భవిష్యవాణి-కీరో
>> Sunday, July 20, 2008
ముందుమాట
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన శాస్త్రం – జ్యోతిషమే 1 దీనికి కారణం- ఆదికాలమునుండి మానవుడికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్నదే అత్యంత కుతూహలాన్ని కలిగించే ఆసక్తికరమైన ప్రశ్న కావడమేనేమో 1
అసలు ఎవరన్నా – జరగబోయే విషయాలను ముందుగానే చెప్పగలిగారా .
- అలా చెప్పినది చెప్పింది చెప్పినట్టే ఎవరకైనా జరిగాయా – ఉంటే చెప్పండి 1 చరిత్రలోనే యదార్ధ సాక్ష్యాలతో
అంటూ అనేక మంది జ్యోతిషంగురించి తెలియనివారు తరచూ ప్రశ్నించడం మనకు అనేక సార్లు విని పిస్తుంది ముఖ్యంగా పత్రికలలోనూ ఇంకా ఇతరిత్రా1
దానికి సనాధానం ఇచ్చేది – చరిత్రయే1 ప్రపంచం పుట్టకనుంచీ యదార్ధంగా జరగబోయే భవిష్యత్తు చెప్పినవారూ వాళ్ళు చెప్పినది చెప్పినట్టే జరిగినవారూ కావాలంటే కాలంలో తొలి కాలజ్ఞానంగా – భవిష్యపురాణం అన్న అద్భుత గ్రంధాన్ని రచించిన వేదవ్యాస మహర్షియే – అంటే ఇది పురాణకధలనుకుంటారు.
అలాగే పుట్టబోయే అనేక మంది జాతకాలను నాడీ గ్రంధాల రూపంలో వ్రాసినవి ఇప్పటికీ తాటాకుల గ్రంధాలరూపంలో తాళ పత్రాలలో మనకింకా లభిస్తున్నాయంటే మన వేలి ముద్రలను పరిశీలించి ఆ రేఖలనుబట్టి ప్రతిమనిషి పుట్టినటైమూ, నక్షత్రమూ వారి జాతకములోని గ్రహాలను తల్లి తండ్రిపేరు వగైరా లూ తెలిపే ఏనాడో కొన్ని వేల సంవత్సరములనాడే ఈనాడీ గ్రంధకర్తలైన భృగు, అగస్త్య మహర్షి వంటినారూ వ్రాసిన గ్రంధాలూ ఇంకా ఈనాటికీ లభిస్తున్నాయంటే అది ఒక్క భారత దేశఁలోనే సాధ్యం. కాని ఇవన్నీ అతి ప్రాచీనమైన విషయాలు
ఆధునిక కాలంలో ఇలా జరిగింది జరిగినట్లు జరగకముందే ఎన్నో సంవత్సరాలకు ముందే జరగ బోయే భవిష్యత్తు చెప్పినవాడు కీరో
అలాగే ప్రపంచ భవిష్యత్తు వ్రాసినవాడు కూడా కీరో యే అలాగే ప్రపంచ భవిష్యత్తు వ్రాసినవాడు ఫ్రెంచి ద్రష్ట నోస్ర్టడేమస్ ఎక్కువగా దేశాల భవిష్యత్తునే రాసాడు – అదీ చాలమందికి అర్ధం కాని నిగుఢమైన ఫ్రెంచి భాషలో . కాని కీరో మాత్రం ప్రతివారికి అర్దమయ్యే భాషలోనే ప్రతివారికి జరగబోయే భవిష్యత్తును అతి స్పష్టంగా వారి జన్మ తేదీలతో సహా ఎంతో ముందుగానే వారికి తెలిపాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది గదా.
ఇలాంటి ఆశ్చర్యాల అనుభవాల మాలికయే ఈ అదృష్టరేఖ అన్న కీరో భవిష్యత్తు తెలిపిన భవిష్యాలను తెలిపే , ఈ అద్భత అనుభనాల గ్రంధము.
ఇది కథకాదు. ఇది సమకాలీన చరిత్ర . యదార్ధ జీవితం ఉజ్వల జ్యోతిష చరిత్ర 111 జ్యోతిషంయొక్క చిరిత్రలోనే – ఒక సువర్ణాధ్యాయం
ఫలితంగా, ప్రపంచంలోని అతి ప్రాచీన కాలంనుంచీ జ్యోతిషం భనిష్యత్తును తెలిపే జాతకం హస్తసాముద్రికం . ప్రశ్న శాస్త్రం వంటివి భగవంతుని తరువాత – దేవునుతో సమానంగా గౌరవాన్ని ఆదరణనీ పొంది అనేకులచేత ఆసక్తితో అధ్యయనం చేయబడుతున్నాయి ప్రపంచంలో 1 అతేకాదు – ఈనాడు జ్యోతిషాన్ని తిరస్కరించాలని రోమన్ కాధలిక్ క్రైస్తవ ఫాదరీలు వెయ్యేళ్ళుగా తలక్రిందులుగా తపస్సు చేస్తున్నా సరే – జ్యోతిషాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ముఖ్యంగా ఈనాటి సమాజంలో ఎవరంటే విదేశీయులు క్రైస్తవులే – నని చెప్పక తప్పదు1
విదేశీయులలో అగ్రగణ్యుడూ జ్యోతిషాన్ని ప్రపంచ వార్తా పత్రికల స్ధాయికి – ప్రచారము ఆదరణ పెంచిన వాడూ – ఎవరంటే ప్రపంచ కప్రఖ్యాత జ్యోతిష్కుడైన కీరో మహాశయుడే.
ఈనాడు మన దేశంలో ప్రతినాడూ తన చేతిలోని రేశలు చూసుకొని తన అదృష్టాన్ని పరిశీలించుకోనడం అంటే ఏమిటో కీరో హస్త సాముద్రికం – అనబడే పామి స్ట్రీ పుస్తకాలనుండే మొదలైంది- ఇలా ఇంతగా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తీ . అధ్యయనమూ పెంచినవాడు కీరో . నిజానికి కీరో ఈ జ్యోతిషం నేర్చుకున్నది – మన భారత దేశంలోనే.
-
బ్రాహ్మణ గురువులైన జ్యోషి పండితుల ప్రేమ, ఆదరణములతో నాకు నేర్పిన జ్యోతిష శిక్షణనుంచే ఇంత వాడినయ్యానని కీరో వ్రాశాడను చాలామందికి తెలియక పోవచ్చు1
అంతేకాదు కీరో మహాశయుడు తాను జీవించిన సుమారు 80 సంవత్సర కాలములో ఎన్నెన్ని పరమాశ్చర్యకరమైన వింత జ్యోతిషాలు చెప్పాడో – అవన్నీ ఎంత ఆశ్చర్యంగా అక్షరం పొల్లు పోకుండా - ప్రతి ఒక్కటీ యధాతధంగా ఎలా జరిగాయో అన్న విషయం కూడా మన వారిలో చాలా మందికి తెలియదు1
అందుకే అదృష్టరేఖ కీరో జ్యోతిష భవిష్యాలు ఆన్న ఈచిన్ని అధ్భత- యదార్ధ అనుభవాలను తెలిపే సస్పెన్సు గ్రంధం మీ చేతులలో ఉంచుతున్నాను. చదవండి.
కీరో మహాశయుడు పుట్టినది ఇంగ్లండులోనే. – కాని ఈయన నేర్చినది – తన జీవితాన్ని ధారపోసి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసిందీ కూడా భారతీయ శాస్త్రమైన జ్యోతీష శాస్త్రాన్నే111
అసలు ఇదెలా జరిగిందో ఆయన జీవితంలోని – యదార్ధ అనుభవాలను తెలిపేది – ఇండియా పిలిచింది – అన్న అధ్యాయంలో – అన్నీ వివరించాడు.
దాదాపు పాతికేళ్ళపాటు ఎడతెరిపీ లేకుండా ఉదయం నుండీ సాయంకాలందాకా లెఖ్ఖ లేనంత మందికి జాతకం చూసి “ హస్త సాముద్రికం “ ఫలితాలను తెలిపి వాళ్ళ జన్మ తేదీలలోని అదృష్టసంఖ్యలను లెఖ్ఖించి – వారికి జరగబోయే భవుష్యత్తును తేదీలతోసహా – రోజూ వందలమందికి చెప్పినవాడు బహుశా – కీరో ఒక్కడేనేమో 1
కీరో చెప్పిన జ్యోతిషం – విక్టోరియా మహారాణినుండీ ఇంగ్లండు చక్రవర్తి సప్తమ – ఎడ్వర్డు వరకూ బెల్జియం రాజు లియోపాల్ట్ నుంచీ ఇటలీ మహారాజు హమ్ బర్డ్ దాకా – పర్ష్యా చక్రవర్తి సుల్తాన్ ముఖఫరుద్దీన్ షా దగ్గిరనుండీ రష్యాను శతాబ్దాలుగా పాలించిన జార్ – చక్రవర్తిదాకా – ఇలా ఎందరో రాజులు , mahaa రాజులు కీరోముందు చెయ్యి చాచి – తమ bhavuSyattunu అడిగి – ఆసక్తితో తెలుసుకున్నవారే
ఒక్కరాజులేకాదు – మిలటరీ సేనాధిపతులు – లార్డ్ – కిచ్ సర్ వంటి కమాండర్ ఛీఫ్ లూ , ప్రఖ్యాత హాలీవుడ్ సినీనటి సారా బెర్నాడ్ దాకా, ఇటు – ప్రఖ్యాత అమెరికన్ రచయిత మార్క్ ట్యైన్ నుండీ చికాగో హంతకుడు , డాక్టర్ మేయర్ దాకా – అంతా కీరో జ్యోతిషం వలన లాభ పడిన వారే.
అంతేగాదు ఈమధ్య ఉధృతమైన సినిమా ఉజ్వల సినిమాతీసి కోట్లకు కోట్ల డాలర్లు దోచుకుంటున్న టైటానిక్ ఓడ జల ప్రళయం – ఎంతో ముందుగానే 15 ఏప్రిల్ 1912 మధ్యభాగంలో జరుగుతుందని స్పష్టంగా చెప్పినవాడు బహుశా కీరో ఒక్కడే 1
రష్యాలో 1917 – లో కమ్యూనిష్టు విప్లవం – జార్ చక్రవర్తుల పతనం , రక్తపాతం – ఇంకా రెండు ప్రపంచ యుద్దాలూ రష్యాలో కమ్యూనిజం టైఫాయిడ్ జ్వరంలా వ్యాపించడం భారత దేశానికి స్వాతంత్య్రం రావడం – ఇండియా రెండు దేశాలుగా విఢిపోయి రక్తపాతంలో స్వతంత్య్రం సంపాదించుకోవడం – ఇంకా మహాత్మా గాంధీయొక్క అహింస ఉద్యమం బ్రిటీషురాజ్య సింహాసనాన్నే గడగడలాడించి వేయగలదని ముందుగానే స్పష్టంగా రాసినవాడు కీరో మహాశయుడొక్కడే.
అంతేకాదు – కీరో ప్రపంచ భవిష్యత్తు అన్న సంచలన గ్రంధాన్ని – 1925 లోనే రాసి 1931 లో ప్రచురించి లండన్ లో భూకంపంవంటి సంచలనాన్ని సృష్టించాడు కీరో.
అంతేకాదు రష్యాయోక్క – రానున్న మహోన్నత ఉజ్వల భవిష్యత్తు అమెరిగా అపరిమిత ధనసంపదా – అమెరికా సంయుక్త రాష్ఠ్రం యొక్క నైమానిక బలమును ప్రపంచములో సాటిలేనివిగా పెరుగుతాయని ఎంతోముందే స్పష్టంగా వ్రాసినవాడు కీరో.
ఇవన్ని చదివి కీరో ఒక్క జ్యోతిష్కుడే అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే కీరో కేవలం జాతకాలు గుణించి గ్రహాలను మాత్రమే లెఖ్ఖించి డబ్బులు గడించే జ్యోతిష్కుడేకాదు – ఈయన ఒక గొప్ప యోగి .
గొప్ప యోగ సాధకుడుగా భారతదేశంలో – మూడున్నర సంవత్సరములవాటు – కేవలం పాలూ , అన్నమే తిని ఉప్పు, కారం లేకుండా కఠిన – సాధన చేసిన దీక్షాపరుడు 1 పశ్ఛిమ కనుమలలోని గుహలలోని శివాలయాలలో మంత్రోపదేశం పొంది ధ్యాన స్థితిలో – తీవ్రమైన గాఢ సమాధి లో మునిగి పోయి అలా 7 రోజులు శరీర స్మరణయే లేకుండా – మరణించి – తిరిగి జీవించిన యోగ సాధకుడు కీరోయే
ఆయన జీవితం చూస్తే కీరో కారణ జన్నుడు – ఆయన జ్యోతిష్కం కోసం తన జీవితాన్ని థారపోసిన, కీరో శరీరంలోకి అవతరించినది ఒక ప్రాచీన టిబెటన్ – యోగ పురుషుడు. అన్న విషయం కూడా చాలామందికి తెలుయదు. ఇది వింతల్లోకల్లా వింత.
అందుకే అమూల్యమైన ఏరిన వజ్రాలనంటి అధ్భుత అముభవాలను – ప్రపంచాన్నే గడగడ లాడించిన భవిష్యత్తునూ స్పష్ఠంగా చిత్రగుప్తుని శాసనంలాగా ముందుగానే రాసే జ్యోతిష భవిష్యాలను ఒక్క కీరోయే వ్రాయగలిగాడు.
ఇంకా వివరంగా చెప్పాలంటే – అవన్ని ఒక్కొక్కటే తదుపరి అధ్యాయాలలో వివరించడం జరిగినది.- అందుకే నదిలోని నూళ్ళన్నీ సముద్రంలో కలిసినట్లుగా – ఈ ముందుమాట తోనే మిమ్మల్ని – కీరో అనుభవాలనే ఆశ్చర్య సముద్రంలోకి నెట్టి – విడిచిపెడుతున్నాను.దీంతో.
కీరో పుట్టినది ఇంగ్లండులో కావచ్చు – కానీ ఇండియా పిలిచింది కీరోనే. ఎందుకంటే కీరో పుట్టింది ఇండియాకోసమే . ప్రాచీన ఋషుల విఙ్ఞానమైన – జ్యోతిషాన్ని ఉజ్జ్వలంగా వెలిగించడంకోసమే ఆయన పుట్టాడు – ఇదే ఆయన అదృష్టరేఖ.
భారతదేశం adhRushTarEkha కూడా ఇదే నేమో.
{వేదవ్యాస్ ఐ.ఎ. ఎస్. గారి రచన్ అదృష్టరేఖనుండి}
1 వ్యాఖ్యలు:
మన వేదకాలపు జ్ఞానాన్ని గురించి బాగా చెప్పారు.మీ ప్రయత్నం అభినందిచదగ్గది.భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు మీరు బ్రహ్మంగారు గురించి చెప్పడం మరిచిపోయారు.గమనించగలరు.ఇలా చెప్తున్నందుకు క్షమించండి.
Post a Comment