రాక్షసులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు ?
>> Wednesday, October 22, 2008
రాక్షసులు అనేపదం వినపడగానే మనమనస్సులో ఒకరకమయిన భయం, వారి దోషపూరిత ప్రవర్తన ,వారిపట్ల అసహ్యం కలుగుతాయి. ఎందుకంటే వారిగురించి వారి మనోభావాలగురించి మనం విన్న కథలు అలా మనమనస్సులో ముద్రలువేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు ,ప్రవర్తనలు ఎలావున్నా ఉగాలననుసరించినా వారిబుద్ధులు మాత్రం మారలేదు. అటువంతి బుద్ధికలవాడు రాక్షసునిగానే వర్ణింపబడుతున్నాడు.
మొదటిలో అంటే కృతయుగములో రాక్షసులు జలములలోనివసించేవారట. అక్కడనుండే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగిలించటం లాంటివి చేయటమువలన భగవంతుడు మత్స్యావతారమెత్తి.,వరాహావతారములెత్తి వారిని సంహరించాడు. ఇలాకాదు అని వాళ్ళు నీళ్ళమధ్యలో దీవులలోచేరి లోకములో దుర్మార్గలుచేయటముమాత్రమేకాక,ఆభావాలను వ్యాపింపచేయాలని ప్రయత్నించారు. అయితే అప్పుడుకూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్లను నిర్మూలించాడు. ఇలాకూడా లాభమ్లేదు మనకార్యం నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంగా మారాలని సంకల్పించి , కంస,దుర్యోదన,జరసంధ,శిశుపాలాది రూపాలలోమానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించి చాలావరకు మానవజాతిని తమకనుకూలముగా మార్చగలిగారు. ఆయనకూడా ఊరుకోకుండా కృష్ణావతారమెత్తి. ,సద్బుద్ధికలిగిన మానవులద్వారానే వారిని ఊచకోత కోపించి ,మానవుల కర్తవ్యాన్ని తెలియపరచాడు.
ఇక మనం బయటవుంటే వాసుదేవునినుండి మనం తప్పించుకోలేము .ఆయనకుదొరకకుండా వుండేందుకు ఎక్కడచేరి మనప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించి ఈ కలియుగములో మానవమనస్సులలో నివాసము ఏర్పరచుకున్నారు. అక్కడనుండి తమపనులు కొనసాగిస్తున్నారు. అందుకే మనలో కోపాలు,ఈర్ష్య ,అసూయాది గుణాలు ,ధర్మవిరుద్ధమయిన ప్రవర్తన ,భగవంతుని ఉనికిని వ్యతిరేకించటం ,సాటిజీవులపట్ల జాలిలేకపోవటం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి. మనలోనే నివాసమున్న ఈ రాక్షసజాతి మనమాదమరచివున్న సందర్భములో మనమనస్సును అరిషడ్వర్గాలవైపు మల్లించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఆదమరచామో మనలో వారిగుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి. భగవన్నామమనే కవచాన్ని ధరించి ప్రేమ,శమదమాదులనే ఆయుధాలులు ధరించి జాగురూకులమై ఉండాలి .వాళ్ళు తలెత్తిన ప్రతిసారీ చావుదెబ్బతీయాలి. ఇది చాలా కష్టతరమయిన పోరాటం. ఎదుటవున్న శత్రువునయితే కనిపెట్టి వుండవచ్చు. లోపలున్న ఈ రాక్షసులను కనిపెట్టిఉండటమే పెద్ద కస్టం .ఇక యుద్ధమెంత కఠినమో ఆలోచించాలిమనం. ఏమాత్రం అజాగ్రత్తగావున్నా మనపతనం ఖాయం. తస్మాత్..జాగ్రత్...జాగ్రత్...
0 వ్యాఖ్యలు:
Post a Comment