శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పిల్లలకు పేర్లెందుకుపెట్టాలి?.

>> Saturday, June 7, 2008

ఈమధ్యకాలము లో పిల్లలకు పేర్లుపెట్టడములో తల్లిదండ్రులు అనుసరిస్తున్న పద్దతులను చూస్తుంటే ఏదో నామనసులో మాటవ్రాయాలని చాలాకాలముగా అనుకుంటుండగా ఈరోజు కుదిరింది. అసలు పేర్లెందుకు పెట్టాలండి? ప్రతిజీవికి ఆమాటకొస్తే ప్రతివస్తువుకు కూడా ఒకప్రత్యేక గుర్తింపు నిచ్చేది దానిపేరే . అయితే మేధోపరంగా ఎదిగిన మానవునికి మాత్రమే ఈ పేర్లను చక్కగ వినియోగించుకునే శక్తి వుంది. పేరును పిలిచినప్పుదడుగాని తలచినప్పుడుగానీ వచ్చేభావము మనము వినికిడి ద్వారా విన్న శబ్ధము. శబ్ధము కూడా ఒక శక్తిరూపము. దాని ప్రభావము మనమనస్సుపై చాలా ఎక్కువగా వుంటుంది ఉదాహరణకు చక్కటి వాయిద్యాలపైనుంచే వచ్చేశ బ్ధము మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే పాతడబ్బాలను బాదితే వచ్చే శబ్ధము కర్ణకటోరం గా వుండి మనస్సును చికాకు పరుస్తుంది. ఏంటీ సుత్తి అనుకోకండి. విషయానికొస్తున్నా

. పేర్లను అర్ధప్రధానముగా మనవాళ్ళు పెడతారు . కొంతమంది తమ ఇస్టదైవము పేర్లను పెట్టడము ద్వారా పిల్లలను పిలిచినప్పుడెల్లా భగవన్నామస్మరణ చేసిన పుణ్యాన్ని పొందుతారు. అజామిళుని కథ అటువంటిదానికి వుదాహరణ. మరికొందరు గుణగనాలను దృష్టిలో వుంచుకుని, మరింకొందరు గొప్పవ్యక్తుల వలన ప్రభావితులై వారి వంటి మంచి గుణాలు తమపిల్లలకు రావాలని పేర్లు పెడుతుంటారు. లోక శ్రేయస్సుకై తమ జీవితాలను అంకితము చేసిన అటువంటి పుణ్యజీవుల పేర్లను పెట్టుకోవడము ఎంతో గౌరవప్రదము. ఇక కొందరు తమ పెద్దల పేర్లను తమపిల్లలకు పెట్టుకుంటుంటారు. ఇది కూడా చాలా కృతజ్ణత చూపించే మంచిపద్దతి. మనకు ఏదన్నా కష్టసమయములో ఒక వందరూపాయలు సహాయము చేసిన వారినైనా గుర్తుంచుకుని వారిగురించి చెప్పుకుంటుంటాము. మరి మనకు జన్మనిచ్చి, మనకు ఒక గౌరవప్రదమైన స్థానాన్నిచ్చి, వంశాన్నిచ్చి, సంపదనిచ్చి ,ప్రేమా ఆప్యాయతలు. , సంస్కృతీ సాంప్రదాయాలనిచ్చిన మనపెద్దల పేర్లు మనపిల్లలకు పెట్టడము నిజంగా మన మానవత్వానికి గుర్తుకదా!
ఈ మద్య . శబ్ధ ప్రధానముగానో ,లేక పలకలేనంత కష్టముగా పేర్లు పెట్టి ప్రత్యేకత చాటు కోవడానికోగాని, విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. చూస్తుంటే నవ్వు వస్తున్నది జాలి కలుగుతున్నది. ఉత్కృష్ట్, ఇలాంటివి ఈమధ్య పత్రికలలో చూసాను. అలాగే ఆడపిల్లలకు కూడా. రాబోయే రోజులలో నికృష్ట్ కంకుష్ట్, ఆడపిల్లలకు అసహ్య,అసభ్య లాం టి పేర్లొస్తాయేమో ఖర్మ.
తల్లిదండ్రులు కొంచెం నిదానము గా ఆలోచించి మీ బిడ్డలపేర్లు నిర్ణయించండి. పేరంటే ఒక మంత్రం . దాన్ని పదేపదే స్మరించడము వలన అందులోని అక్షరాల అనేక రకాలయిన శక్తి తరంగాలను వుత్పత్తి చేస్తాయి. ఆశక్తి ఆజీవిని ప్రభావితము చేయగలుగు తుంది .
వుంటానుమరి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP