శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జ్ఞానవాపి

>> Sunday, February 4, 2024

జ్ఞానవాపి సముదాయము-కంచే తొలిగిన విధానం!
వారణాశి లో జ్ఞానవాపి సముదాయం లో ఉన్న నేల మాళిగ లో ఉన్న శ్రింగార గౌరీ ఆరాధన స్థలంలో పూజలు నిర్వహించు కోవచ్చని వారణాశి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తరువాత జరిగిన పరిణామాలను చూస్తే అధికారులు తలుచుకుంటే ఎంత వేగంగా పనులు అవుతాయో అర్థం అవుతుంది!
******************
31-01-2024 మధ్యాహ్నం 3 గంటలకి వారణాశి జిల్లా కోర్టు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు జ్ఞానవాపి సముదాయంలో ఉన్న మసీదు నేల మాళిగ లోఉన్న దేవతా మూర్తుల పూజ చేసుకోవచ్చని.
సాయంత్రం 6 గంటలకి వారణాశి జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశం కోసం అధికారులని తన కార్యాలయానికి రమ్మని ఆదేశాలు ఇచ్చారు.
వారణాశి జిల్లా కోర్టు తీర్పు ను అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో సమీక్షించారు జిల్లా కలెక్టర్.
రాత్రి 8గంటలకు వారణాశి జిల్లా SP తన కింది అధికారులతో సహా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. వచ్చే ముందు అదనపు పోలీసు బలగాలని తన కార్యాలయానికి రమ్మని ఆదేశాలు ఇచ్చారు SP.
రాత్రి 9గంటలకి జిల్లా కలెక్టర్ కోర్టు తీర్పు ను అమలు చేయడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో జిల్లా ఎస్పీ తో చర్చించి భద్రతా దళాలును సిద్ధంగా ఉండమనీ ఆదేశాలు ఇచ్చారు.
రాత్రి 10 గంటలకి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా SP లు కలిసి జ్ఞానవాపి సముదాయ ప్రదేశానికి వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించారు.
రాత్రి 11 గంటలకి వారణాశి జిల్లా కలెక్టర్ పూజలు ప్రారంభించడానికి పూజారిని సిద్దంగా ఉండమని కబురు పంపారు.
రాత్రి 11.30 లకి ఇనుప కంచెను (ఐరన్ బారికెడ్స్) ను మునిసిపల్ కార్మికులు తొలగించారు!
ఈ ఐరన్ బారికేడ్స్ ను 1993 లో అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ముల్లా సింగ్ యాదవ్ ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా నిర్మించాడు ముస్లిం ఓటర్ల సంతృప్తి కోసం.
అర్ధ రాత్రి 12 గంటలకి ‘ వ్యాస్ కీ తేహాఖాన ‘ ను తెరిచి పూజ కోసం అక్కడ ఉన్న 10 దేవతా మూర్తుల సంప్రోక్షణ మొదలు పెట్టారు.
తెల్లవారుఝామున బ్రహ్మ ముహూర్తంలో పూజలు మొదలయ్యాయి.
మరోవైపు సనాతనులు జ్ఞానవాపీ సముదాయానికి దారిని సూచించే బోర్డుల మీద జ్ఞానవాపి మసీదు మీద మందిర్ అని స్టిక్కర్లు అంటించేశారు.
*******************************
జ్ఞానవాపి లో పూజలు మొదలయ్యాయి అని తెలుసుకున్న ముస్లింలు అర్ధ రాత్రి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ను అర్ధరాత్రి నిద్ర లేపి జ్ఞానవపి లో పూజలు మొదలు పెట్టారు అని అర్జెంట్ హియరింగ్ కింద తమ పిటిషన్ ను లిస్ట్ లో పెట్టమని అడిగారు అంటే ఫిబ్రవరి 1న సుప్రీం కోర్టు మొదలవగానే తమ పిటిషన్ ను విచారణకు తీసుకోవాలని కోరారు.
కానీ సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ మీరు ఉత్తర ప్రదేశ్ హై కోర్టు లో తేల్చుకోండి అని సలహా ఇచ్చారు.
దాంతో చేసేది లేక ఫిబ్రవరి 1న హై కోర్టు లో పిటిషన్ వేశారు కానీ హై కోర్టు Not maintainable అని కేసు కొట్టేసింది.
ఇదంతా జనవరి 31 మధ్యాహ్నం నుంచి ఫిబ్రవరి 1 మధ్యాహ్నం వరకు అంటే 24 గంటలలో జరిగింది.
***************************
ఒకసారి 2022 లోకి వెళ్లి ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుందాం!
2022 లో వారణాశి జిల్లా న్యాయమూర్తి జ్ఞానవాపి సముదాయంలో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఆ న్యాయమూర్తి కి బెదిరింపులు వచ్చాయి ‘ సర్ తన్ సే జుడ ‘ అంటూ.
యోగీజీ సదరు న్యాయమూర్తికి పోలీసు రక్షణ ఇచ్చారు.
అదే న్యాయమూర్తి జనవరి 31 న పూజలు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చి అదే రోజున పదవీ విరమణ చేశారు.
***********************
ఇంతకీ జ్ఞానవాపి సముదాయం మీద నడుస్తున్న కేసు విషయంలో అయోధ్య రామాలయం లో లాగా టైటిల్ సూట్ ఏమీ లేదు అంటే ఆ స్థలం మాదే అని అనట్లేదు ముస్లిమ్ లు.
విచారణ జరుగున్నది కేవలం మందిరం మీద మసీదు ఎందుకు కట్టారు అక్రమంగా దురాక్రమణదారులు అనే విషయం మీద!
ఇన్ని సాక్ష్యాలు ఎదురుగా కనపడుతున్నా మనం న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం చూడండి అదీ మన దౌర్భాగ్యం!
కాంగ్రెస్ నానాటికీ ఎందుకు బలహీనపడుతున్నదో విమర్శ చేసుకుంటే మంచిది.
కాంగ్రెస్ పాలనలో అయోధ్య, కాశీ,మధుర వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నించలేదు.
**************************
మధుర శ్రీ కృష్ణ మందిరం ఎలా ధ్వంసం చేశారో తెలుసుకుంటే కడుపు మండుతుంది.
జై శ్రీకృష్ణ!
జైహింద్!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP