ఆరోగ్యదాత! అభయప్రదాత!
>> Friday, June 13, 2008
వినుకొండలో ఓబయ్యకాలనీలో పాలడుగు రాము అనే యువకునకు హఠాత్తుగా కాళ్ళకు సంబంధించిన సమస్యలు .
ఇక ఆకుటంబము తీవ్రదు:ఖములో మునిగిపోయారు. ఎదిగొచ్చిన కొడుకు కళ్ళముందే కాళ్ళు కదపలేక మంచానపడి వుంటే చూసితట్టుకోవాలంటే వారికి సాధ్యం కావటములేదు. పోనీ ఇంకా ఏదన్నా ఆశ తో హాస్పటల్స్కు వెళదామన్నా ఆర్ధికంగా తమపరిస్థితి ఇప్పటికే దిగజారిపోయింది. అన్నదమ్ముల పరిస్థితి అంతంత మాత్రమే , చేసేదేమిలేక కుమిలిపోతున్నారు. వారి కాలనీకి సమీపము లోనే వినుకొండలో ప్రసిధ్ధమయిన గుంటి ఆంజనేయ స్వామి దేవాలయం వుంది. వీళ్ళు అప్పుడప్పుడూ ఆ ఆలయానికి వెళ్ళివస్తుంటారు. ఈసంఘటన జరిగినతరువాత ఒకశనివారం ఇతనిని అన్నదమ్ములు ఎత్తుకుని స్వామివారి దేవాలయానికి వచ్చారు. ఇంతకుముందే వీరిపరిచయము వున్న అర్చకులు సంపత్ కుమార్ గారు ఏమిజరిగిందని అడగగా వీళ్ళు జరిగినదంతా చెప్పి కళ్ళవెంట నీళ్ళు పెట్టు కున్నారు. స్వామీ మాఖర్మ ఇలాకాలింది. బంగారం వంటి పిల్లవాని కిఇలా అయిపోయింది అని బాధపడ్డారు. తనపరిస్థితి తెలిసాక రాము మానసికంగాబాగాక్రుంగి పోయి వున్నాడు . ఎవరితో మాట్లాడకుండా బాధపడుతూ తదేకంగా స్వామిని చూస్తూ మౌనంగా తనలోతాను కుమిలిపోతున్నాడు. అతని పరిస్థితి గమనించిన సంపత్కుమార్ గారికి చాలా బాధ కలిగింది. స్వామి ప్రేరణ వలన ఏమోగాని ఏమయ్యా ఇన్నిప్రయత్నాలు చేశారుగదా స్వామి ఆరోగ్యదాత కనుక ప్రదక్షణములు చేయగలరా అని ప్రశ్నించారు. వాళ్ళు వెంటనే స్వామీ అవి ఎలా చేయాలో చెప్పి పుణ్యం కట్టుకోండి అని అడిగారు ఆర్తితో. ఆయన ఆవిధానం చెప్పి మంచి రోజు కూడ చూసి. ప్రారంభించమని చెప్పారు .అతను నడవలేడుగనుక అన్నదమ్ములే చెరివొక ప్రక్కన పట్టుకొని చేతుల మీద ఎత్తుకుని స్వామి చుట్టూతిప్పటం మొదలు పెట్టారు. వారం రోజులు తిరిగేసరకి అతను కాళ్ళలో తిమ్మిరిగా వుందని చెప్పాడు . అన్నదమ్ములు మరింతవుత్సాహంతో వేకువనే వచ్చి ప్రదక్షణలు సాగించారు. రాము కూడా హనుమాన్ చాలీసాలో " నాసై రోగ హరై సబపీరా జపతనిరంతర హనుమత వీరా" అనే దోహాను పూజారిగారు చెప్పినట్లు ఆర్తితో,తీక్షణముగా చేయసాగాడు. పరిస్థితి రోజు రోజుకూ మెరుగై 40 రోజులు నిండేసరికి దరిదాపుగా నడవగలిగాడు. తరువాత అతను హనుమత్ మాలను వేసుకుని దీక్షచేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాదు. ఇది జరిగి 8 సంవత్సరాలయింది. అతనిప్పుడు మునిసిపాలిటీలో వుద్యోగి వివాహం జరిగి చక్కగా సంసారం చేసుకుంటున్నాడు. ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా మాలా ధారణ చే స్తున్నాడు. జయ జయ సంజీవరాయ!
2 వ్యాఖ్యలు:
MEERU CHALA MANCHI VISHAYAMULU CHEPTHUNNARU... INTHAKUMUNDU TAPA LO HANUMA BAKTHULU PRAKASHAM GARI GURINCH CHEPPARU KADA VARU IPPUDU EKKADA VUNNARANDI...ARUAN
ammaa! వారిప్పుడు వైకుంఠవాసులై దైవసన్నిధానం లో వున్నారు.పరమగురువుల ప్రణాళికలో మేమూ వుడత పాత్ర స్వీకరించాము. మీకేమన్నా కావలసిన సహాయము వుంటే నిరభ్యరంతంగా అడగండి.
Post a Comment