో వాటివలన లోకానికి కలిగే మేలును పరిసిలిమ్చుకుని సాగండి విమర్సించటమే గొప్పకాదు,మనవున్నతికి పనికిరాదని గమనించి అందులోని మంచిని మన భవిష్యత్తరాలకు అందించే ప్రయత్నం చేయండి . మనజాతి మరికొన్ని యుగాలు మహోన్నతంగా బ్రతకటానికి. ఆచరణ లేకుండా వాదులాటే ప్రధానంగా సాగే వివరణలకు నేను జవాబు చెప్పినా మీకు నాకు సమయము వ్రుధా తప్పమరొకటికాదు, కనుక మనపిల్లలకు రామాయణం నేర్పుదాము vaaLLu annadammulelaa
0 వ్యాఖ్యలు:
Post a Comment