శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భగవంతున్ని నమ్మాలా ?

>> Monday, June 16, 2008

మనలో చాలామంది భగవంతుని నమ్ముతాము .అయితే ఒక్కొక్కసారి, తమద్వారానే లేక తమశక్తి ద్వారానే అంతా జరుగుతుందనే వాదనలను సమర్ధంగా వినిపించేవారివల్ల మనమనసులోని నమ్మకాలలో పట్టుసడలుతుంది. ప్రత్యక్షప్రమాణమును దృశ్యరూపములో చూపించనంత మాత్రమున అవి అబధ్ధాలు అవుతాయా?. వుదాహరణకు మనం నొప్పిని అనుభవిస్తాము. కానీ నొప్పి ఎలావుంటుందో చూపమంటే సాధ్యమవుతుందా.చూపలేనంతమాత్రాన అది అబధ్ధమవుతుందా? ఒకగ్రామములో ఇద్దరు యువకులు చాలామంచి మిత్రులు వుండేవారు. అయితే ఒకరికి భగవంతుని పట్ల ఆయనలీలల పట్ల అపారనమ్మకముకాగా,రెండవవానికి ఏదైనా మానవప్రయత్నము మీదనే జరుగుతాయని బలహీనులు, భగవంతుడనే సాకుతో సోమరితనము,అమాయకత్వముతో కాలము వృధా చేస్తుంటారని నమ్మకము. అయితే ఎవరి అభిప్రాయాలు వారివయినా అవి వారిస్నేహానికి అడ్డురాలేదు. ఇద్దరూ కలసి ఏపనయినా చేస్తుంటారు. ఒఒఒకసారి వాళ్ళిద్దరూ ముఖ్యమయినపనిమీద కాలినడకన ఒకవూరు వెళ్ళవలసివచ్చింది . ఎంతత్వరగానడచినా మిట్టమధ్హ్యాహ్నం వేళకు దారిలోని ప్రసిధ్ధమయిన ఒక ఆలయంవధ్ధకు చేరుకోగలిగారు. అప్పుడు ఈఆస్తికమిత్రుడు,ఒరే, ఎలాగూ వచ్చాము అయిన ఆలస్యము అయింది. ఒక సారి గుడిలోకి వెళ్ళి దర్శనము చేసుకుని వెళదాము అన్నాడు. దాంతో రెండవ వానికి మండుకొచ్చింది . బుధ్ధిలేని వెధవా, అసలేఆలస్యమయి నేనేడూస్తుంటే ఇప్పుడు గుళ్ళూ దర్శనాలంటావేమ్. ఈరాతి బొమ్మలకు మొక్కితేమనపనవుతుందా? అని మండిపడ్డాదు. అయితే ఆస్తికమిత్రుడు, వెంటనే వద్దాము అని బ్రతిమిలాడితే, చివరకు నేను రాను, నువ్వెళ్ళి త్వరగాతగలడు, మీ మూర్ఖత్వం మీదేకాని ... అంటూ అయిస్టంగానే ఒప్పుకున్నాడు. అతను గుడిలోకి వెళ్ళగనే దగ్గరున్న చెట్టు వైపుకు వెళుతున్న ఈ నాస్తిక మిత్రునకు మట్టిలో ఏదో మిలమిలా మెరుస్తున్న రాయి కనపడగా దానిని తీసి పరిశీలించ సాగాడు. అది ఒక విలువయిన వజ్రము. అతని సంతోషానికి అవధులు లేవు, ఎంతో విలువయిన ది దొరికిందని మురిసి పోతున్నాడు. ఇంతలో గుడినుండివస్తున్న ఆస్తికునికి కాలిలో పెద్దముల్లు దిగబడింది. దానిని కాలినుండి పీకి బాధతో కుంటుకుంటూ అతను రాసాగాడు. దగ్గరకొచ్చిన తరువాత నాస్తికమిత్రుడికి నవ్వాగలేదు. ఒరే నీదేవుడు దర్శనం చేసుకున్నందుకు మంచి వరం ఇచ్చినట్లున్నాడూ? . తిక్కవెధవా దేవుడూ లేదు దయ్యమూలేదు. వుండివుంటే ఎంతో భక్తితో గుడికెళ్ళిన నీకు ముల్లెందుకు గుచ్చుకున్నది? నేను దణ్ణం కూడా పెట్టకపోయినా నాకీ విలువయిన రత్నమెలాదొరికింది? ఇప్పుడయినా నమ్ముతావా? నేనుచెప్పింది అని ఎగతాళి చేయసాగాడు. పాపం ఆస్తికుడు ఖిన్నుడయి తలవంచుకున్నాడు.. దగ్గరచెట్టుకింద వున్న ఒకసన్యాసి వీరిద్దరినీ పిలిచి ఏమిటినాయనా మీవాదన అని అడిగాడు. అప్పుడు నాస్తికుడు గర్వంగా జరిగినది చెప్పి, మీలాంటి పొట్టకూటికి కష్టపడలేని వారి మాటలు నమ్మి మావాడుకూడా ఇలాంటి మాఢనమ్మకాలతో దేవుడు,గీవుడు అంటూ సమయం వృధా చేస్తుంటాడు అని`పరిహాసంగా మాట్లాడాడూ. ఆయన చిరునవ్వు నవ్వి నాయనా ఇప్పుడు మీరెళ్ళేవూఱు మీ కంటికి కనపడటం లేదు అయినా అది వున్నదా? లేదా అలాగే భగవంతుడు కూడా. ఆమార్గములో ప్రయణీంచినప్పుడు మాత్రమే ఆయన్ని చూడగలుగుతాము . ఇక ఆయనలీలలు చూడు. నీమిత్రునికి ఈరోజు సర్ప గండము వున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్ళివుంటే అది కాటువేసేది అతని పూర్వజన్మ సుకృతమువలన భగవంతుని దర్శనము చేసుకోవాలనే కోరికకలిగి పాటించినందున ఆకర్మఫలితం ఇలా చిన్ననొప్పిగా మార్చబడి నుభవించటము జరిగింది. అదేనీ విషయమునకొస్తే ఈరోజు నీకు మహానిధి దొరకవలసిన అదృష్టము వున్నప్పటికీ దైవదూషణ వలన అది కేవలము ఒక చిన్నరాయిగా మార్చబడి నీకు లభించింది అని వివరించి తన హస్తాన్ని వారి తలలపయి వుంచి వారికి ఆసత్యాన్ని దర్శింపజేశాడు.

2 వ్యాఖ్యలు:

Indian Minerva June 16, 2008 at 11:49 PM  

ఒక పదార్ధం ఉనికికి నిదర్శనం చూడ గలగడం మాత్రమే కాదు. కనీసం అస్తిత్వాన్ని యెరుగగలగడం లేక యెరుక పరచగలగడం. ఈ రకంగా చూస్తే దేవుడనేది ఒక భావన మాత్రమే దానినియెవరూ యెరుగ జాలరు. కాక పోతే మనల్ను మనం యెరిగిన వారలుగా మోసపుచ్చుకోగలం. దేవుడు అనేభావన కష్టపడకుండా ఆదాయాన్ని సంపాదించాలనే కొందరు సోమరిపోతుల మానస పుత్రిక. వాళ్ళకు(ఆ వర్గస్తులకు) తప్ప "దేవుడు" ఇంకెవరికీ ఉపయోగ పడడు ఉపయోగ పడలేదు. మన ఖర్మ కొద్దీ మనమీద రుద్దబడిన ఆ కాలపు భావాలతో మన ఇల్లు గుల్ల చేసుకొంటున్నాం. మానవ సేవే మాధవ సేవ ఐనప్పుడు మళ్ళా మాధవ సేవెందుకో?

durgeswara June 18, 2008 at 5:23 AM  

arunakumaar gaaroo! mii coment ku vivaraNa gaa kottapOsT vraasaanu chadavamDi

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP