తాగుబోతు సైన్స్
>> Monday, June 9, 2008
ఒక గ్రామం లో మందుబాబుల శాతం ఎక్కువ. తెల్లారిలేస్తే వారివీరంగాలే. గ్రామం లో ఎప్పుడూ అల్లర్లే. ఆగ్రామానికి కొత్తగా టీ చర్ఒకాయన వచ్చాడు. ఈపరిస్తితంతా గమని0చి చాలాబాధ పడ్డాడు. ఎలాగయినా వీళ్ళలో మార్పుతేవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. యెంతో కష్టపడి వీళ్ళందరినీ ఒక సాయంత్రం పాఠశాల ఆవరణలో సమావేశ పరచాడు. చూడండి బాబులూ! సారాయి తాగడంవలన వచ్చే ఫలితాలేమిటో మీకు అనుభవపూర్వకంగా. నిరూపిస్తాను. అంటూ ఒక ప్రయోగంచెయ్యడం మొదలు పెట్టాడు. ముందుగా రెండుగాజు గ్లాసులు తీసుకున్నాను, ఒకదానిలో మంచినీళ్ళు, మరొకదానిలో సారాయి తీసుకున్నాను చేసి చూపించాడు . బలేబలే అనుకున్నారు జనం. ఇప్పుడు రెండు బొద్దింకలను బ్రతికినవి, వీటిలో వేస్తునాను. యేమిజరుగుతుందో చూడండి. వేసాడు. మంచినీటిలోవేసిన బొద్దింక మామూలుగాఈది ఎగిరి పోయింది. సారాయిలో వేసిన బొద్దింక గిలగిలా కోట్టుకుని చచ్చింది. జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. మాస్టర్ గారు జనంవైపు తిరిగి , దీనివలన మీకేమి అర్ధమైంది ప్రశ్నించాడు గంభీరంగా. వెంటనే ఒక మందుబాబు లేచి , సారాయి తాగటంవలన మనకడుపులో ఉన్న క్రిములన్నీ చనిపోయి మనం షంపూర్ణ ఆరోగ్యంతో ఉంష్టాం.......... ఉత్సాహంగాచెప్పాడు. తాగుబోతుల ఈలలు చప్పట్ల తోటి సమావేశం మార్మోగిపోయింది.
0 వ్యాఖ్యలు:
Post a Comment