శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రాక్షసులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు ?

>> Wednesday, October 22, 2008


రాక్షసులు అనేపదం వినపడగానే మనమనస్సులో ఒకరకమయిన భయం, వారి దోషపూరిత ప్రవర్తన ,వారిపట్ల అసహ్యం కలుగుతాయి. ఎందుకంటే వారిగురించి వారి మనోభావాలగురించి మనం విన్న కథలు అలా మనమనస్సులో ముద్రలువేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు ,ప్రవర్తనలు ఎలావున్నా ఉగాలననుసరించినా వారిబుద్ధులు మాత్రం మారలేదు. అటువంతి బుద్ధికలవాడు రాక్షసునిగానే వర్ణింపబడుతున్నాడు.

మొదటిలో అంటే కృతయుగములో రాక్షసులు జలములలోనివసించేవారట. అక్కడనుండే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగిలించటం లాంటివి చేయటమువలన భగవంతుడు మత్స్యావతారమెత్తి.,వరాహావతారములెత్తి వారిని సంహరించాడు. ఇలాకాదు అని వాళ్ళు నీళ్ళమధ్యలో దీవులలోచేరి లోకములో దుర్మార్గలుచేయటముమాత్రమేకాక,ఆభావాలను వ్యాపింపచేయాలని ప్రయత్నించారు. అయితే అప్పుడుకూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్లను నిర్మూలించాడు. ఇలాకూడా లాభమ్లేదు మనకార్యం నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంగా మారాలని సంకల్పించి , కంస,దుర్యోదన,జరసంధ,శిశుపాలాది రూపాలలోమానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించి చాలావరకు మానవజాతిని తమకనుకూలముగా మార్చగలిగారు. ఆయనకూడా ఊరుకోకుండా కృష్ణావతారమెత్తి. ,సద్బుద్ధికలిగిన మానవులద్వారానే వారిని ఊచకోత కోపించి ,మానవుల కర్తవ్యాన్ని తెలియపరచాడు.
ఇక మనం బయటవుంటే వాసుదేవునినుండి మనం తప్పించుకోలేము .ఆయనకుదొరకకుండా వుండేందుకు ఎక్కడచేరి మనప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించి ఈ కలియుగములో మానవమనస్సులలో నివాసము ఏర్పరచుకున్నారు. అక్కడనుండి తమపనులు కొనసాగిస్తున్నారు. అందుకే మనలో కోపాలు,ఈర్ష్య ,అసూయాది గుణాలు ,ధర్మవిరుద్ధమయిన ప్రవర్తన ,భగవంతుని ఉనికిని వ్యతిరేకించటం ,సాటిజీవులపట్ల జాలిలేకపోవటం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి. మనలోనే నివాసమున్న ఈ రాక్షసజాతి మనమాదమరచివున్న సందర్భములో మనమనస్సును అరిషడ్వర్గాలవైపు మల్లించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఆదమరచామో మనలో వారిగుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి. భగవన్నామమనే కవచాన్ని ధరించి ప్రేమ,శమదమాదులనే ఆయుధాలులు ధరించి జాగురూకులమై ఉండాలి .వాళ్ళు తలెత్తిన ప్రతిసారీ చావుదెబ్బతీయాలి. ఇది చాలా కష్టతరమయిన పోరాటం. ఎదుటవున్న శత్రువునయితే కనిపెట్టి వుండవచ్చు. లోపలున్న ఈ రాక్షసులను కనిపెట్టిఉండటమే పెద్ద కస్టం .ఇక యుద్ధమెంత కఠినమో ఆలోచించాలిమనం. ఏమాత్రం అజాగ్రత్తగావున్నా మనపతనం ఖాయం. తస్మాత్..జాగ్రత్...జాగ్రత్...

