కర్మ ఫలితాలు బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివి
>> Tuesday, June 24, 2008
మనిషిజీవితము కర్మ ఫలితానుసారంగా జరుగుతుంటుంది. సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల ద్వారా తనకు సంక్రమించిన ఫలితాలను తాను అనుభవించకుండా తప్పించుకోవడము,కుదరదు. అవి సుఖాల రూపములో వున్నా,లేక కష్టాల రూపములో వున్నా . అయితే అవి అనుభవములోకి రావటానికి సమయాలు వేరు వేరుగా వుండవచ్చు. వుదాహరణకు మనం బ్యాంకులో కొంత డబ్బు దాచామనుకుంటే, దానికి వడ్డీ రావటానికి కొంత సమయం పడుతుంది. అలాగే అప్పు తీసుకున్నా దానికీ కొంతసమయము తరువాతనే వడ్డీ కట్టివసూలు చేస్తారు. మరిప్పుడు మొదటిదానికి వద్దన్నా నీలాభం నీకు ఇచ్చినట్లే ,రెండవడానికి తప్పించుకుందామను కున్నా ముక్కు పిండివసూలు చేస్తారు.
కొందరంటుంటారు. నేనెప్పుడూ ఎవరికీ కీడు చెయ్యలేదండీ ! నాకెందుకీ కష్టాలు వస్తున్నాయి. నేనెప్పుడూ పూజలు చేస్తుంటానండీ ,నాకేమిటీ కష్టాలు ? ఇలాగ. అయ్యా !మనజీ వితములో వర్తమాన కాలములో మనగురించి మనకు తెలిసేదే కొంత. మరి పూర్వ జన్మల ననుసరించి వచ్చే ఫలితాలనెలా తెలియగలుగుతాము. అందుకని ఈ రోజు నీకున్న సిరి సంపదలు, భోగ భాగ్యాలు ఇవన్నీ పూర్వ జన్మలలో నీవు చేసిన సత్కర్మల వలన భగవంతుని దయాను సారంగా వచ్చిన వని గుర్తించి వాటిపట్ల గర్వం లేకుండా మెలగాలి . వచ్చిన కష్టాలు కూడా తాము ఎప్పుడో చేసిన లేక ఏజీవరాసికో చేసిన హాని ఈ రూపములో వచ్చాయని తెలుసుకుని ఇతరులను నిందించకుండా మౌ నముగా అనుభవించటం నేర్చుకోవాలి. సాటి జీవరాసికి మనశక్త్యాను సారం సహాయపడుతుండాలి. ఇక్కడ నేనింత ఖర్చు పెట్టి చేశాను అనేగర్వ ము దరిజేర నీయకుండా చూసుకూంటూ వినయంగా ప్రవర్తించాలి. లే కుంటే చేసినదంతా వృధా అవుతుండి. అయితే ఈ కలియుగ ప్రభావము వలన తాము చేసినదానికి పదింతలు ప్రచారము కోరుకోవటం మొదలైంది దానివలన మనకు మిగిలేది ప్రచార మేతప్ప పుణ్యము కాదు.
నాజీవితములో కర్మశేషాలను
అమ్మ అనుగ్రహంతో వెంటనే అనుభవించే అవకాశము వస్తున్నది . నేను ఒకసారి ఇంకా ఆలయ నిర్మాణము జరుగుతున్న రోజులలో ఒక క్కుక్క పనుకుని వుండగా దానిని తోలాలని ఒక రాయివిసిరాను. అది వెళ్ళి దాని కాలికి బలంగా తగిలిన ట్లున్నది.. పాపమా కుక్క కుయ్యో.. కుయ్యో మంటూ చాలా బాధగా అరుస్తూ కుంటుకుంటూ పరిగెత్తినది అదిచూసి కొచెం బాధవేసింది. సరే అది నోరులేనిది మనమీద తగాదాకు రావటానికి దానికెవరూ లేరుగదా ! అందుకని దాని విషయం తేలికగా మరచిపోయాను.
తరువాత నాలుగు నెలలకు విను కొండనుంచి నేను నాభార్య టి.వి.ఎస్. మీద వస్తుంటే వుప్పలపాడు దాటిన తరువాత ఆవిడ పవిటచెంగు గాలికి చెయిన్ లో ఇరుక్కుని ఇద్దరమూ పడ్డాము ఆవిడ మోకాలు కు దుబ్బతగలగా నాకు ఎడమ పాదము లో ఎముకలు ఫ్ట్ మని శబ్దము చేసినట్లని పించింది కాలు భయంకరమైన నొప్పి మొదలయినది వెనుక వస్తున్న అర్.టి.సి. బస్సు వాళ్ళు బస్ ఆపి మమ్మలను ఎక్కించుకోగా బండి ఎవరో తీసుకుని ముందు వెళ్ళారు. ఇంటికి వచ్చిన తరువాత విరిగిన వాటికి కట్లు వేసే నూజండ్ల శ్రీ రాములు గారిని పిలిచి సరిచేపించి కట్లు కట్టించారు. ఆసమయమంతా నరక బాధను అనుభవించాను. తరువాత రాత్రి బాధతో నిద్ర పట్టక ఏమిటి బాధ అని ఆలోచిస్తూ వుండగా తళుక్కున మనసులో అబ్బా! బాధనీకేనా మిగతావారికి వుండదా? వూరికే అదిలిస్తే పోయే కుక్కను రాతితో కొట్టి బాధపెట్టినప్పుడు తెలియలేదా .అని అమ్మవారు చిన్నపిల్లలా ఎగతాళిగా మాట్లాడుతున్న భావన కలిగింది . అంతే నమస్కరించుకుని అమ్మా అప్పటి తప్పుకు ఇప్పుడు వేశావా శిక్ష అనుకుని దానిని భరించాను. ఈయన పూజలు గట్రా చేస్తాడుగదా ఈయనకెందుకిలా అని చూడటాని కొచ్చిన జనం ఆ సాయంత్రం మాట్లాదిన వన్నీ గుర్తుకొచ్చి నవ్వుకున్నాను . కర్మ ఫలితమెలా వుంటుందో చక్కగా ప్రయోగపూర్వకంగా చూపించిన అమ్మకు ధన్యవాదాలు చె ప్పుకూంటూ దానిని అనుభవించాను.
అందుకే సాయి అంటారు. నీ వద్దకు వచ్చే యే జీవరాసి అయినా అనుబంధాను సారంగా వస్తున్నదని గ్రహించి చీదరించుకోక చేతనయిన సహాయము చేయి అని బోధిస్తారు . సమర్ధ సద్గురువులకు జయము.
1 వ్యాఖ్యలు:
గురువు గారూ,మీరు చెప్పింది సరైనదే.కాని కర్మ ఫలాలు వాటి గాఢ తీవ్రతను బట్టి ఉంటుంది.వేసిన విత్తనాన్ని బట్టి చెట్టు ఉండేటట్లు మన కర్మల తీవ్రతను బట్టి వాటి ఫలాల సమయం ఆధారపడిఉంటుంది.గాఢ కర్మల ఫలితం వెంటనే వస్తుంది.వివేకానందుడు చెప్పినట్టు మన ప్రస్తుత జీవితం గత కర్మల ఫలితం,రాబోయే జన్మల లేక భవిష్యత్ జీవితం మనం చేయబోయే కర్మల ఫలితం.దీన్ని బట్టి మనం చేయబోయే కర్మల పట్ల జాగ్రత్త గా ఉండాలి.
Post a Comment