పిల్లలకు అన్నం పెడుతున్నామా*❓ *విషం పెడుతున్నామా*❓
>> Tuesday, April 6, 2021
*తల్లి తన పిల్లలకు చనుపాలు ఇస్తుందా*❓ *విషాన్ని రంగరించి ఇస్తుందా*❓
*ఈ పాపం ఎవరిది*❓
భారీఎత్తున రసాయనాలను వివిధ రకాలైన పంటల కోసం పంట పొలాల్లో వినియాగించడం వల్ల భూములు ఆహార పదార్థాలను విషతుల్యం అవుతున్నాయనడానికి ఈ క్రింది వివిధ కంపెనీల రసాయన ఎరువుల అమ్మకాల లెక్కలే చెబుతున్నాయి 👇IFFCO ,IPL, NFL, CFCL, KRIBHCO, ZUARI, FACT వంటి బడా ఫెర్టిలైజర్ కంపెనీలతో పాటు మరో 25 కంపెనీలు 2020 -2021 ఆర్దిక సంవత్సరం లో *మూడుకోట్ల యాబై ఇరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ను అమ్మారు.అలాగే కోటి మెట్రిక్ టన్నుల DAP అమ్మారు*.అలాగే *కోటీ ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను అమ్మారు. రసాయన ఎరువుల మొత్తం ఆరుకోట్ల మెట్రిక్ టన్నుల పైగా అమ్మకాలు జరిగాయి.ఇవి రసాయనిక ఎరువులు మాత్రమే. ఇవి కాకుండా పురుగు నివారణకు క్రిమిసంహారకాలు విషతుల్యమైన పురుగు మందులు పంటలపై స్ప్రే చేయడానికి వినియాగించేవి.అంటే రైతులచేత ఇంతటి విషాన్ని భూమిలో కలిపించి ఆభూమి లోప పండే పంటలు మొక్కల ద్వారా నేరుగా ఆ విషం ఆ పంట పొలాల్లో పండే పంటల ఆహార ఉత్పత్తులలో చేరిపోతుంది.స్ప్రే చేసే క్రిమిసంహారక మందులు నేరుగా ఆహార ఉత్పత్తులు అయిన ధాన్యం, పప్పులు,కూరగాయలు వీటిలో చేరి ఎన్నోరకాల అనారోగ్యాలను కలిగిస్తుంది. ఉదాహరణకు *షుగర్ , భీపీ , క్యాన్సర్, సంతానలేమి, వ్యాధినిరోధక శక్తి లోపం, దృష్టి లోపం, ఇలా ఎన్నో రకాలైన జబ్బులకు కారణమవుతుంది. మానవాళి మనుగడకు సవాలు విసురుతున్న రసాయనాలను ఉపయాగించి పండించే పంటలకు ప్రత్యామ్నాయ మార్గం*
*మన పూర్వికులు ఆచరించిన సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలను* ఆచరించి పండించే ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం - వినియోగదారులు ప్రోత్సహించాలి.
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోన్ని పంట పొలాల్లో మోతాదుకు మించిన రసాయనాల వినియాగం నిషిద్ధం.
*అందుకే మన దేశంలో పండిన ఆహార ఉత్పత్తులు అమెరికా వంటి దేశాలు దిగుమతి చేసుకోవడంలేదు*.
*మనదేశంలో ఆహార పంటలపై విచ్చలవిడిగా రసాయనాలను వినియోగించడం వల్ల రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాలు కోల్పోతున్నారు*
ఇలా విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియాగిండం వల్ల కొంతకాలానికి భూమి సత్తువ కోల్పోయి బీడుభూములు గా మారి ఎడారులుగా మారిపోతాయి.పంటపొలాలకు వేసిన ఈ రసాయన ఎరువులు భూమిలో ఇంకి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఎప్పటినుండో సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం చెవికెక్కడంలేదు.వర్షాకాలంలో పంట పొలాల్లో నుండి రసాయనాలు కాలువల్లో చేరి నీటి కాలుష్యానికి కారణం అవుతుంది..
పురుగు మందులైన క్రిమిసంహారక రసాయనిక మందులు విచ్చలవిడి వినియాగం వల్ల *గాలి కాలుష్యం* ఊపిరి తిత్తుల వ్యాదులకు కారణమవుతుంది.
నరాల బలహీనత ,బుద్ధి మాంద్యం వంటి వాటికి కారణమవడం తో పాటు నేరుగా ఆహార ఉత్పత్తులపై పేరుకుపోయి వుంటుంది.
అలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల తల్లి పాలల్లో సైతం ఆ రసాయన అవసేషాలు గుర్తించేటం జరిగింది. అంటే
*నేడు పిల్లలు పుట్టుకతోనే తల్లిపాలద్వారా విషం శిశువుల శరీరం లోకి చేరుతుంది*.
*ఇది చాలదా మానవాళి అంతరించిపోవడానికి ఇంకా ఎంతో సమయం లేదని అర్థం చేసుకోవడానికి*
*పిల్లలకు అన్నం పెడుతున్నామా*❓
*విషం పెడుతున్నామా*❓
*పొల్యూషన్ ఫైటర్* *కమలాకరరావ్* 9848178232
0 వ్యాఖ్యలు:
Post a Comment