శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మా నీపాదము ,ఆనందనిలయము

>> Monday, June 23, 2008

పల్లవి:
అమ్మానీపాదముఅనందనిలయము.
అది తెలిసిన వారిదే జన్మ ధన్యము.

చరణం: బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మాణీ పాదము
రమావాణి సేవించిన రమ్యమైన పాదము.
కైలాస గిరియందు కదలాడే పాదము
అలమేరు నిలయాన్ని అలరించేపాదము.
2 వేదనపొందిన జీవుల దరిజేర్చేపాదము
చీకటి బ్రతుకులోవెలుగును విరజిమ్మేపాదము.
భవబంధములనుబాపు బంగారు పాదము.
అనురాగ పాశముతో బంధించేపాదము.
3 వేదశాస్త్ర పురాణాల విహరించేపాదము
శివతాండవ జతిగతులన నర్తించేపాదము.
యోగీంద్రుల జపతపముల ధ్యేయమె నీపాదము.
భక్తజనుల అర్చనతో శోభిల్లేపాదము.
4 లోభిని త్యాగిగ మార్చే లోకమాతపాదము
మూఢుని జ్ణానిగ మార్చే ముచ్చటైన పాదము
అజ్ణాన తిమిరమును తొలగించేపాదము.
సుజ్ణాన దీపమును వెలిగించే పాదము.
5 నా జీవన గమ్యము నాభావము నీపాదము
నాగానము, నాప్రాణము సర్వము నీపాదము
చివరకు నేచేరేది శ్రీమాత పాదము
తానే నేనైవెలసిన దివ్యమైనపాదము.

[దీనిలో జ్ణ' అక్షరం కనపడక ఇలా వ్రాశాను. సరిదిద్దుకోండి]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP