శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వర్తమానకాలమందు హనుమదుపాసనావశ్యకత

>> Tuesday, June 17, 2008

నేటిభారత దేశములో అర్ధ కామాలపై ధర్మ శాసనం లేకపోవటం చేత అమర్యావియై ఏషణులు పల్లవించి పుష్పించి ఫలిస్తున్నాయి.బాల,వృధ్ధ.స్త్రీ'పురుష బేధ రహితముగా కామాచార,అభక్ష భక్షణాదిగాగల ప్రవృత్తులలో చిక్కుకుని విమోహితులై,వ్యక్తి, -సామాజిక,-రాష్ట్ర,దేశాది విషయములందు బ్రష్టులగుచున్నారు. ఒకవేళ ఎచ్చటైనా న్యూనాధిక రూపమునందు ధార్మికత్వముగాని,ఆధ్యాత్మిక చింతనగాని వుంటే అక్కడకూడా వాటి ఆవరణలో దంభ పాషండాది దుష్టవృత్తులు పనిచేయుచున్నవి. ఈవిషయ విమోహక దుస్థితిలో హనుమదుపాసన పరమావస్యకమైయున్నది. అతని చరిత్రవలన మనకుబ్రహ్మచర్య వ్రతపాలన , శీలసం రక్షణ బలబుధ్ధులవికాశము. శ్రీరామునియందు అభిమానరహితమైన దాస్యభావము మున్నగు మహత్తర గుణోపదేశములులభిం చును. దేవో భూత్వా దేవం య జేత్"అనునది వుపాసనా ముఖ్య సిధ్ధాంతము. వుప=సమీపము, ఆసన=వుండుట[సమీపమందుండుట]అని అర్ధము. ఏ వుపాసనద్వా రా ఇష్టదేవతయందలి గుణరూపశక్తులందు సామీప్యసంబంధం ఏర్పడుతుందో,సాకారత్వమేర్పడుతుందో, అదియే వుపాసనా తాత్పర్యోధ్ధేస్యమై యున్నది. నేటి విషమపరిస్థితులలో మానవమాత్రులకు, విశేషించి బాలురకు, యువకులకు హనుమదుపాసన అత్యంతావస్యకమైయున్నది. బుధ్ధి వీర ,బలాదులను ప్రసాదించి హనుమంతుడు తన భక్తులను సం రక్షిస్తుంటాడు.. భూత, ప్రేత పిసాచాదులు ఆ మహావీరుని నామోచ్చరణ మాత్రము చేతనే పారిపోతాయి. స్మరణ మాత్రముచేతనే అనేకరోగాలు శాంతిస్తాయి. మాసిక దౌర్భల్య సంఘర్షణలలో ఆ స్వామిసహకారం లభిస్తుంది. ఆయన సహకారము వలననే శ్రీ తులసీదాసు స్రీరామ దర్శనమును పొందగలిగాడు.నేడుకూడా చాలామందికి భక్తులకు ఆ మహనీయుని అనుగ్రహం లభిస్తూనేవుంది. కావున హనుమత్ కృప సంపాదించుటకు శాస్త్ర ప్రతిపాదిత వుపాసనా పధ్ధతులు గలవు. వాటిననుసరించి వుపాసనలో సమ్లగ్నులు కాగలిగిననాడు,అనేక సిధ్ధులు లభిస్తాయి. దేశ ఔన్నత్యానికి అనేక కార్య క్రమములు కొనసాగుతున్నాయి. కానీ ఆధ్యాత్మిక రంగములో జరగవలసినంత కృశిజరగటమ్లేదు. తత్ఫలితముగా భౌతిక సమృధ్ధి మానవునికి వరదానముగాకాక అధిశాపముగానున్నది. ఇట్టిస్థితిలో దేశమునకు కావలసిన ఆదర్శము మనకు హనుమచ్చరిత్ర యందు లభించుచున్నది. భగవత్తత్వవిజ్ఙానమునకు భక్తిసేవలకు ,హనుమంతుడు,వుజ్వలమగు వుదాహరణము. మహోత్తమ భావాలతో భగవదనురక్తి, సేవలకు,వ్యక్తిత్వ పూర్ణవికాశాలకు వుదాహరణలు హనుమచ్చరిత్రయందే లభిస్తాయి. హనుమంతుడు బాలబ్రహ్మచారి. ఆమహనీయుని ధ్యానబ్రహ్మచర్యానుష్టానములవలన నిర్మలాంత:కరణమునందు సమగ్రమగు భక్తి కలుగుతుంది. హనుమచ్చరిత్రలో శక్తిసంచయ,సదుపయోగములు,భగవద్భక్తి, నిరహంకారము మున్నగునవి సంపూర్ణముగాయుండుటవలన,ఆ సద్గుణములన్నీ సాధకులూ,భక్తులూ అయిన యువకులకు,బాలురకు కూడా లభించును.
[శ్రీ బదరీ పీఠాదీశ్వర స్వామివారి అనుగ్రహ భాషణము.]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP