ఇందిరాగాంధి..తెలివి...
>> Monday, June 9, 2008
బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గం లో రంగారెడ్డి మంత్రిగా ఉండేవాడు. ఎక్కడికి వెల్లినా ఆయనను వెంటబెట్టుకుని వెల్లేవాడు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటానికి, అనేకపధకాలు తయారు చేసుకుని, వాటి మీద బాగా ప్రిపేరయి, ఢిల్లీ బయలుదేరేవారట. అక్కడికి వెల్లాక మరొక్కమారు తమ ఇంగ్లీషు పరిజ్జానాన్ని పరిశీలించుకుని, ప్రధాని ఇందిరకు ఎలా వివరించాలో రిహార్శలు వేసుకుని ఆమెతో భేటీ అయ్యేవారు. ఎలాగయినా భారీ నిధులు ఇప్పించుకుని తిరివెల్లాలని బాగా పట్టుదలగా నిర్ణయించుకుని ఉండేవారు. వీళ్ళనుచూడగానే ఇందిరాగాంధీ ఆప్యాయంగా పలకరించి ఆంధ్రా సంగతులన్నీ అడిగేవారు. అమ్మా! జనం మిమ్మల్ని దేవతలా భావిస్తున్నారు, మీరేతమ కస్టాలు తీర్చగలరని నమ్ము తున్నారు. అంటూమొదలు పెట్టేవారు. ఎస్ .. రెడ్డీజీ వుయ్ డూ మోర్ ఫర్ ద పూర్ ప్యుపుల్,ఇన్ ఆంధ్రా..అంటూ సంతోషం వ్యక్తం చేసేవారట. ఇంకేమి.. వెంటనే వీళ్ళ లిస్ట్ మొదలు పెట్టేవారు. తక్కువ నిధులు అవసరమయ్యే పధకాలన్నిటికీ ఒ. కే రెడ్డిజీ వుయ్ డూ ఇట్ ఒ.కే.... అంటూ తలఊపేవారు. ఎక్కువ నిధులు అవసరమయ్యే పధకాలగురించి వీళ్ళు వివరించటం మొదలుపెట్టగనే... ఏ క్యాహై రెడ్డిజీ, ఇస్ మే......... అంటూ హిందీ లోకి మారేవారట. అంతే.... బ్రహ్మానందరెడ్డి లేచి ఒరేయ్ .... రంగారెడ్డా! ఈ ముండ. . చెయ్యదుగానీ, ఇంకపోదాం, పా...... అంటూ.. టోపీ విదిలించుకుంటూ, లేచివచ్చేవారట.
2 వ్యాఖ్యలు:
పెద్ద మొత్తంలో MP లను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో సరఫరా చేసినా, మనకు రావలసిన నిధులు రాలేదనడం ఇప్పటికీ నిజమే.
అలాంటి తెలివితేటలు గలది గనుకనే ఒంటిచేత్తో పార్టీని దానిలోని మహామహులను శాసించగలిగింది ఆవిడ.
Post a Comment