శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వెర్రితలలు వేస్తున్న సెక్యులరిజం తిరుమలలో చారిత్రక ఆధారాలు ధ్వంసం చేస్తున్నది

>> Monday, August 26, 2019

వెర్రి తలలు వేస్తున్న సెక్యులరిజం

దాదాపు ఎనభై దశకం ఆరంభం నుంచి మేము
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్ధాం , వెళ్తునే ఉన్నాము .ఆక్కడ ధ్వజ స్తంభానికి ఎడమ వైపున ఓ మండపం ఉంది .ఆమండపము గ్రిల్ల్ కి ఓ పెద్ద బోర్డ్ వేళ్ళాడుతుండేది - ఆ బోర్డ్ ఇత్తడి రేకు పయిన పెద్ద అక్షరాలతో ఇలా లిఖించ బడి ఉండేది .
" పదమూడో శతాబ్ధములో ' మాలిక్ కాఫర్ ' అనే సేనా నాయకుడు ( ఢిల్లీ బాద్షా - అల్లాహ్ - ఉద్- దీన్ - ఖిల్జీ ) తమిళ్నాడు లో ఉన్న శ్రి రంగనాధ స్వామి ఆలయాన్ని దోచుకుని , దివ్య దైవ విగ్రహాన్ని ధ్వంసం చెయ్యడనికి శ్రీ రంగం సమీపిస్తున్న సమయంలో , అప్పటి అర్చక స్వాములు , కళాకర్షణ చేసి మూల విరాట్ ను ఇసుక తో కప్పేసి , పై మంటపం లో , తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయం లో ఉంచి దాన్ని ముస్లిం విధ్వంస కారుల చేతిలో పడకుండా దాచారు .
మన దేశం లో, " ముస్లిముల " ప్రాబల్యం తగ్గినదాకా ఈ మంటపము లోనే ఉంచి , ఆ తరువాత ' శ్రీ రంగాని కి ' తరలించి మళ్ళీ కళావాహణ చేసి పూర్ణ కుంబాభిషేకాలు , వేదోక్తం గా నిర్వహించి అర్చణానుష్టానాలు కొన సాగిస్తున్నారు . సుదీర్ఘ కాలం , ఈ మంటపం  లోనే , శ్రీ రంగ నాధ స్వామి వారిని ఉంచడం వళ్ళ , ఈ మంటపానికి ' రంగనాయకుల మంటపం అనే పేరు వచ్చింది "- అన్నది ఆ ఇత్తడి బోర్డ్ లోని విషయం .
ఈ బోర్డ్ అనేక దశాబ్ధాలుగా అలాగే ఉండేది , ఎంతో మంది చైర్మన్లూ , ఎక్జిక్యూటివ్ ఆఫీసర్లూ వచ్చారూ & వెళ్ళారు కానీ గడచిన చరిత్ర కు ప్రత్యక్ష సాక్షి గా ఉన్న , ఈ ఇత్తడి ఫలకాన్ని ఎవ్వరూ ముట్టుకోలేదు - ఇది నగ్న సత్యం .
అయితే తెలుగు దేశం సెక్యులర్ " శ్ర్ పుట్టా వారు " ఈ చారిత్రక సత్యాన్ని వ్యక్తం చేస్తున్న ఫలకాన్ని తొలగించి , ఇత్తడి తోనే మరో చిన్న ఫలకాన్ని చేయించి , ఈ విధం గా లిఖించారు .
" ( రంగ మందిరం )పన్నెండూ - పదమూడు శతాబ్ధాల లొ '  , యాదవ రంగ నాయకులు ' ఈ మందిరాన్ని కట్టిన్చారు ."
వాస్తవాలను తురకల దౌర్జన్యాన్ని మరుగున పెట్టీశారు .
ఇక్కడ ఇంకో తమాషా ఏమిటంటే ఈ కొత్త ఫలకం లో , ఎక్కడ కూడా , " యాదవ రంగ నాయుకులు , కట్టించారు కాబట్టి , దీనికి " రంగ మందిరం " అనే పేరు వచ్చిందీ అని రాయ లేదు - అంటే అసత్యాన్ని బహిరంగంగా రాయ లేదు , కానీ కొత్త వారెవరయినా చూస్తే , బహుశా యాదవ రంగ నాయకులు కట్టించారు కాబట్టి - దీనికి " రంగ మందిరం  " అనే పేరు వచ్చి ఉంటుంది , అని భ్రమిపజేస్తున్నారు .

ఇలా వాస్తవాలను  వక్రీకరించి క్షుద్ర చరిత్రను తొక్కి పెట్టి ప్రజలను భ్రమింప చేయాల్సిన అవసరం " శ్రీ పుట్టా " వారికి ఎందుకొచ్చిందో , ఈ చర్య వళ్ళ మైనార్టీల వోట్లు ఎన్ని పడ్డాయో శ్రీ పుట్టా వారికి & వారి అధినేత శ్రీ మాన్ నారా చంద్ర బాబు నాయుడు గారికే తెలియాలి .

కొస మెరుపు :  ఈ మారులు చేసిన మూడు నెలల లోపునే శ్రి పుట్టా గారూ & శ్రీ మాన్ నారా చంద్ర బాబు గారూ పదవీచ్యుతులు అయ్యారు - గోవిందా !

ఇప్పటి చైర్మన్ శ్రీ రెడ్డిగారికి నా విజ్ఞప్తి ఏమిటంటే , వాస్తవ చరిత్ర ని తెలిపే పాత ఇత్తడి ఫలకాన్నే పునహ్ ప్రతిష్ట చేసి , ప్రజల మనసు గెలుచుకోవాలని !!!
From WhatsApp

మిత్రులందరికీ నా విజ్ఞప్తి : దయ చేసి పాత ఫలకం పునరుధ్ధరించడానికి విస్త్రుతం గా దీనికి ప్రాచుర్యం కల్పించండి , మీ కామెంట్ల ద్వారా నిరసనలు తెలియజేస్తూ హిందువుల ఐకమత్యాన్ని చాటండి .

గోవిందా ! గోవిందా !! గోవిందా !!!i

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP