శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మలోకాల ఆకలితీర్చే అన్నపూర్ణ కదా ! అందుకే ఎండనుకూడా చల్లగా మార్చినది బిక్షాశాలకు స్లాబ్ వేస్తుంటే .

>> Wednesday, May 21, 2014

 అనేక ఆటంకాలను దాటాక ఈరోజు అమ్మ అన్నపూర్ణపేరున నిర్మితమవుతున్న భిక్షాశాలకు స్లాబ్ వేయటం జరుగుతున్నది.  తీవ్రంగా కాస్తున్న ఎండల దెబ్బకు కూలీలుకూడా భయపడుతున్నారు. చిత్రంగా ఈరోజు  ఆకాశం లో మబ్బులు ఆవరించి ఎండ తీవ్రత తగ్గిపోయింది . ఇప్పుడు మధ్యాహ్నం ఒంటిగంట అవుతుంది రోజూ ఈసమయానికి పశువులు పక్షులుకూడా నీడకు వెళ్ళిపోయి  ఈప్రాంతమంతా నిర్మానుష్యం గా మారుతుంది. లోకాల ఆకలి తీర్చే అమ్మకదా అన్నపూర్ణ.ఆతల్లిపేరున జరుగుతున్న నిర్మాణంలో పాల్గొంటున్న కూలీలు తనబిడ్దలేకనుక వారికి ఎండతగలకుండా చేయటంతో వారంతా ఉత్సాహంగా పని చేస్తున్నారు . వారివెంట చిన్నపిల్లలుకూడా వచ్చారు. వారంతా ఆతలాడుతూ మధ్యమధ్యలో మాకళ్లుకప్పి మామిడికాయలు కోస్తూ గంతులేస్తున్నారు.
జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP