సినిమా కష్టాలు నావి.
>> Sunday, June 22, 2008
ఏంచెప్పమంటారండీ
నాకష్టాలు. పాతతెలుగుసినిమాల్లో హీరోలా అయింది నాపని. తండ్రికి గుండెజబ్బు,తల్లికి క్షయరోగం కుంటితమ్ముడు, గుడ్డిచెల్లెలు,దీనికితోపాటు తనకువుద్యోగముండదు. వీడిమొహానికి తోడు డబ్బున్న వాళ్ళ అమ్మాయితో ప్రేమ. ఈస్తితిలోనే నేనువున్నాననిపిస్తుంది. అసలు విషయమేమిటంటే .ఈకంప్యూటర్ తో నాకొచ్చిన కష్టాలివి. నేనేదో నామానాన నేను గుడిలో దేవునికి పూజా బడిలో పిల్లలకు చదువు చెప్పుకుంటూ బ్రతుకుతున్నానా . నా కీ కంప్యూటరూ గింప్యూటరూ తెలియదని మనవి చేసుకున్నానా. మరెలా దీంట్ళో ఇరుక్కున్నానో తలుచుకుంటేనామీదనాకే జాలేస్తంది.
ఒక రాహుకాలం యమగండం తదితర దుర్ముహూర్తాలన్నీ కలసినవేళ. ఎంటరయ్యాడు మాకొండలన్న. ఇంతకీ ఈయనెవరనుకుంటున్నారా, ఈయన మా నూజండ్లమండలం లో ఏకైక హోల్ అండ్ సోల్ కంప్యూటర్ ఇంజనీర్లాంటివాడు. ఏకలవ్యుడిలా పుస్తకాలు తిరగేసి కంప్యూటర్ విప్పదీసి బిగించెయ్యటం నేర్చుకుని ఎం.ఆర్.పి.గా మా బిల్లులూ గట్ఱా చూస్తూ వుంటున్నాడు. మా ఎం.ఏ.ఓ. లకు కూడా తేరగా పైసా ఖర్చులేకుండా ఈపనిచేస్తాడని మహాఇస్టమవటము వలన అలా కంటిన్యూ అయిపోతున్నాడు. ఆయన వచ్చి అబ్బాయ్. నీకొక కంప్యూటర్ వుండాలయ్యా! అని దానిగురించీ దాని వుపయోగాలగుఇంచీ చక్కగా వివరించారు. దానితో నాఅజ్ణానం కొంతతొలిగి. నేనూ కంప్యూటెర్ కొనాలని నిర్ణయించుకుని, ఇద్దరంకలిసి గుంటూరు వెళ్ళి మొత్త 22 వేలు పెట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే వుద్దేస్యంతో రెం డు కంప్యూటర్లు కొన్నాము. వాటిని తెచ్చాక మాఇంట్లో వున్న టేబుల్ బాగాలేదని మరొక 1600 పెట్టి కొత్త తేబుల్ కొనిపించాడు. ఆతర్వాత స్టెబిలైజర్ కొని పించాడు. . తరువాత పెద్ద యు.పి.యస్. కొనాలన్నాడు దానికెంతా జస్ట్ 10000 లవుతాయని చెప్పాడు కానీ నాకు అప్పటికే కాస్త బీ పీ పెరిగిపోతున్నట్లు అనుమానం వచ్చి అన్నా తరవాతచూద్దామని తప్పుకున్నాను. ఇక మావూర్లో చాలామంది వై యెస్ ఫ్రీ కరెంట్ అభిమానులే కానీ ,నాకుమట్టుకు అదినచ్చక బీల్లు కట్టు కో వాలని ర్ణయంతూవున్నవాణ్ణీ.
అయితే చంద్ర బాబుగారు సవాల్ చేస్తున్నట్లు మా మండలమ్లో కరెంట్ తీగలపై 16 గంటలు నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు. అదీగాక వచ్చే కరంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈస్తితిలో సరదాకి అప్పుడప్పుడూ కొండలన్న చెప్పినట్లు అవీ ఇవీ నొక్కి, వచ్చే బొమ్మలనూ ఆతరువాత తెలుగుదనం కో ఇన్ లో దాని సహాయంతో కొన్ని తెలుగు విషయాలు తెలుసు కుంటుంటే ఒకరోజు ఆంధ్ర జ్యోతి లో జ్యోతక్కగారి బ్లాగులగురింకి వార్త చదివి ప్రయత్నించాము .మనం ఎదో నోక్కటం అవి ఎడో చూపించటం ఇలా బాధలు పడ్డాను. వెబ్ దునియా లో తేలికగా వుండటము వలన దాంట్లో చిన్నగా నేర్చు కుని వ్రాయటం మొదలుపెట్టాను.
కానీ మనం వ్రాసినతరువాత తెలియక ఏదో నొక్కటం అదిఎక్కడికో వెళ్ళి పోవడం. ఒక్కోక్కసారి వ్రాయటం అయిపోవచ్చేసరికి కరంట్వారికి కూడా నాసహనాన్ని పరిక్షించాలని సరదా క్లుగుద్దేమో కట్ చేస్తారు . వ్రాసిందంతా గోవిందా. ఇలామి కష్టాలతో నేను వ్రాస్తుంటే ఈమధ్యలో కామెం ట్లవాళ్ళు మొదలయ్యారూ చచ్చీ చెడీ వ్రాసి పోస్ట్ చేసేసరికి ఒక్కోక్క సారి రాత్రి2 గంటలు కూడా అవుతున్నది. దాంట్ళో వచ్చే తప్పులు చూస్తే వీడెక్కడిపంతులురా అనుకుంటారేమోనని . భయం అవన్నీ సరిచేద్దామని ప్రయత్నిస్తే మల్లీ అవెక్కడ మాయమవుతాయో నని భయం. కస్టాలన్నీ తీఱే కాలం రాకపోతుందాఅని ఆశ. ఈలోపల కామెంట్లకు కొన్ని [పుస్తకాలు సూచించి చదవమని చెప్పి తప్పించుకుందామనుకుంటున్నాను.
5 వ్యాఖ్యలు:
దుర్గేశ్వర గారు,
మీ కంఫ్యూటర్ కష్టాలు భలే చెప్పారు కాని, బ్లాగర్ లో నేరుగా కాకుండా , లేఖిని కాని బరహ కాని వాడండి. ఇంకా తప్పులు ఉన్నాయి. మాస్టారే తప్పులు రాస్తే పిల్లల గతి ఏంటీ??
tallii! naabaadhakooDaa adE. nEnu chinnappaTinumchi telugulO first. vraata baagumDadukaanii tappulumDavani maasters chEta abhimaanam pomdinavaaDini. ippaTikilaamTi gati paTTimdi. lekhinilO vraayagaanE save kaavaalamTE EmichEyaali.
దుర్గ గారు,మీరు మొదట బరహ దించండి.అది వాడండి.కుదరకపోతె,అప్పుడు లేఖిని వాడండి.లేఖిని వాడటం తప్పక పోతే మాత్రం జిమెయిల్ లో అకౌంట్ ఓపెన్ చేసి,అక్కడ మీరు రాసింది.నోట్ ప్యాడ్,వర్డ్ ప్యాడ్,యమ్మెస్ వర్డ్ ఇలా ఒకదానిలో కాపీ చెసుకుని సేవ్ చేసి జి డాక్యుమెంట్స్ లో దాచండి.అక్కది నుండి బ్లాగు న్యూపోస్ట్ కు పేస్టు చెయ్యండి.
emta baagaa cheppaarannayyaa! avannii teliste ii baadhayemduku. cheppaarugadaa avii nokki choostaa. dhanyavaadaalu. naapaTla imtasradhdhachoopina mitrunaku.
ఏది ఏమైనా కృషి చేయకుండా ఫలితము ఉండదుగదా మంచి ఫలితములు ఆశించినపుదు ముందుగా హలాహలము వచ్హినట్లుగా చిన్న చిన్న బాధలు తప్పవు. నేనుకూడా కప్యూతరు నేర్చుకొనుటకు వెల్లునపుడు అందరు ఈవయసులో నీకు అవసరమా అని అందరు వెనక్కు లాగినవారే అలాగని ఆరోజు నేను నేర్చుకోకపోయినట్లయినట్లయితె ఈరోజు ఈానందము నాకు వుండెది కాదుకదా. నూజండ్ల మందలములో ఎవరు కంప్యూటరు గురించి మాట్లాడినా ముందు నేను గుర్తువస్తాను ఆ ఐడెంటిటి చాలు. అలాగె మికు కూడా భవిశ్యత్తులో మంచి బ్లాగరు గా గుర్తింపు వచినపుదు ఈ చిన్న చిన్న బాధలు వుండవు.
Post a Comment