శ్రీ ఆంజనేయం -1
>> Saturday, June 7, 2008
"అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద
రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో"
నాకు మొదటినుంచి డాక్టర్ ను కావాలని. కోరిక ఆతరువాత మిలటరీలో చేరాలని ఇష్టం. మాది పల్లెటూరు కావటం. ఇప్పటివలే సరయిన సమాచారం అందు బాటులో లేకపోవటం , దానికి తోడు టీచరయినా మా నాన్నగారికి బయటి సమాచారం సరయిన అవగాహన లేకపోవటం వలన నేను నా ఇష్ట మయిన వుద్యోగాలు చే పట్టలేకపోయానని మూర్ఖంగా భావించేవాడిని. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ జగన్మాత ప్రణాళిక ప్రకారం ఈతోలుబొమ్మలాట. జరుగుతున్నదని అర్ధం అవుతున్నది. ఇంటర్ బై పి సి తో పూర్తి చేసి విజయవాడ వెళ్ళి బి.ఎ.ఎం.ఎస్. ఎంట్రన్స్ కు అప్లయి చేసానే గాని ఏగ్జాం మోడలు కూడా తెలియక గుంటూరు వెళ్ళి కోచింగ్ తీసుకునే శక్తి లేక పరీక్షలో మనం డుమ్మ కొట్టాం.
ఇక నాకు మిలటరీలో చేరాలనే కోరిక వుందిగదా! దాన్ని వదలించిన వైనం ఇది.
మొదటి సారి గుంటూరు రిక్యూర్ట్మెంట్ కువెల్లగా ఫిజికల్, మెడికల్ టెస్టులన్నీ ఓ.కే. అయ్యాక ఆదిక్కుమాలిన డాక్టర్ చెవులు పరీక్షించి, గుబిలి వుంది మళ్ళీసారి రాఫో.. అని తరిమాడు. రెండవసారి వెళ్ళినప్పుడు మమ్మల్ని డ్రాయర్లపై వుదయం నుంచి సాయంత్రం 5 గంటలదాక కూర్చోబెట్టి , ఈరోజు సెలక్షన్ జరగటం లేదు పొమ్మని చెప్పారు. మాకు ఒక్కోక్కరికి ఇద్దరు మనుషుల కోపం వచ్చి ఆఫీస్ గేటుము0దు గొడవ చేస్తూ వాదనకు దిగాము. నాకు తెలియ కుండనే నేనుముందున్నాను. లోపలనుంచి ఆఫీసర్ ఒకరు వేలు చూపిస్తూ వాన్ని లోపలికి పట్టుకరమ్మని చెప్పడం తోవాచ్మెన్ వచ్చి నా చొక్కా పట్టుకున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే పోరాట యోధులంతా పరార్. లోపలకు వెళితే ఎముకల్లోసున్నం కూడామిగలదని అర్ధమై, వాచ్ మెన్ ను విదిలించి కొట్టి శ్యామలానగర్ నుంచి అప్పూడే మలుపు తిరుగుతున్న సిటీ బస్సెక్కి విజయ వంతంగా తప్పించుకున్నాం . మళ్ళీ మిలటరీ మాటెత్తితే ఒట్టు.
తరువాత ఉదయం పత్రికలో రిపోర్టర్ గా పని చేస్తూ వుండగా ఎసై. సెలక్షన్స్ కు హాజరయి, ఫిజికల్ టెస్ట్ అయిపోయి నా కోచింగుకు వెళ్ళే స్తోమతలేక రిటర్న్ టెస్టు తన్నింది. తరువాత గ్రూప్ 2 ప్రిలిమినరీ పాసయి మెయిన్ కు వెలదామను కునేసరికి నాకు పెళ్ళయి న నాలుగు నెలలకు నాన్నగారు చని పోవడం తో అదీ హరీ మన్నది. నేనెప్పుడూ అనుకోని బియిడి విచిత్రంగా అన్నామలై డిస్టెన్స్ ...... లోచేయటం నాన్నగారి బలవంతం వలన జరిగింది. ఆయన చనిపోయిన తరువాత వుద్యోగం తమ్మునికి పెట్టించాము. ఖాళీగా వుంటే బాగుండదు కనుక గ్రామానికి దూరంగా వున్న మాపొలము లో చిన్న పాకాలు వేసి హిందు పబ్లిక్ స్కూల్ పేరుతో స్కూల్ ప్రారంభించాము. కాలంగడుస్తున్నదే గాని స్తిరత్వము లేదు. తరువాత బి.యి.డి. పూర్తయి టీచర్స్ సెలక్షన్కు హాజరయినా, తప్పక వస్తుందనుకున్న జాబ్ రాకపోవటం తోచాల డీలా పడ్డాను,. మళ్ళీ 1996 లో డియెస్సీ ప్రకటించారు . పరీక్ష బాగా వ్రాసాను ఇంటర్వ్యూ లో నన్నడిగి అప్పటి కలెక్టర్ నాగేశ్వరరావుగారు , సి ఇ.ఓ. వెంకటేశ్వరరావు గారలు నన్నడిగి మరీ మరీ పద్యాలు పాడించుకుని నన్ను మెచ్చుకోవడంతో నాకు తప్పని సరిగా వుద్యోగం వస్తుందని. ఆశ పడ్డాను. నాకంటె చదువులో తక్కువ స్తాయి అనుకున్న వారికి వచ్చినా నాకు ఈసారి కూడా రాకపోవడంతో మా అమ్మగారికి దుఖము ఎక్కువై అది దైవదూషణ స్థాయికి పోయింది. వెయిటింగు లిస్టులోనన్నా చూడాలని బుద్ధిమాలిన సలహాలతో ఒక మంత్రిగారి సిఫారసు కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ పడిగాపులు కాస్తుండగనే వైటింగ్ లిస్తూ వచ్చింది. ఇక మనకు ప్రాప్తం లేదు మళ్ళీ డిఎస్సీ పడినా వ్రాసే ఆసక్తి వుండదు అని నిర్ణయించుకొని ఇంటి కొచ్చేసరికి మాఅమ్మ ఏడుపులు ఎక్కువయ్యాయి . ఇంతమంది దేవతల సేవచేస్తున్నావు. చిన్నప్పటినుంచీ సేవిస్తున్న నీఆరాధ్య దై వాలు దుర్గాదేవి , వేంకటేశ్వర, శివ పూజల వలన నీకు ఏమి లాభం? జనమంతా ఈ యన పూజలు ఈయనకే వుపయోగం లేనప్పుడు ఏందుకు ? అని ఎగతాళి చేస్తున్నారు , వీళ్ళకు పూజలు వద్దు ప్రసాదాలు దండగ అని దుఖంతో సాధించడం ఎక్కువయింది. మా ఆవిడ ఏమి మాట్లాడకపోయినా ఆవిడపరిస్థితి అదేనని అర్ధ మవుతున్నది. వీరి బాధ ఎక్కువయిన కొద్దీ నాలో భగవ0తుని పట్ల విశ్వాసం ఎక్కువవుతున్నది విచిత్రంగా. సరే ఇక లాభమ్లేదనుకుని ఒకరోజు నా స్నేహితుడు హనుమంతరావుని వెంటబెట్టుకుని మాగురువు గారు హనుమదుపాసకులు ప్రకాశమయ్యగారి వద్దకు వెళ్ళాను. పక్కనున్నవాడు నామాటలు నమ్మి మారిన కమ్యూనిస్ట్ .వాని పరిస్థితి సేమ్. ఆయనకు విషయం వివరిం చాము.
మళ్ళీ ఎప్పుడో సెలక్షన్ పడినా రాసే ఆసక్తి లేదండీ.... అని నిరాశగా మాట్లాడుతూ , ఇంట్లో బయటా వినిపిస్తున్న మాటలను చెబుతున్నాము. అంతలోనే ధ్యానము లోకి వెళ్ళిన ఆయన కొద్దిసేపటి తరువాత కళ్ళు తెరచి , దుర్గా! నీకు జాబ్ వస్తుందిరా అన్నాడూ. ఆ... మళ్ళీ . ఈ గవర్నమెంట్ పరీక్ష పెట్టీ మనం రాసీ ... నిరాసక్తతగా అన్నాను. అవసరము లేదు ఇప్పుడే ఇదే పరీక్షపై నీకు జాబు వస్తుంది అన్నారాయన పట్టుదలగా. పెద్దల మాటల పట్ల నాకుచిన్నతనం నుంచీ అపార విశ్వాస0 . అయితే నీ విప్పుడు తీవ్రమయిన హనుమదుపాసన చేయాలి అన్నారు. ఒక మంత్రాన్ని ఉపదేశించి . ప్రశాంతంగా వుండే చోట నిష్టగా చేయమని ఆదేశించారు. హనుమంతరావుకు నీ కు ఇది ప్రాప్తం లేదు కాని నీ భవిస్యత్ కు వుపయోగ పడుతుంది . నీవు వెళ్ళమని చెప్పారాయన. మహా శక్తివంతనమయిన మదమంచిపాడు హనుమత్ క్షేత్రం ఇప్పటిలా అప్పటికింకా ఆలయాల నిఱ్మాణమ్ అదీ జరగలేదు గుండ్లకమ్మ నది ఒడ్డున ఏకాంతంగా జనసంచారం లేకుండా.. ఒక్క శనివారం మాత్రం రద్దీగా వుండేది. అక్కడికెళ్ళి మొదలు పెట్టాము ప్రదక్షణలు. అలుపువచ్చినదాకా గుడి చుట్టూ తిరగడం అలుపువస్తే గుండ్లకమ్మలో మునిగి రావడం మళ్ళీమొదలు పెట్టడం మంత్రజపం అనుసంధిస్తూ చాలీసా. ఇదీ వరుస. మేము అక్కడవుండగనే వారము రోజులకు అదే డిఎస్సీ పై మరిన్ని పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడము విని బిత్తర పోయాము. మరింత స్రద్ధాసక్తులతో కార్యక్రమం ముగించాము. నేను ప్రదక్షణాల లెక్క కోసం శనగలు వాడాను. వాటిని అక్కడవున్న తులసికోటలో పోసి ఇవి మొలకెత్తి చక్కగా పెరిగేలోపుగా నాకు వుద్యోగము రావాలి. ఇదినీశక్తికి కాదు నాభక్తికి పరీక్ష. లేకుంటే భగవంతుని మహిమలను చెప్పేటప్పుడు నేను నవ్వుల పాలు కావలసి వస్తున్నది. అని చెప్పుకుని వచ్చేశాను. తరువాత 14వరోజు నేను పూజ చేసు కుంటూ వుండగా మా పక్కఊరు మనిషి వెంకటరెడ్డి హోటల్ వద్దనుండి అప్పుడేవచ్చిన పేపర్ తీసుకుని ఏమోయ్ అల్లుడూ! వుద్యోగాలు వేసారు నీ నంబరు వుందా అని హడావుడిగా వచ్చాడు. చూస్తే నానంబరు ఉంది. తరువాత మదమంచి పాడు వెళ్ళి చూస్తే శనగలు చక్కగా పెరిగివున్నాయి. తరువాత నేను మావూరి ప్రక్కనే గ్రామములో వుద్యోగము లోచేరాను. మొదట అనుకున్న విధంగా నాకుఏ ఇతర వుద్యోగం వచ్చినా ఇక్కడకు దూరంగా వెళ్ళవలసి వచ్చేది దానివలన ఈ సేవాభాగ్యానికి దూరమయ్యేవాడిని.
ఈక్షేత్ర నిర్మాణం ,మరింతగా జరిగిన ఆ భగవత్ కృపావర్షానికి నోచుకోలేక పోయేవాడిని. భగవంతుని ఎలా సేవించు కోవాలో నేర్పిన హనుమత్ స్వామి తనను నమ్మిన వారికి అసాధ్యం లేకుండా చూస్తా డనడానికి జరిపినలీఈలలో నాబోటి అల్పునికి అవకాశం కలగటం ఆస్వామి ప్రేమకు గుర్తు. జయ హనుమంత మహాబలవంత. .......
0 వ్యాఖ్యలు:
Post a Comment