సృష్టిలో ఏదీ అనవసరమైనదిలేదు,నాస్తికత్వంతో సహా
>> Sunday, June 22, 2008
భగవంతుని సృష్టిలో ఏదీ అనవసరంగా సృజించపడివుండదు. ప్రతిదానికీ ఏదో ప్రయోజనం వుండే వుంటుంది. దాని సమయానికి అది రంగప్రవేశం చేసి ,తన పాత్రనుపోషిస్తుంది ఈ విశ్వరంగస్థలం లో . అది ఆధ్యాత్మికమైనా ,అధిభౌతికమైనా, నాస్తికవాదమైనా, ఆస్తికవాదమైనా>
ఆనాటి రామాయణం నుండి ఈనాటి రాజకీయాలదాకా ఈవిషయం లో ప్రమాణాలు కనపడుతూనే వుంటాయి.
వనవాసానికి శ్రీరాముడు వెళ్ళినతరువాత ,భరతుడు రావటం. తన తల్లిచేసినదానికి బాధపడటం, తరువాత రామున్ని తిరిగి తీసుకురావటానికి అరణ్యానికి మంత్రి బంధువర్గ, ఆచార్య సమేతంగా వెళతాడు. అక్కడ రాముని మనసు మార్చటానికి అందరూ ప్రయత్నించి విఫలంచెందుతారు. ధర్మ మార్గమునుండి రామున్ని మరల్చటం ఎవ్వరి వల్లాకాదు. అప్పుడు దశరధుని మంత్రి జాబాలి తాను రంగప్రవేశం చేసి నసన్నివేశం గమనించండి.
ఈప్రసంగం వింటున్న జాబాలి: ఓ రఘువంశీయుడా! ఈషణ్మాత్ర వివేకములేని సామాన్యునివలె నీ బుధ్ధి నిరర్ధకం అవుతున్నదయ్యా! ఎవడికి ఎవడు బంధువు? తల్లి ఎవరు? తండ్రిఎవరు? ప్రాణి తనంతట తాను పుడుతున్నది. అలానే మరణిస్తున్నది. దీనికి తల్లీ తండ్రీ అనివిచారించేవాడు మతిహీనుడు గ్రామాంతరంవెళ్ళి అక్కడ పనిచూసుకుని కొణ్ణాళ్ళకు తిరిగివస్తాం.వచ్చాక మనయింట మనమేవుంటాం. అంతే.ఈతల్లిదండ్రులు ఇల్లూవాకిలీ మన అవసరాలకోసమే ఇవిఅన్నీ. ఇందులో శాస్వతబంధాలు ఏవీ లేవు. ఇప్పుడు నువ్వుఎవరికోసమో రాజ్యాన్ని విడిచిరావటం వివేకంకాదు.దేశాంతరగతుడైన భర్తకోసం ఎదురుచూసే స్త్రీవలే ఎదురుచూస్తున్నది అయోధ్యనీకోసం. నువ్వువఛి సర్వసమృధ్ధిఓనున్న రాజ్యాన్ని పాలించు. దశరధుడు నీతండ్రనీ, నువ్వు ఆయన కొడుకువనీ అనుకోకు.. రుతుకాలమ్లో స్త్రీ,పురుష సమ్యోగవేళ శుక్ర శోణిత మేళనం ప్రాణి ఆవిర్భావానికి కారణం .అంత మాత్రాన వారు మనజీవనశాసకులు కారు. అయినా ఇప్పుడాతండ్రి లేడు.
పుట్టిన ప్రతి ప్రాణీ చచ్చి తీరుతుంది. చచ్చాక ఏమవుతుందో తెలియదు.తెలియనిదానికి విచారించడం వివేకంకాదు. . వారు నరకాలకు ప్తారని,శ్రాధ్ధ కర్మలతో వారిని తరింపజేయవచ్చునని భావించటం అవివేకం ఎవదో బోజనం చేస్తే మన ఆకలితీరుతుందనుకోవడం భ్రమ . ఈ దానధర్మ విశయాలన్నీ బుధ్ధిమంతులు కల్పించినవి. యజ్ణ్ణయాగాదులు,తపోదీక్షలు వీటివల్ల పరగతులొస్తాయనుకోకు. ఏది నీకనుల ఎదుటవున్నదో అదే సత్యం . పరోక్షమ్లో వున్నదానినిపరిగణించకు. భరతుడిచ్చే రాజ్యాన్ని హాయిగా స్వీకరించు. అన్నాడు.
జాబాలి చేసిన నాస్తికవాద ధోరణి విని ,రాముడు గంభీరంగా: స్వామీ! మీరు నామేలుకోరి చెప్పినమాటలన్నీ చాలా విచిత్రమైనవి. మర్యాదవిడిచి పాపా చార నిరతుడై చిత్త చాంచ్ల్యం కలవాడు సత్పురుషుల అభిమానానికి అర్హుడు కాడు. పురుషుని కులీనతను నిర్ణయించేది వాని శీలం . మీ వుపదేశాన్ని నేను ఆచరిస్తే నాకంటే దుశ్శీలిడు మరొకడు వుండడు. ఇంతకంటే అపవిత్రమూ అనార్యమూ,అధర్మము వుండబోదు. వివేకులందరు నన్ను అసత్యపరాయనునిగా వేలెత్తి చూపుతారు.
యద్వృత్తా: సంతిరాజాన: తద్వృత్తా : సంతిహి:ప్రజా: ... ..... శాసనాధికారి ఏదారిన వెడితే ప్రజలందరూ ఆబాటనే వెడతారు. సత్యం అహింసఈ రెండే రాజవంశానిక్ ప్రధానమార్గాలు. సత్యమే ఈలోకానికి ప్రాణాధారం అబధ్ధాలాడేవానికీ, సర్పానికి సమాన స్తానమిచ్చి ప్రజలు భయపడతారు. హోమం హోమద్రవ్యం హోత,తపస్సు,సత్యం అన్నీ సత్యమయాలు. సత్యం ఒక్కటే లోకాన్ని రక్షించగలదు.
ఇంతతెలిసి నేను మానాన్నగారి ఆదేశాను సారం చరించక ఏప్రలోభానికో లొంగి రాజ్యం స్వీకరించడంకంటే అక్రమంలేదు. . ఇటువంటి అక్రమానికి వుత్తమజాతి క్షత్రియుడెవడూ సాహసించడు. పైగా గర్హిస్తాడు. మనోవాక్కాయాలతో దేనితోనూ అనృతాన్ని ఆరాధించకూడదు. అందుచేత మీరు చేసిన యుక్తియుక్తమయిన బోధలకు నమస్కరించి,అవిమీకే విడిచిపెడుతున్నాను.
నాయీ వనవాసానికి పినతల్లి కూడా ఎంతో సంతోషిం చింది నేను పుట్టినది కర్మ భూమిలో .ఈ భూమిలో మానవుడు నిష్కపటంగా చరించాలి. ఇంద్ర,అగ్ని, వాయు,సోములు,మహాత్పస్వుల సాక్షిగా నేను ఈపదునాలుగేండ్లు వనవాసం చేస్తాను.
మహర్షీ మరొక్కమాట సత్యం దయ, ధర్మం భూతదయ, ప్రియభాషణం, పరాక్రమ ప్రదర్శనం, ,దైవ బ్రాహ్మణ పూజ ,అతిధి సేవ ..ఇవి ఇహపర సాధనములు. ధర్మ సంపన్నుదైన విప్రవరుడు. తన ఆశ్రమ ధర్మాచరణ రతుదై వుత్తమలోకాలు పొందుతాడు. . ఈవిషయం తెలిసిన మా నాన్నగారు మిమ్ముఎందుకు చేరదీశారో తెలియడమ్లేదు. చోరుడికీ, నాస్తికుడికీ బేధం లేదు. .వేధ విరుధ్ధమైన మీ నాస్తికవాదాన్ని నేను గర్హిస్తున్నాను. . మీతర్కాన్ని కట్టి పెట్టండి .అన్నాడు.
జాబాలి: రామభద్రా ! నేను నాస్తికుడను కాను . ఈరాజ్యం నాయక రహితమయినందువలన నేను నాస్తికవాదం చేశాను. ఇప్పుడు నీ సత్యనిష్ట నన్ను ఆస్తి కత్వంవైపు మరల్చింది అవసరం కలిగితే మరలా నా స్తిక వాదం చేపడతాను. అన్నాడు. ఈ మాటలు వింటున్న వశిష్టు డు : రామచంద్రా జాబాలి లోక రీతి తెలియని వాడుకాదు. నిన్ను మరల్చాడినికే ఈవాదం చేశాడు. అన్నాడు.
దీని వలన లోకక్షేమంకోసం విపత్కర పరిస్థితులలో మన పెద్దలు ఈవాదాన్ని వుపయో గించేవారు కాబోలు. కొన్ని ప్రమాదకర రోగాలకు ఆయుర్వేదమ్లో పాము విషంతో వైద్యం చేస్తారు. దాని వుపయోగం అప్పూడు మాత్రమే . అదేపనిగా దాన్ని వాడితే ప్రాణాలకే ముప్పు. . అలాగే సమాజహితము కోసం సృష్టి వికాసంకో సం అన్నీ సృ సఃటించబడ్డాయి. వాటిపని అవిచేసుకు పోతున్నాయి. దేనివలననయినా లోకానికి మేలు జరిగితే దైవానికి istamE
2 వ్యాఖ్యలు:
మీరు తెలిపిన ఈ విషయము చాలా అమూల్యం. జీవిత సత్యం.
మీరు తెలిపిన ఈ విషయము చాలా అమూల్యం. జీవిత సత్యం.
Post a Comment