4 వ్యాఖ్యలు:

chandramouli October 22, 2008 at 4:37 PM  

"భగవంతుని ఉనికిని వ్యతిరేకించటం" - బ్లాగయణంలో పిడకల వేట అనుకోకపోతే , రాక్షసులు దేవుడు ఉనికిని అధికారాన్ని ఎప్పుడు ప్రశ్నించ లేదు, కేవలం విష్ణువుతోనే తగువంత (మరి సొంతవారిని చంపితే కోపం రాదా ఏమి , సృష్టి ధర్మం నిర్వర్తిస్తున్న యమరాజుని మార్కండేయ కధలో శివుడు మందలించి తన ప్రేమను చూపాడు కదా... అన్నిటికి అతీతుడయిన భగంవంతుడే ప్రేమకు లొంగినప్పుడు, సొంత తండ్రులను తాతలను కట్టగట్టీ నరికితే కోపంరాదా మరి అది వేరే విషయం అనుకోండి.) మరి దేవుడిని నమ్మని వారిని (తిట్టివారిని కలపకండి) ఆ రాక్షసుల గుంపులో కలపటం ఏమన్నా న్యాయంగా ఉందా?

durgeswara October 23, 2008 at 12:22 AM  

చంద్రమౌలి గారూ1
సత్యధర్మాలను అనుసరించి న వారందరూ భగవంతుని నమ్మినవారె. అవి తమ జీవిత విధానం చెసుకొకుండా భగవంతుని పూజించినా వారందరూ రాక్షసాంసము కలవారె.

Anonymous October 23, 2008 at 1:58 AM  

నమాస్కారం,
నాకు చాలా రొజుల నుంచి అద్యత్మిక జివితం పై అసక్తి కలిగింది,స్వామి వివెకానందా,రామకృష్ణ పరమహంస లాంటి వారి మార్గం నచ్చుతుంది.
యొగులు.సిద్దుల వలే ఉండటాని మనం ఎం చేయలి

durgeswara October 23, 2008 at 9:50 AM  

నాకుతెలిసి నెనువిన్నదిది. ఆధ్యాత్మికత అంటే భగవన్మార్గాన్ని పట్టటమంటె ఆయన కరుణ మనపై కలిగినట్లే. కనుక ముందు ఆభావన స్థిరపరచుకుని ఈ మార్గం లోప్రయాణించటము అంత సులభం కాదుకనుక మార్గదర్శకుడయిన గురువును ఆశ్రయించాలి. అయి తే కలియుగములో ఉల్లిగడ్డకుకూడ ఉపదేశ మిచ్చేటి కల్లగురువులు భువిని పుట్టేరయా అన్న బ్రహ్మంగారి వాఖ్యాలను గమనించి సరయిన గురువును ఎన్ను కోవాలి. అయితే మనము అల్ప సామర్ధ్యాలు కలవాల్లము కనుక మన ఎంపిక తప్పయి మనము ప్రమాదములో అంటే కల్లగురువుల పాలిట పడే ప్రమాదము వున్నది. దీనికి చక్కటి మార్గాన్ని సూచించారు పెద్దలు. గురుచరిత్ర. పారాయణము చేస్తూవుంటే మనకర్మలు నశించి ఆయన అంతట ఆయనే మనలను వెతుక్కుంటూవస్తాడు. లేగదూడదగ్గరకు గోమాతలాగా. లేదా మనము నమ్మిన భగవత్ రూపాన్ని ధ్యానిస్తిఊ ఆనామ్మాన్ని జపిస్తూవున్నా మన కర్మలు త్వరగా నశించి \ఏదో వొక రూపం లో ఆయన దర్శనమవుతుంది లేక ఆయన ప్రేరణ మనలను నడీపిస్తుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పటం సాహసమవుతుందేమో. సద్గ్రంథ పఠనము,సత్పురుషుల సాంగత్యము ,సదాచార అనుసరణము అన్ని శుభాలను కలిగిస్తాయని పెద్దల వాఖ్యము. ధన్యవాదములు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP