వాదనలుకాదు, వాస్తవాన్ని కనుగొనే ప్రయత్నంచేద్దాం
>> Thursday, June 19, 2008
నేను పరమాత్మ గుణగానాన్ని చేసినందుకుదానిపై తమ అభిప్రాయాలు పంపుతున్న భగవద్బంధువులందరికీ,ప్రణామములు. ముందుగా మీకొకవిన్నపము. నేనన్నమాటలు వ్యతిరేకించినా,సమర్ధించినా వారందరూ నాకు బంధువులే . ఎదుటాఎవ్వరులేరు అంతావిష్ణుమయమే,వదలక హరిదాస వర్గమైనవారికీ...... అని చెప్పిన అన్నమయ్య పాట నాబాట. సృష్టిలోని ప్రతిజీవిలో అంతర్యామిగా వున్నది ఆపరమాత్మే . కనుక మీరంతా హరిస్వరూపులే. నేను హరిసేవకుడను . మరినీకీరాతలు,కోతలు ఎందుకంటారేమో..... చీపురు స్వయముగా నీఛమయినదప్పటికీ ఇళ్ళు శుభ్రపరచడానికి పనికొస్తున్నదిగదా నేనూ అంతే. నేనురాసినా కూసినా అవన్నీ మనపెద్దలుచెప్పినమాటలుచూపినబాటలేతప్ప. స్వయముగా నేసాధించినవికావు. కాకున్ననూ, మనమహర్షులు చెప్పినవి సత్యములు . దానిలో రవ్వంతకూడా అనుమానములేదు. నన్ను వెటకారముగా మహానుభావా అని సంబోధించినవారికి నావిన్నపము. కలలోకూడా ఆపదమునకు గల అర్ధమునకు నేను నన్ను సమానముగా భావించలేను.
ఇక చర్చలో ప్రధానముగా తమ అభిప్రాయాలను తెలియజేసి ఇంతమంచి సన్నివేశానికి కారకులైన indianminerva అరుణకుమార్ గారికి ప్రత్యేకముగా నా నమస్సులు. వృత్తిరీత్యా వుపాద్యాయుడనవటము వలన అలవాటుచొప్పున పిల్లలకు చెప్పిన రీతిలో నావివరణలు కఠినముగాసాగి మిమ్మల్ని బాధపెట్టివుంటే క్షమించండి. ముందుముందు అలా జరగకుండా చూసుకుంటాను ఒక విషయముమీద మన అభిప్రాయాన్ని తెలియజేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకునిగాని తెలుసుకోవాలన్న కాంక్షతోగాఅనీ వుంటే అది అర్ధవంతమయిన చర్చకు దారితీస్తుంది కాక తనకు తెలిసిన అరకొర పరిజ్ణానముతో ఏకొలతయినానాచేతివేళ్ళతోకొలవగలిగితే సత్యము లేదంటే అది అసత్యమనే పిల్లవాని మొండివాదనవుతుందిగానీ మరొకటికాదు.మీవాదంప్రకారంభగవంతుని నమ్మడమనేది సోమరులపని. సోదరా! సోమరులెన్నడు భగవంతుని నమ్మలేరు .ఆయన ను తలచలేరు. ఎందుకంటే భగవన్మార్గము అత్యంత కఠినతరమయినది సోమరి దాని ని సృజించనుకూడాలేడు. సోమరులకెన్నడు భగవద్ కృప లభించదు. భ్రాంతికి లోనయి యుధ్ధానికి విముఖుడయిన అర్జునునకు తన విధిని నిర్వర్తించని వానికి అధోగతి తప్పదని హెచ్చరించి యుధ్ధాన్ని నడిపించి ధర్మాన్ని నిలపటానికి మనిసషి ఏమిచేయాలో పరమాత్మ స్వయముగా చూపారు. ఆధ్యాత్మిక మార్గములో మీరుచూడగలిగిన పూజలు వ్రతాలు వంటివాటిలో జరిగేది,తద్వారా భక్తులు అర్ధము చేసుకునేది ఏమిటో తెలుసా? నిరంతరము శ్రమించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించి నప్పుడు భగవంతుని అనుగ్రహము పొందుతామనే. తమ వెనుకున్న మహాశక్తి తమను కాపాడుతున్నదిగనుక మరింత వుత్సాహముతో పనిచేసి ఫలితము అనుకూలముగావచినా ప్రతికూలముగావచ్చినా అది పరమాత్మ లీలగా గ్రహించి స్థిత ప్రజ్ణ్తను పొందుతారు.
ఇక దైవభక్తులు ప్రయత్నశీలురుకారని మీరు అనుకోవటమేగానీ అది వాస్తవంకాదు. ఎందుకంటే భగవంతుడు ప్రయత్నాశీలురకు మాత్రమే కరుణించడము జరుగుతుందని వారికి సంపూర్ణవిశ్వాసము వుంటుంది. అంతేకాదు తమకు లభించే ఫలితాలన్నీ భగవంతుని కరుణవలననేననే ఎరుకకలిగి వుంటారు. తద్వారా తాము సాధించామనే అహంకారాన్ని దగ్గరవకుండా చూసుకుంటారు. మీరుచూసినవారిలో అటువంటి వారులేకుంటే వారింకా ఈమార్గములో ప్రాధమికదశలో నున్నవారు గా గుర్తించండి. ఆవిశ్వాసం బలపడినతరువాత హృదయం లో ప్రకృతిలో సర్వశ్వం పరమాత్మ విభూతిగా గ్రహించి దీనిపట్ల సత్యమయిన ప్రేమభావాన్ని పెంచుకుంటాడు. అటువంటి ప్రేమపూరిత హృదయుడయిన వ్యక్తి మహోన్నతుడవుతాడు. దీనికి ఒక జన్మ పట్టవచ్చు లేదా మరిన్ని జన్మలు పట్టవచ్చు. మానవులను ఈస్తాయిలో దైవత్వ భావనలు కలవారిగా వుండాలనే పరమాత్మ సంకల్పం. ఆయన భావాన్నందుకున్న మహానుభావులే సాయి, రాఘవేంద్రులు, వీరబ్రహ్మేంద్రులు, క్రీస్తు మహమ్మదులవారు లాంటి అవధూతలు. వారిది విశ్వప్రేమ, మనలాంటి స్వార్ధప్రేమకాదు. తుప్పుపట్టిన ఇనుపతీగనయినా కరెంట్ తీగకు తగిలిస్తే అది కరెంట్ను ఎలా ప్రవహింపజేయగలిగి శక్తివంతముగా మారుతుందో పరమాత్మకు అనుసంధించబడిన మానవ శరీరము లోనున్న దివ్యాత్మలు ఆయన శక్తినితాము ప్రవహింప జేయగలుగుతాయి. వారిద్వారా లోక కళ్యాణము జరుగుతుంది. కా నీ మనలా తెలిసినది గోరంతయినా కొండంత అహంకారముతో మాట్లాడరు. తాము భగవంతుని సేవకులమనే చెబుతారు. సాయి చెప్పినదదే. ఇక భగవంతుని కోరికలు రడము ఎందుకు ? అని అబ్రకదబ్ర గారు అడిగారు. ఇదేవిషయాన్ని చెప్పి భక్తులను వారించబోయినవారితో సాయి ఇలా అన్నాడు. ముందు వాళ్ళలానే వస్తారు రానీ తరువాత శ్రధ్ధాశక్తులయి సత్యాన్వేషకుల యి ఆత్మోధ్ధారణచేసు కుంటారు. ఇది బడికి వెళ్ళనని మారాంచేసే పిల్లవానిని తల్లి బెల్లం ముక్క పెట్టి బడికి పంపడములో గల వుద్దేశ్యం వంటిదేనని చెప్పారు.
ఇకమతం అంటే ఏమిటో తెలుసా? మతం అంటే ఒక వ్యక్తి అభిప్రాయం. వాడిమతంవేరురా చెప్పినా వినడు అంటుంటాముకదా! అలాగ.
ఈ పుణ్యభూమిలో వున్నది మతంకాదు. ధర్మం సత్యం . ఇవి ఒకరి అభిప్రాయాన్ననుసరించి వుండవు . ఎఅవరు మార్చాలన్నా మారవు. సూర్యుడు తూర్పునేవుదయిస్తాడు, అన్నది సత్యం దానికి ఎన్నివాదాలు చేసినా మార్పుజరగదు. అటువంటి సత్య ప్రమాణాన్ని కనుగొనమనే వేదం నేతి నేతి అనే వాక్యంతో, ఇదికాదు, ఇదికాదు అని చిట్టచివరికి సత్యాన్ని చేరినదాకా అన్వేషించమని ప్రభోధిస్తున్నది . కనుకనే సత్యదర్శ్నముకోసం ఇక్కడ రక్తపాతాలు జరగలేదు. ఈ విజ్ణానాన్ని తెలియని ప్రపంచములో మరొకచోట మహాత్ములు చెప్పిన సత్యాలను రాజ్యాధికార సిధ్ధాంతాలుగా మలచుకుని వారిభావాలను మరచి స్వార్ధపరులైన వారు సాగించిన క్రూసేడులు,జీహాదులు రక్తపాతాలను రాజకీయాలను సాగిస్తున్నాయి. దానికి ఆమహానుభావులు చెప్పిన సత్యాలే కారణమంటే ఎలా? పరమగురువులు చూపినబాటలో నడచి సత్య ధర్మ త్యాగగుణాలతో అప్పటిలో ఈదేశాన్ని దర్సించిన వారిచేత ఈ దేశములో ముప్పై మూడుకోట్లమంది దేవతలున్నారు అని పొగిడించుకున్నజాతి మనది . దేవతాత్మకమయిన బుధ్ధి గుణాలచేత వారా స్తాయిని పొండగలిగారు. ఆవిద్యను మరచి స్వార్ధపరతపెంచుకుని నేదు అనుభవిస్తున్న అశాంతికి కారణం భగవంతుడనే భావన వుండటమంటే ఎలా ?
శాస్త్రము శాస్త్రమని వాదిస్తున్నమీరు. మనమహర్శులు తమ జీవితాలను త్యాగముచేసి భావితరలకు అందించిన సత్యమయిన విషయాలను శాస్త్ర ప్రమాణముగా అంగీకరించలేకపోవటం మన దృష్టి లోపముచేత చూడలేక అక్కడేమీ లేదనే గుడ్డివాదన చేస్తే ఎలా?
మీవాదనలలో
లోకములో జరుగుతున్న అశాంతిపట్ల తీవ్రమయిన ఆవేదన వీటినిమార్చాలన్నతపన కనపడుతున్నాయి. కాకుంటే మన దైన మార్గము మీరుతెలుసుకోకుండా చేసిన విద్యావిధానము వలన మీకు కమ్యూనికేషన్ గ్యాప్ యేర్పడిందంతే. పోనీ మేము చెప్పినదే తప్పుడువాదన అనుకుంటే .అది సప్రమాణముగా నిరూపించడానికయినా మీరుదయచేసి ఆచార్య భరద్వాజ గారిరచనలు ఒక్కసారి చదవండి . విమర్శకోసంకాదు విశ్లేషించే ఆలోచనతో. 1విజ్ణాన వీచికలు 2మతమెందుకు 3ఏదినిజం 4మహాత్ములముద్దుబిడ్డడు. ఇవి మీ ఒంగోలులో లాయర్ స్ట్రీఈట్లో గల సాయి మందిరమువద్దగానీ లేక సమీపములోని సాధకులవద్ద దొరుకుతాయి. దయచేసి ఒక్కసరి చదవండి ఇంతమాత్రం చేతనే మీకుగాని మీవాదనకు వచ్చేప్రమాదముగానీ ఏదీలేదు. ఈఅభ్యర్ధనను మన్నిస్తారని ఆశిస్తూ వాదనలతో సత్యాన్ని చేకొనలేము అది అన్వేషన వలననే జరుగుతుందనే మహాత్ముల మాటలను స్మరించుకుంటూ సదా మీరుమహోన్నతవ్యక్తులుగా వెలగాలని కోరుకుంటూ.....మీ స్నేహభావం కొనసాగాలని ...ముగిస్తున్నాను. హరి:ఓమ్
10 వ్యాఖ్యలు:
చాలా బాగా వ్రాశారు.తాము మేధావులమనుకుంటూ చదువుకున్నవాళ్ళమనే అహంకారంతో దేవుని ఉనికిని,దేవుని నమ్మినవారిని సోమరులంటూ వ్యాఖ్యానించిన వారికి కనువిప్పుకలిగించే విధంగా వుంది.
భగవంతుడిని సోమరులే నమ్ముతారని అంటారని భగవంతుడు ఊహించాడు.అందుకే భగవద్గీతలో,నాకు కర్మలు చేయాల్సిన అవసరంలేకున్నా నేను కర్మలు చేస్తున్నాను.ఎందుకంటే ఇతరులకు మార్గ నిర్దేశకంగా నిలవాలని అంతాడు.అలాగే,ఉత్తములు తమ ప్రవర్తన ద్వారా ఇతరులకు దారి చూపాలని అంటాడు.అర్ధమయిన వారికి ఇది కర్మయోగం.కాని వారికి సోమరితనం.చేసిన ప్రతి పనిలో లాభాలు లెక్కించటం అలవాటయిన వారికి,నిస్స్వార్ధ కర్మాచరణ,నిర్మోహపుటాలోచనలు సోమరితనంలానే కనిపిస్తాయి.గిన్నెలో నీటిని చూసి సముద్రమంటే నీరేకదా ప్రత్యేకంగా చూడాల్సిందేమీ లేదనేవారిని చూసి జాలి పడాలి.వీలయితే ప్రేమగా వారికి నిజం చెప్పే ప్రయత్నం చేయాలి.
భగవంతుని భావన మరొక జంఝాటము గాక మరేమీ కాదని దాని వినా కూడ సరైన ప్రయత్నముచే ధర్మాన్ని సాదించ వచ్చనేది నా భావన. మతము రక్తపాతాలకు ప్రత్యక్షముగాకాక పోయినా బొధనలలోని సందిగ్ధత వల్ల కొండకచో సంక్లిష్టతల వల్ల పరోక్షముగనైనను కారణము గనుక దీన్ని సరిచేయడానికి కృషిచేసి సమయాన్ని వృధాచేయడం కంటే (ఇది అసాధ్యం కూడా) తక్షణంత్యజించాలి. ఇప్పటికీ మనవిలువైన సమయాన్ని హరించే సమస్యలన్నీ (సేతువులుగానివ్వండి, మసీదులుగానివ్వండి, దేశాల సరిహద్దులు గానివ్వండి) దీని చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి తప్ప ఇతరవిధమైన మరింత వుపయోగకరమైన చర్చలతో తడిసిందిలేదు.
ఏది యేమైనా మీ సలహాను మాత్రం తప్పక పాటించగలను. Thanks. మీ మనసు నొప్పించినందుకు క్షమించగలరు.
విమాన ప్రమాదాలు జరుగుతాయని భయపడి విమానాలనే వద్దనుకుంటామా. అలాగే భగవంతుని పేర అజ్ఞానులు సాగించే అకార్యాలను చూచి అసలు భగవంతుని గురించే ఆలోచించవద్దనుకుంటే ఎలా? పోనీ మానవ చరిత్రలో ఇప్పటివరకు మానవత్వాన్ని కాపాడుకొస్తున్నది భగవంతుని మీద నమ్మకమే. అదికాక మరేమార్గమూ కాలపరీక్షలకు తట్టుకోలేనివిషయం వాస్తవం. ఎక్కడో ఏదో సంబంధము లేకుంటే మనభావాల పరస్పర వినిమయం ఈరూపములో జరిగేదికాదు. అందువలన జరిగినది చర్చేకాని తగాదాకాదు. కాకుంటే మనమొకటి గుర్తుంచుకోవాలి విద్య నేనింతనేర్చుకున్నాను అనే గర్వాన్ని నింపితే, వివేకము నేను ఇంతమాత్రమే తెలుసుకోగలిగాను అనే వినయాన్ని నేర్పుతుంది. అందుకే మనరుషులు "విద్యా వినయేనశోభతే " అని బోధించారు. అదిమరువవద్దుమనం.
ఆస్తికులారా,
మిమ్మల్ని 'సోమరులు' అనటాన్ని నేను సమర్ధించను. కానీ మీరు మాత్రం నాస్తికులని 'అజ్ఞానులు', 'అహంకారులు', 'విర్రవీగుతారు', లాంటి మాటలనొచ్చా?
'మానవ చరిత్రలో ఇప్పటివరకు మానవత్వాన్ని కాపాడుకొస్తున్నది భగవంతుని మీద నమ్మకమే' అనే దుర్గేశ్వరగారి అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను. తమకు అర్ధం కాని విషయాలకి మనుషులిచ్చే ఏక వాక్య వివరణ 'దేవుడి మహిమ'. అలా మనకోసం మనం సృష్టించిన వాడే దేవుడు. దేవుడు పుట్టిన తర్వాతే మానవ చరిత్రలో అత్యంత భయానకమైన అధ్యాయాలు ప్రారంభమయ్యాయి. ఆ పేరిట జరిగినంత రక్తపాతం మరేదాని పేరిటా జరగలేదు. దేవుడు లేడన్న వాళ్లందరిదీ ఒకటే మాట. ఉన్నాడన్న వాళ్ల మధ్యనే గొడవలన్నీ - మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్ప అని. ఏది సుఖం?
సరే, ఇవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలు. ఇంతకు ముదు వేరే పోస్ట్ లో నేను చెప్పినట్లు దేవుడిపై నమ్మకం ఎవరికి వారు అనుభవించాల్సింది. ఇతరుల మీద రుద్దకూడదు. దేవుడినీ, మతాన్నీ organize చేయటం వల్లనే అది మాఫియా కన్నా ఘోరమైన వ్యవస్థగా తయారయింది. 'ప్రమాదాలు జరుగుతాయని విమాన ప్రయాణాలను మానుకుంటామా' అన్నారు దుర్గేశ్వర గారు. నిజమే. వందలో ఒకటో రెండో ప్రమాదాలయితే మానుకోం. కానీ వందకి ఎనభై కూలిపోతుంటే తప్పకుండా మానుకుంటాం. ఆస్తికుల్లో దేవుడిని అపార్ధం చేసుకున్నవారే ఎక్కువ. ఏం చేద్దాం మరి?
హితుడా!
మేమునడుస్తున్నది మానవజీవితము పరమాత్మతో మమేకము కావటానికి మహర్షులు వేసిన బాట. మానవ కళ్యానానికి అది సమర్ధవంతముగా మార్గంచూపింది. మీరుచెప్పేది మనుషుల అభిప్రాయాలనే మతముగా మార్చుకొని మారణహోమం సాగించిన పాస్చాత్య సిధ్ధాముల గురించి మీరు సత్య అసత్యమార్గాలను ఒకే గాట కట్టాలని ప్రయత్నిస్తున్నారు. సత్యాన్నాయినా ప్రియంగా చెప్పాలని వేదం సూచిస్తున్నది. కాల ప్రభావము వలన దానికి మానుంచి విరుధ్ధంగా మీకు బాధ కలిగితే క్షమించండి.. ఏ మతముతో ప్రమేయము లేకుండగనే రెండు ప్రపంచయుధ్ధాలు జరిగాయి. అంటే . భగవంతుని భావాన్ని ఆయన వునికిని అందరము వదలి వేసినా రక్తపాతాలు జరుగుతాయి. మనిషిని మనిషి పీడించే రాక్షస భావన కొనసాగుతుందను కుందాము. మరి మానవులు శాంతి స్వరూపులుగా, ప్రేమ పూరిత హృదయులుగా మార్చడానికి మీరు సూచించేమార్గము తెలపండి. మీదగ్గరున్న ప్రణాళికను వివరించి దాని అమలు ఎలా జరుగుతుందో వివరించండి.
తెగని వాదం మళ్ళీ మొదలయ్యింది. దేవుడు వాస్తవమని చెప్పిందెవరూ!!! నాకైతే ఈ వాదనలే వాస్తవం, నిజం, ఎందుకంటే మనకు తెలిసి చేస్తున్నాం కాబట్టి.
ఇక భగవంతుడంటారా...ఆయన్నూ,లేక ఆవిడనీ ఉండనివ్వండి. మనకు పోయేదేముందీ? కానీ మనుషుల్ని విడదీసి,అప్పుడప్పుడూ హత్యలకుపురి గొల్పేవాడయితే నాకైతే అఖ్ఖరలేదు..మీకు కావాలంటే ఉంచుకోండి.
మిత్రమా దుర్గేశ్వరా,
'హితుడా' అంటే నన్ను కర్ణుడితో పోల్చినట్లనిపించింది ;-) ఎన్టీయార్ మహిమ.
మతంతో ప్రమేయం లేకుండానే ప్రపంచ యుద్ధాలు జరిగాయా? చరిత్ర మీకు సరిగా అర్ధం కాలేదనుకుంటాను. అంతకు ముందు దాకా మధ్య ప్రాచ్యంలో బలీయంగా ఉన్న ఇస్లామిక్ రాజ్యాలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏమైపోయాయి? రెండవ ప్రపంచ యుద్ధంలో యూదుల ఊచకోత సంగతేమిటి?
మధ్య యుగాల్లో క్రూసేడుల్లో పారిన రక్తమెంత? మన దేశంలోనే హిందూ-బౌద్ధ మతాల మధ్య ఒకప్పుడు, ఇస్లాం-హిందూ మతాల మధ్య ఆ తర్వాతా అరిగిన మారణహోమాల సంగతేమిటి? తమిళనాడులో శతాబ్దాల క్రితం శైవ-వైష్ణవ వర్గాల గొడవల్లో తెగిన తలలెన్ని? అమెరికన్ల 'యాక్సిస్ ఫోర్సెస్' లిస్టులో టర్కీ, ఇరాన్, ఇరాక్ వంటి ఇస్లామిక దేశాలు, ఉత్తర కొరియా వంటి కమ్యూనిస్టు దేశం మాత్రమే ఉండటమేమిటి? శ్రీలంకలో భాషాభిమానపు ముసుగులో ఎల్టీటీయీ చేస్తున్న బౌద్ధుల హత్యలెన్ని? మిడిల్ ఈస్ట్ లో అరవయ్యేళ్లుగా రగులుతున్న సెగలకి మతం కాక మరేది కారణం? ఐర్లాండ్ లో కేథలిక్ మిలిటెంట్ గ్రూపుల సంగతేమిటి?
'భగవంతుని వదిలేసినా రక్తపాతం కొనసాగుతుంది' అని మీరన్నదాంట్లో నిజముంది. అప్పుడు మరేదో కారణంతో కొట్లాడుకునే తెలివితేటలు మనుషుల సొంతం. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నాకు తెలిసిన సులువైన చిట్కా ప్రతివారూ 'అందరూ బాగుండాలి' అనుకోవటం. ఇంత చిన్న విషయం చెప్పటానికి ఇన్ని రకాల దేవుళ్లు, మతాలు, గ్రంధాలు, వేదాంతాలు అనవసరం అనేది నా అభిప్రాయం. మంచిగా ఉండమని చెప్పటానికి 'పుణ్యం', 'పరలోకంలో సముచిత స్థానం' లాంటి తాయిలాల అవసరమేమిటి?
దుర్గ గారు,వినుకొండ నుండి చాలా పకడ్బందీగా బ్లాగును నిర్వహిస్తున్నందుకు నా అభినందనలు.
మీరు మొన్న ఒకరికి సలహా ఇచ్చారు ఒంగోలు వెళ్ళి లాయర్ స్ట్రీట్ లో ఫలానా పుస్తకాలు కొని చదవమని.దానికంటే ముందు మీరు గతములో చదివిన గురజాడ రచన,దేవుడు చేసిన మనుషుల్లారా!మనుషులు చేసిన దేవుళ్ళారా!మీ పేరేమిటి కధానికను మరొక్కసారి చదివి మీశైలిలో వివరింప ప్రార్ధన.మరలా కలుద్దాం.
raajEmdragaa roo tappanisarigaa prayatnistaanamdii
Post a Comment