శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కోదండ రామ్ పై కేసు....ఢిల్లీ హైకోర్ట్ తీర్పు .. ఆలోచించాల్సిన సమయం

>> Thursday, November 15, 2012

సమాజంలో అసమానతలు కులాలాఅధిపత్యాలతో బాధపడుతూ ఉన్న వారికోసం వారి ఆత్మగౌరవం  కాపాడబడటం కోసం వచ్చిన ఎస్సీ,ఎస్టీఅట్రాసిటీ చట్టం అమలులో కొచ్చేసరికి నాలుగొంతులలో ఒక్కవంతు సద్వినియోగమైతే మూడొంతులు దుర్వినియోగపరచబడుతుంది అని  ఆరోపణలు వస్తున్నాయి. అందుకు ఉదాహరణగానే   మనకు రాజకీయనాయకులమధ్య నడిచే పోరాటాలలోకూడా ఈకేసులు దర్శనమిస్తున్నాయి. రాజకీయనాయకులెవరూ బలహీనులుకారు. బలహీనులను కాపాడవలసిన చట్టం రాజకీయనాయకులనుబలపరచటం కోసం ఉపయోగపడటం విచారకరమే ! అందుకు ఉదాహరణగా కోదండరామ్ పైకేసు ఉదతంకూడా ఒకటి.

ఈచట్టం అసలుబాధితులకు అండగాఉండాలేగాని అమాయకులను బాధపెట్టటానికి కాదు అని ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన ఈతీర్పు ఆలోచింపజేసేదిగా ఉంది .
ఆయావర్గాలకుచెందిన మేధావులంతా ఆలొచించవలసిన సమయం ఇది.


బహిరంగంగా జరిగితేనే కేసు
అలాగైతేనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చెల్లుబాటు
తప్పుడు ఫిర్యాదు చేస్తే శిక్షార్హులే..
ఢిల్లీ కోర్టు సంచలనాత్మక తీర్పు

న్యూఢిల్లీ, నవబంర్ 15: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టంపై సంచలనాత్మక తీర్పు వెలువడింది. ఇకపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేయాలంటే సంబంధిత సంఘటన పూర్తిగా జనసమ్మర్థమైన బహిరంగ ప్రదేశాలలో మాత్రమే జరిగి ఉండాలని ఢిల్లీ కోర్టు ఒకటి స్పష్టం చేసింది. ఈ మేరకు అడిషనల్ సెషన్స్ జడ్జి రజనీష్ భట్నాగర్ సంచలనాత్మక ఆదేశాలిచ్చారు. అలా కాకుండా తప్పుడు ఫిర్యాదులతో కేసులు నమోదుకు యత్నిస్తే వారిపై ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవచ్చంటూ ఆదేశాలిచ్చారు.

ఈ మేరకు ఒక కేసులో ఆభియోగాలు ఎదుర్కొన్న భార్య, భర్త, కుమారుడికి విముక్తి కల్పించారు. 2011 నవంబర్ 25న సింధు గ్రామంలో జరిగిన ఒక సంఘటనలో ఈ ముగ్గురిపై కేసు నమోదైంది. తన ఇంటిపైకి వచ్చిన తండ్రి, కొడుకులిద్దరూ తనపై దాడికి దిగారని, ఆ తర్వాత ఒక మహిళ కూడా వారితో కలిసి తనను కులం పేరుతో దూషించిందని ఒక వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి రజనీష్ పై సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు. నిందితులపై మోపిన అభియోగాలు బహిరంగ ప్రదేశంలో జరిగినవి కానందున వాటిని కొట్టి వేస్తున్నట్లు ప్రకటించారు.

ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద సరైన ఆధారాలు లేకుండా కేసులు పెట్టరాదని చెప్పారు. జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలలో దూషణలకు పాల్పడిన సంఘటనలు జరిగినప్పుడే దానిపై ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలా కాకుండా తప్పుడు ఆరోపణలతో కేసులు మోపే వారిపై ఐపీసీ సెక్షన్ 323(ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేయడం), సెక్షన్ 341(చట్టవిరుద్ధంగా అడ్డుకోవడం) కింద చర్యలు తీసుకోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP