కరోనా అనగానే కంగారు పడొద్దు .... కాస్తంత నిదానించి చూడండి విరుగుడు మనదగ్గరే దొరుకుతుంది
>> Thursday, March 5, 2020
కరోనా అనగానే కంగారు పడొద్దు .... కాస్తంత నిదానించి చూడండి విరుగుడు మనదగ్గరే దొరుకుతుంది
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇప్పుడు గడగడలాడిస్తోంది . కానీ దీని ప్రమాదాన్ని ఇంకారాబోయే ఇటువంటి ప్రమాదాలను కాలజ్ఞాన ప్రదాత ...తాతగారు వీరబ్రహ్మము గారు ముందుగానే హెచ్చరించారు తన శివగోవింద తత్వములలో .
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇప్పుడు గడగడలాడిస్తోంది . కానీ దీని ప్రమాదాన్ని ఇంకారాబోయే ఇటువంటి ప్రమాదాలను కాలజ్ఞాన ప్రదాత ...తాతగారు వీరబ్రహ్మము గారు ముందుగానే హెచ్చరించారు తన శివగోవింద తత్వములలో .
మన ఆహార ,విహారనియమాలన్ని ఆరోగ్య పరిరక్షణకై ఏర్పరచబడ్డవే . అందులోనూ ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా మన వంటకాలు ఉంటాయి. కేవలం కడుపు నింపుకోవడానికే కాకుండా మన కూరలు ఔషధములుగా పనిచేస్తుంటాయి. . ఇక మూలికావైద్యం భారతీయులందరికి నిన్నమొన్నటిదాకా సహజంగా తెలిసి ఉండేది. అపూర్వమైన ఆ విజ్ఞానాన్ని మనమే చేజేతులారా దూరం పెట్టుకుని ఇప్పటితరాలకు అందకుండా చేసాం మెకాలే విద్యావిధానాన్ని అనుసరించి
ఇప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నిచోట్లా చెబుతున్నవే గనుక నేను మళ్ళీచెప్పనవసరం లేదు. ఈ సూచనలలో వీలైన వాటిని పాటిద్దాం మహమ్మారిని ఎదుర్కొందాం .
సూర్యనమస్కారాలు చేయటం లేదా సూర్యుని కెదురుగా పదినిమిషాలు నిలబడి సూర్యశక్తిని మన శరీరం గ్రహించేలా చేయటం.
వేప పుల్లలు దొరికితే వాటితో దంతధావన చేయటం చాలా మంచిది.
స్నానానికి గో ఆధారిత సబ్బులు అలాగే గోమూత్రంతో అప్పుడప్పుడు చేతులు శరీరం తుడవాటం కూడా సమర్ధవంతమైన చర్య
తులసిదళములు తులసి తీర్ధం ,తిప్పతీగ ,అల్లం ,ఇవి కాచి ఒక కప్పు త్రాగటం
అల్లం , వెల్లుల్లి ,ఉల్లిగడ్డలను పఛ్చివి తీసుకోవడం
పసుపు పావుచెంచా వేసుకుని పాలు తాగటం . అలాగే టి కాఫీలకు బదులు సొంఠి కాఫీ తయారు చేసుకుని తాగటం
అలాగే రసం మన భోజనంలో తప్పనిసరిగా ఉండేలా చూడటం [ఇప్పుడు చైనా లోకూడా రసం ఫేమస్ ]
ఇక అత్యంతప్రభావం చూపేది యజ్ఞం . గాయత్రీ పరివార్, ఎక్కిరాల కృష్ణమాచార్యులు స్థాపించిన వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ ,లేదా ఆర్యసమాజ్ వాళ్ళను సంప్రదిస్తే ఇంట్లో అగ్నికార్యం చాలా తేలికగా చేసుకునే విధానం నేర్పుతారు. రెండు ఆవు పిడకలు కర్పూరంతో వెలిగించి ఆవునెయ్యి మూలికల పౌడర్ తో ఒక్క పదినిమిషాలు ఆహుతులివ్వండి చాలు మీ ఇల్లు పరిసరాలన్నీ కాలుష్య రహితమయి కోవిద్ లాంటి సూక్ష్మజీవులు నశిస్తాయి. అందరికి ఉపయోగపడే క్రియ ఇది .
భారతీయ వైద్య శాస్త్రవేత్త వాసన్ గారనేవారి ఆధ్వర్యంలో దీనికి చైనాలో నియంత్రణ ఔషధాలు తయారవుతున్నాయని వస్తున్నాయి
భయపడకండి
ఆశ్రయించిన వారిని కాపాడుటకు హనుమంతుడున్నాడు
జైశ్రీరామ్
0 వ్యాఖ్యలు:
Post a Comment