మా ఇంట్లో మంత్రివర్గం.
>> Monday, June 9, 2008
అవి నాకు పెళ్ళయి, మాఆవిడ కొత్తగా కాపురానికొచ్చిన రోజులవి. మొదటినుంచి నేను చాలా విశాలమయిన భావాలుగలవాడినని నాకునమ్మక0. నేనుచాలాపుస్తకాలలో భార్యాభర్తలంటే సమానులని ,, ఇంకా ఏవేవో చదివి ప్రజాస్వామ్యభావాలపట్ల నమ్మకం ఎక్కువయి పోయినవాడిని. అందువలన మా ఆవిడతో, చూడూ! మనం ప్రణాళికాబద్ధంగా వుంటేనే ఏదైనా సాధించగలం. కాబట్టి మనకుటుంబం పార్లమెంటు లాంటిదనుకో, అందులో మనమంతా మంత్రివర్గం. ఇందులో నీకేమ్ పదవికావాలో అడుగు అన్నాను. మా ఆవిడసిగ్గుపడుతూ, నాకు దేవుడిలాంటి మీరుదోరికారు ఇంకేమ్ కావాలండీ! అంది గోముగా నాచొక్కాగుండీలు సవరిస్తూ. పెళ్ళయిన కొత్త,అందులో అంతదగ్గరగా ,అంతసౌజన్యంగా................. నాకింకాముచ్చతటేసింది .నామాట కాదనకూడదు నువ్వుచెప్పాలి ఏ బాధ్యతలు తీసుకుంటావో, బలవంతపెట్టాను. సరేలేండి, మీమాట కాదనే ధైర్యం ఎవరికుంటుంది. , ఈబాధ్యతలు బరువులు ఆడదాన్ని నాకేందుకండీ,ఏదో ఆ ఆర్ధిక శాఖ చూసుకుంటాలే0డి. అంది. మరింత మురిపెంగా. మంత్ర్రిపదవుల కేటాయింపు జరిగి ఈరోజుకు సరిగ్గా 17 ఏళ్ళు. ఇప్పుడుబాగా అర్ధమైంది ఆర్ధికమంత్రే ప్రధానమంత్రికంటే పవర్ ఫుల్ అని. ఈమధ్య కాల0లోచాలా సార్లు మంత్రిపదవులు మార్చుకుందామని, అనిపించిందికానీ ,! మాటతప్పని వంశం మాది. అందుకనే మనమేసుప్రీం అని తెలియటంకోసం రాష్ట్రపతి పదవితీసుకున్నా.!
3 వ్యాఖ్యలు:
సరదాగా చాలా బాగా వ్రాసారు.
బాగుంది. ఆఖర్న రబ్బరు స్టాంపుగా మిగిలారన్నమాట.
www.parnashaala.blogspot.com
ఏంచేస్తాం చెప్పండి.సార్. పైకి మనమే శాసించి సాధిస్తున్నామం టారుగానీ వాస్తవానికి ఆడ"వారి"దే పెత్తనం ఏ ఇంట్లోనైనా. కాదంటారా?. చదివినందుకు ధన్యవాదములు.
Post a Comment