కాపురం నిలబెట్టిన కపీశ్వరుడు.
>> Saturday, June 7, 2008
వినుకొండ కొత్తపేటలో రమాదేవిగారనే టీచర్ గారు వుండేవారు
ఆవిడ మాకు 9 వ. తరగతిలో n.s. చెప్పేవారు. ఆవిడభర్తకు సరయిన వుద్యోగము లేక రక రకాల వృత్తులు చేస్తూ స్థిరత్వము లే కుండా వుంటుండేవారు. ఈయనకు పలు అవగుణాలు వున్నాయని చెప్పుకునేవారు. ఇద్దరు పిల్లలు కలిగినా ఈయన ప్రవర్తనలో మార్పులేకపోయినా ఆ తల్లి యెంతో సహనముతో కాపురము నెట్టు కొస్తుండేది. ఈయనకు గవర్నమెంట్ హాస్పటల్ లో పనిచేసె ఒక నర్సు తో అక్రమ సంబంధం ఏర్పడింది. అప్పటినుండి ఈవిడ పరిస్తితి దయనీయముగా మారింది. ప్రతిరోజూ తిట్టడం కొట్టడం ,విడాకు లివ్వమని వేధించడము మొదలయ్యాయి . తను సంపాదించేదేమీ లేకున్నా ఖర్చులకని వేధించి దడబూ తీసుకవెల్లి వుంపుడుగత్తెకు సరదాలు తీర్చడము ఇదీవరుస. వేధింపులు శృతి మించి పోయాయి. ఒకరాత్రి నిద్రపోతున్న ప్పుడు ఈవిడ ముఖముపై దిఁడు అదిమి చంపటానికి కూడా ప్రయత్నించాడు. పొద్దుటే ఈవిడ ఏడ్చు కుంటూ ఆ యింటి కెదురూగనే నివాసం వుంటున్న హనుమదుపాసకులు శ్రీ ప్రకాశమయ్య గారి వద్దకు వెళ్ళి విల పిస్తూ నాన్నగారూ[ఆయనను అందరము అలాగే పిలుస్తాము] నేనిక బ్రతకలేను. ఏదోరోజు మా ఆయన దుర్మార్గానికి బలవుతాను. నాబిడ్డలు పసివాళ్ళు. తల్లిలేక దిక్కులేనివారయిపోతారు. అలాగని పుట్టింటికి వెళ్ళి పలుచన కాలేను. నన్ను రక్షించండి . నాభర్త బుధ్ధమారి నా కాపురం నిలబెట్టే మార్గం చెప్పండని వేడుకున్నది. అమ్మా! కర్మఫలం ఇలా పట్టి పీడిస్తున్నప్పుడు మానవప్రయత్నాలు ఏమీ చేయలేవు. త్రికరణ శుద్ధి గానమ్మి హనుమంతుని ఆశ్రయించు అన్నారు. లాంగూల స్తోత్రం వుపదేశించి నారు. కస్టాలలో వున్నఈవిడ తీక్షణముగా సాధన సాగిస్తున్నది. ఈ సంఘటన జరిగిన రోజునుంచి తన భర్త ఇంటికి రావడము, అన్నము తినిపోవడము తప్ప పలకరించటము లేదు. ఒక రోజు రాత్రి నిద్రపోతున్న అతను చావుకేక పెట్టి మంచం మీదనుంచి ఎగిరిపడి లేచి గడగడా వణికిపోతూ భయంతో కేకలేస్తున్నాడు. ఈఅరుపులకు చూట్టుపక్కలవాళ్ళూ లేచివచ్చి ఏంజరిగింది... ఏంజరిగిందని అతనిని అడుగుతునారు .అతను వెర్రిచూపులు చూస్తూ అడిగో ఆంజనేయ స్వామి నన్ను తోకతో కొట్టాడు, అని బెంబేలెత్తి పోతున్నాడు. ఇక లాభం లేదు వీడేదో ఆంజనేయస్వామంటున్నాడూ అని వాళ్ళు అతనిని. ఎదురింట్ళోవున్న ప్రకాశమయ్య గారి వద్దకు తీసుకువచ్చారు. అతని వీపుపై చేంతాడుతో పీ కినట్లు వాతతేలి వుంది. ఆయన వచ్చిన వారిని బయటకు పంపి, ఒరే నీ పాపం పండింది. నీభార్యను వేధిస్తే నువ్వుచస్తావు. ఇప్పుడు స్వామి రక్షణలో వుంది ఆమె. బుధ్ధి మార్చుకుని ప్రవర్తించమని, చెప్పి అతని శిరస్సు పై చేయివుంచి అతను భయం తొలగించి తొలగించి పంపాడు. దెబ్బకు దెయ్యం వదలినట్లు తరువాత అతను భార్యా పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, అన్యోన్యంగా వుంటున్నారు. ఇప్పుడు ఆవిడ m.e.o.పనిచేస్తున్నారు. స్వామి పరమ భక్తురాలుగా వున్నారు.
2 వ్యాఖ్యలు:
మీరు వ్రాస్తున్న ఘటనలు చదువుతుంటే అస్తి నాస్తి విచికిత్సలో ఉన్నవారికి విశ్వాసం మరల చిగురుస్తుంది. కొలిచినవారికి శ్రీదేవుడే కొంగుబంగారమని మళ్ళీ గుర్తు చేస్తుంది.
పరిశీలించిచూస్తేనేగానీ మనచుట్టుపక్కల వున్న ప్రత్యేకతలు కనపడవు. పరిశీలించకుం డానే నిర్ణయాలు చేసి నిర్వచనాలిచ్చే మన నాస్తికవాదులగురించికాక ,ప్రయోగాత్మకంగా వున్నతస్తాయి కెళ్ళిన శాస్త్రవేత్తలు యెప్పుడూ భగవంతుని గురించి లేడని నిర్ణయాలు చేయలేదనే విషయం వాస్త వంకాదా?. జీవితమనే ప్రయోగశాలలో ప్రయోగం చెయ్యగనే ఫలితాలు తేలవు. అప్పటిదాకా పరిశీలించే ఓపికలేని వారు రెండుగంటలలో ఫలితాలు కావాలి చూపండి అంటే ఎలా? దేనిలెక్కలు దానికుంటాయి ఆలెక్కలతో చూడగలిగితే ఆదేవదేవుని లీలలు మనకు ప్రత్యక్షంగానే గోచరిస్తాయి. చదివినందుకు మీకు నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
Post a Comment