తెలుగు బ్లాగర్లకు ప్రణామములు..
>> Saturday, June 7, 2008
నన్ను ఆదరించినందుకు
బ్లాగు యెలా వ్రాయలో నాకు తెలియదు. దేవీ భక్తురాలు జ్యోతిగారి ఆంధ్రజ్యోతి వ్యాసం చూసి వెబ్ దునియ లో ప్రయత్నించి మొదలు పెట్టాను. అదేమిటో నాకు చిన్నతనము నుండి దేవీ భక్తుల ద్వారానే నేను చేయవలసిన పని నాకు ప్రేరణగా తెలియజేస్తున్నది జగన్మాత. అల్పుడనైనా నన్ను తనసేవకు నియమించి తనపుత్రులను తానెప్పుడూ కాచి వుంటానని నిరూపిస్తున్నది ఆజగజ్జనని. మొత్తం వ్రాసిన పోస్టులు రాసిలోనూ ,వాసిలోనూ చాలాతక్కువైనా ఇంతమంది సాహితీ ప్రియులు భక్తులు వీటిని చూసి మెచ్చుకుని నన్ను ప్రోత్సహించారంటే , తల్లీ నిన్ను నమ్మిన మూగవాడుమహావక్తగా,కుంటివాడు కొండలుదాటేలా మూర్ఖుడు మహాపండితుడని పిలువబడతారనే శృతి వ్యాఖ్యలు సత్యం..సత్యం..పునఃసత్యం. మొత్తము పోస్టులను చూసినవారిసంఖ్య 5343 మందిగా కనపడుతున్నారు వీరందరి పేరు పేరునా ధన్యవాదములు. సోదరి జ్యోతిగారికి,రాధికగారికి, చక్రవర్తిగారికి,విజయలక్ష్మి గారికి మాగంటివంశీగారికి కిశొర్ గారికి వీవెన్ గా రికితదితర బ్లాగర్లందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. పరమాత్మనెలా సేవించుకోవాలో ఆచరించిచూపి భక్తుల చేయి పట్టుకుని నడీపే " మాబాస్" ఆంజనేయస్వామివారికి సాష్టాంగ ప్రణామాలు.ఈ బ్లాగులలో మీకు మంచివని పించిన విషయాలన్నీ మనపెద్దలవి,మనరుషిపరంపరవి. వీటిలోదొర్లిన తప్పులన్నీ ఖచ్చితముగానావే. నాబుధ్ధిహీనతవలన జరిగినవి మాత్రమే. మీ ఆశీస్సులతో మహాత్ములు మనకందించిన సంపదను మనందరము కలసి పంచుకునేందుకు భక్తజనదాసునిగా నాబాధ్యతలను సవినయముగా స్వీకరిస్తున్నాను. ఎదుటా ఎవ్వరులేరూ...అం తా విష్ణుమయమే....వదలకహరిదాస వర్గమైనవారికీ..... అన్న అన్నమయ్యకీర్తనపాడుకుందాం...
వుంటానుమరి.
0 వ్యాఖ్యలు:
Post a Comment