అదెవరు,చెప్పడానికి?
>> Monday, June 9, 2008
ఒక బిచ్చగాడు ఒక ఇంటిముందు నిల్చుని అమ్మాబిచ్చంవెయ్ తల్లీ అని చాలా సేపు అరిచాడు. వీడిగోల తట్టుకోలేక ఆ ఇంటికోడలొచ్చి , బిచ్చ0లేదు గిచ్చమ్లేద పోవయ్యా అన్నది. వాడు కాల్లీడ్చుకుంటూ వెలుతున్నాడు. వాడికి, అత్తగారు యెదురైంది. యెక్కడికిరా పోయ్యొస్తున్నావు, అన్నది. మీఇంటికి బిచ్చానికి వెడితే , మీ కొత్త కోడలు బిచ్చ0 లేదుపొమ్మని కసురు కుందమ్మా, అనిచెప్పాడు. అలాగా నువ్వురారా అని అత్తగారువాడిని పిలుచకెల్లి, తాను ఇంట్లోకెల్లింది. యెంతయినా ఈవిడమహాదాత అనుకుంటూ బయట్నిలబడ్డబిచ్చగాడు రాబోయే బిక్ష కోసం యెదురు చూస్తున్నాడు. చాలాసెపటికి బయటకొచ్చిన అత్తగారు ,పొద్దున్నె తగలబడ్డావా బిచ్చ0 లేదు ఫో అని కసురుకుంది.ఆమాట మీకోడలు ఇందాకనే చెప్పిందిగదమ్మా?అన్నాడు విస్తు పోతూ. అదెవర్రా?ఆమాటచెప్పడానికి? ఈ ఇంట్లో ఏంచెప్పినా నేను చెప్పాలి. గయ్ మంది అత్తగారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment