శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆనందం తో మనసుయ్యాలలూపిన ఆంజనేయుని అనుగ్రహం హనుమత్ రక్షాయాగం [చిత్రమాలిక]

>> Sunday, May 25, 2014

నవగ్రహ మండపంలో కలశ స్థాపన
 హనుమత్ రక్షాయాగం హోమవిధి ఆనందంగా అగ్నిభట్టారకులవారు

 త్రినాథశర్మ గారి మంత్రోచ్ఛరణతో మార్మోగుతున్న యజ్ఞశాల

 పూర్ణాహుతి
 భక్తజనులచే స్వామి వారికి అవబృథస్నానం


 ఉభయదేవేరులతోశ్రీవారికి      , అమ్మ దుర్గమ్మతో శివయ్యతండ్రికి కళ్యాణోత్సవం

 అన్నపూర్ణమ్మ ప్రసాదం

 పిడికిట తలంబ్రాలపెళ్ళికూతురు

 జగతఃపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

 మల్లెలవానలో నూతన[సనాతన]దంపతులు

  పెళ్ళిలో  అల్లరి  మైథిలి        [మనోహర్ కూతురు]హనుమత్ రక్షాయాగం
-----------------------
మనసుపులకిస్తుండగా  హనుమంతుని అండదండమెండుగా ఉండగా సాగిన హనుమత్ రక్షాయాగం  ఆరవ ఆవృతి ఇది. ఎలా సాగుతుందా ఈయాగం అని   ఆలోచిస్తుండగా స్వామి ప్రేరణతో  మాస్టారూ! మేమున్నాం మీవెంట మీరింకేమీ ఆలోచించక యాగం నిర్వహించండి అంటూ
ముందుకొచ్చిన   శ్రీ నూకల శ్రీనివాస్ గారు,పెండ్యాలసూర్యనారాయణ,చెనికల మనోహర్,చింతలపాటి శ్రీక్రిష్ణ,సునీల్ వైద్యభూషణ్ లు భారాన్నంతా తమ భుజాలపై వేసుకున్నారు.
తీవ్రమైన ఎండలు , ఇక్కడ ఒకవైపు నిర్మాణం పనులకే మనుషులు దొరకక వత్తిడి  .స్వామీ నీదే భారం అంటూ పనులు మొదలెట్టాము. ఇరవైఒకటిన అన్నపూర్ణభిక్షాశాలకు స్లాబ్ వేసి ఆపని లో అలుపుతీర లేదు.తీరే సమయమూ లేదు.  మాపిల్లలు సుబ్బారావు, రామాంజనేయరెడ్డి పనికి గట్టిగా నిలబడ్డారు. ఒకవైపు మాతమ్ముడు  వానితో పాటు పోతురాజు ఆటొతో వెళ్ళి సరులుకు చేర్చారు.శ్రీనివాసరెడ్డి ఒంగోలునుంచి కారులోవెళ్ళి పూలుతీసుకొస్తానన్నాడు,లక్ష్మీనారాయణరెడ్డి,నాగిరెడ్డి ,అంజిరెడ్డి ,కోటేశ్వరరావులాంటి కార్యకర్తలంతా రామనామ ప్రతులనుపీఠానికిచేర్చే పనిచూస్తామన్నారు.
యాగానికి రావాలని  అనుకున్నా దూరప్రాంతంవాళ్ళు ప్రచండభానుని తీవ్రతకు భయపడి ఆగిపోయారు. కొందరు పెద్దవయస్సువారిని మేమే వద్దని వారించాము .
మనోహర్ తనభార్యాపిల్లలతో బెంగళూర్ నుండి వచ్చిచేరాడు. విశాఖపట్టణం నుండి  సంకీర్తనాచార్యులు శ్రీనివాస్ గారు శ్రమకోర్చి వచ్చారు. ఇక మా కార్యక్రమ నిర్వహణ అంతా మీదవేసుకుని నడిపే యాజ్ఞికులు గోపాలకృష్ణమూర్తిభట్టు గారు వారిగురువుగారితో కాశీ లోయజ్ఞకార్యక్రమాలకై తరలివెళ్ళారు. ఏలా చేయాలి? అని మథనపడుతుండగా     విశాఖపట్టణంలో ఉన్న త్రినాథశర్మ గారిని స్పురణకు తెచ్చారు స్వామి వారు.
అయ్యా ! త్రినాథ్  స్వామి నీకప్పగిస్తున్నాడు కార్యక్రమం అనగానే   గురువుగారూ ! ఇది  నా అదృష్టం అంటూ   రాత్రికిరాత్రి  శ్రమతీసుకుని బయలుదేరి వచ్చి శనివారం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు .
ఇరవైమూడు న హనుమత్ జయంతి రోజు స్వామికి అభిషేకములు,విశేషపూజలు జరిపాము. ఆరోజు కాచిన ఎండకు తల్లడిల్లిపోయారు జనం. మామిడిచెట్టుక్రింద కూర్చుని ఆ వేడిగాలి  రేపు ఉంటే  అగ్నికార్యం నిర్వహించటమంటే మాటలా అని అంగలార్చాం నేనూ,శ్రీనివాస్ గారూ,మనోహర్ , ఐతే గతంలో కూడా తీవ్రమైన ఎండకూడా యాగం సమయానికి చల్లబడిపోయిన అనుభవాలను గుర్తుతెచ్చుకుని ధైర్యం చెప్పుకున్నాము.
 ఇక శనివారం యాగకుండ నిర్మాణం చేసి,  నూటాఎనిమిది కలశములు స్థాపించి అభిషేక,అర్చనలు కావించి,గోత్రనామాలు పంపిన భక్తులందరై తరపున సంకల్పం చెప్పి అందరితరపున యాగానికి ఉపక్రమించాము.
 యాగం సాగుతున్నది. ఆహుతులిచ్చేకొద్దీ హవ్యవాహనుడు ఆనందంతో అగ్నికీలలు చాస్తూనృత్యంచేస్తున్నారు. మామూలుగానైతే ఆ ఎండకు స్టౌ దగ్గరకూడా నిలుచోలేము. చిత్రంగా  మాకెవరికీ వేడి అనిపించలేదు. సాధారణంగా శీతాకాలంలో యాగం చేసినట్లే ఉంది . నిన్నవీచిన వడగాల్పు ఆగిపోయింది.  భక్తజనులకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బుధ్ధిప్రచోదనం కలుగజేసి అన్నీ తానైనడపిన హనుమత్ స్వామికి పూర్ణాహుతి సమర్పించాము.

ఆపై   పీఠంలో వేంచేసిఉన్న  శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఉభయదేవేరులతోనూ,  మా అమ్మదుర్గమ్మకు తండ్రి రామలింగేశ్వరుని తోనూ కళ్యాణమహోత్సవం నిర్వహించుకున్నాము.
ఇకచివరి ఘట్టంలో చూడాలి స్వామి కరుణావర్షం వర్ణించలేము.
కళ్యాణమూర్తులఎదుట నిలబడి  త్రినాథశర్మ   ....లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం ఎత్తుకున్నారు. అది చిన్నపాయగాసాగి మహోదృతమైనప్రవాహంలా మారింది . మాగొంతులు కలుస్తున్నాయి. మధ్యలోకొచ్చేసరికి మాకు మనసు పులకరించిపోతున్నది.  తరువాత తట్టుకోవటం కష్టంగాఉంది. కళ్లవెంట నీరు సుడులుతిరుగూ బయటకొస్తున్నది ఎంత తమాయించుకుందామనుకున్నా.
 ఇక మనోహర్  బిగ్గరగా ఏడ్చి స్వామిముందు మోకరిల్లిపోయి  తనశోకాన్ని శ్లోకంగా నివేదించటం మొదలెట్టాడు.
 మండపంలోనూ బయట ప్రకృతి స్థంభించినదా అన్నట్లు నిశ్శబ్దం ఆవరించింది   .భక్తులంతా శిలాప్రతిమల్లా ఆనందంతో తన్మయంలో మునిగిపోయారు. .

చివరకొచ్చేప్పటికి త్రినాథశర్మ కు ఆపుకోవటం తరం కాలేదు. అంతే !ఆయనకూడా ఆనందంతోకూడిన దుఃఖంతో గొంతుపూడుకపోయి  ఏడ్చారు పసిపిల్లాడిలా.
ఇక శ్రీనివాస్ గారు , దయజూడరావేల దశరథవరబాల .....అంటూ సంకీర్తన ఎత్తుకున్నారు.  మధ్యాహ్నం ఎండ ఎక్కడుందో తెలియని ఆనందవర్షం కురిసింది మాపై సంకీర్తనాధారలతో . ఆకలిలేదు,దాహం లేదు. అలాగంటపాటు సాగింది సంకీర్తన.
స్వామీ! నాకు ఆస్తులొద్దు,పాస్తులొద్దు   ఇలా   నీ సేవచేస్తూ,, నీభక్తులతో కూడి నీగుణగానం చేస్తూ కన్నుమూస్తే చాలు అని పెద్దగా చెప్పుకున్నాను స్వామివారికి అసంకల్పితంగా .
ఇంకేం కావాలి  ఈజన్మకు.  నాకేవిద్యలూ రాకున్నా తనసేవకునిగా నియమించుకుని నేనెవరో తెలియకున్నా ఏచిన్నకార్యక్రమానికైనా తామున్నమని అండగా నిలచే  ఇంతమంది బంధువర్గాన్నిచ్చి, నేనేమీ ఇవ్వలేనని తెలిసినా తమస్వంతకార్యంలా తలచి తరలివచ్చి నిర్వహించే,పురోహిత,యాజ్ఞికస్వాముల అండకల్పించి  ఇంతటి బృహత్కార్యక్రమాలకు నన్నుకూడా ఒకపావుగా చేసి నాజన్మకుసార్థకతను కల్పించాలని తపనపడుతున్న మాస్వామి   హనుమత్ప్రభువులకు నేనేమివ్వగలను . చేతులుజోడించి సాష్టాంగపడి ఒకనమస్కారంచేయటం, అంజనివరతనయా...మావందనమిదిగో  ఆంజనేయా.........అని నోటారా ఒకపాట పాడుకోవటం తప్ప.11 వ్యాఖ్యలు:

ఆతడు May 25, 2014 at 1:33 PM  

Thanks for sharing the photos.

రాజ్ కుమార్ May 27, 2014 at 10:56 AM  

Santhosham ga undandi.

Sandeep P May 27, 2014 at 7:05 PM  

ఫోటోలు చాలా చక్కగా ఉన్నాయి అండి. పరమేశ్వరుడి అనుగ్రహం వలన యాగం బాగా జరిగినందుకు సంతోషంగా ఉంది.

సురేష్ బాబు May 27, 2014 at 7:25 PM  

అత్యద్బుతమండీ. జై హనుమాన్. క్షమించండి.అరుణాచలం వెళ్లడం వలన రాలేకపోయాను.

psm.lakshmi May 28, 2014 at 12:26 AM  

అదృష్టవంతులు..అనుభూతిలో తడిసి ముద్దయ్యారు.
psmlakshmi

చింతా రామ కృష్ణా రావు. May 28, 2014 at 4:16 AM  

ఆర్యా! దుర్గేశ్వరరావుగారూ! మీరు ఉంచిన చిత్తరువులను చూచుట ద్వారా ప్రత్యక్షానుభవం మాకు కలిగించారు. మీకు ధన్యవాదాలు.
మీ
చింతా రామ కృష్ణా రావు.

Ennela May 28, 2014 at 5:11 PM  

Thanks for sharing the pictures.
hanumatprabhuvuku jejelu.

svkr June 4, 2014 at 8:24 AM  

swami darsana Bhagyniki, yaganiki ralekapoyaanu. konta asowkaryam, konta sankalpa lopam. edi emynappatiki phtolu chusanu. mee message chadivanu. kallamundu saakshatkarimpa chesindi. dhanyudanu.inkoka paryayam palgonakunda cheyavaddani swamini vedukuntunnanu. tvaralo darsana Bhagyam kalagaalani prardistunnanu. namaskaram.

svkr June 4, 2014 at 8:24 AM  

swami darsana Bhagyniki, yaganiki ralekapoyaanu. konta asowkaryam, konta sankalpa lopam. edi emynappatiki phtolu chusanu. mee message chadivanu. kallamundu saakshatkarimpa chesindi. dhanyudanu.inkoka paryayam palgonakunda cheyavaddani swamini vedukuntunnanu. tvaralo darsana Bhagyam kalagaalani prardistunnanu. namaskaram.

svkr June 4, 2014 at 8:24 AM  

swami darsana Bhagyniki, yaganiki ralekapoyaanu. konta asowkaryam, konta sankalpa lopam. edi emynappatiki phtolu chusanu. mee message chadivanu. kallamundu saakshatkarimpa chesindi. dhanyudanu.inkoka paryayam palgonakunda cheyavaddani swamini vedukuntunnanu. tvaralo darsana Bhagyam kalagaalani prardistunnanu. namaskaram.

Laxmi Prasad June 6, 2014 at 1:12 AM  

Fantastic Photos.Function is grand success.Weather(Summer) is support for the hole day.Swamy prays a strotams are excellent.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP