శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అర్జునుడు చెప్పిందే జరుగుతోందా?

>> Wednesday, May 15, 2019

*అర్జునుడు చెప్పిందే జరుగుతోందా?*
 *అనంతసాహితి-పితృదేవతారాధనా రహస్యాలు- 062*

‘‘నేను రచించిన విద్యాప్రణాళిక భారతదేశంలో అమలు చేస్తే మరికొద్ది దశాబ్దాల్లో భారతదేశం మనకు బానిసగా మారిపోతుంది. భారతీయులకు చరిత్రలేదు, సంస్కృతిలేదు అంటూ విమర్శించే వెన్నెముక లేని తరాలు తయారవుతాయి. మనమేం చేయాల్సిన అవసరం లేకుండా ఆ తరాలే దేశాన్ని సర్వనాశనం చేస్తాయి. శత్రుదుర్భేద్యంగా ఉన్న భారతదేశం పునాదిలేని గోడల్లా కూలిపోతుంది.‘‘ అని మెకాలే అన్నాడని చాలా మందికి తెలుసు.

అయితే, మెకాలే చేసిన విధ్వంసరచన ఎలా ఈ జాతిని చెరబట్టిందో మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన భారతీయ ఆత్మ మీద దెబ్బకొట్టాడు. ఈ దేశానికి రక్షణగా ఉన్న విశ్వాసాలు, సంస్కృతులను ముందుగా నాశనం చేశాడు. ఇది ముందుగా ఎంతో మంది గమనించినా బలవంతులైన ఆంగ్లేయుల రాక్షసత్వంపై పోరాడలేకపోయారు. కులమతాల అంతరాలు చూపి చిచ్చుపెట్టి మనిషికీ మనిషీకీ మధ్యన సమాధిగోడలు కట్టేశాడు. ఈ కాలకూట విషం వంటి మెకాలే విద్యాప్రచారాలు విజ్ఞులు ముందస్తుగా గుర్తించడానికి సాయం చేసిన హెచ్చరిక భగవద్గీతలో ఉంది.

సంప్రదాయ యుద్ధానికి కొన్ని వికృతశిశువులను రాక్షసమేధారతిలో సామ్రాజ్యవాదం పుట్టించింది. ఈ రోజుకీ ఈ వికృత శిశువు కొత్త పడగలతో తలెత్తుతోంది.  ఆ కాలకూడ విషఫణులు ఇవే. ప్రచారయుద్ధం, ఆర్థికయుద్ధం, ప్రచ్ఛనయుద్ధం,  అణుయుద్ధం, దౌత్య(రాయబార)యుద్ధం, సాంస్కృతికయుద్ధం, సైబర్ యుద్ధం, రసాయనికాయుధయుద్ధం, జీవాయుధయుద్ధం- వంటివి ఉన్నాయి. ఇవే కాక ప్రతి రోజూ కొత్తపడగలు పుట్టుకు వస్తున్నాయి.

వీటిలో సైబర్ యుద్ధం, సాంస్కృతిక యుద్ధాలు కలగలిపిన వికృతసమ్మేళన విషశిశువు నేడు జాతిని దుర్బలం చేస్తోంది. దీనికి విషబీజాలు మెకాలేవి. నేడు సామాజిక మాధ్యమాలు, టివిలు, ఇంటర్ నెట్లు, మొబైల్ మాధ్యమాలలో చార్వాకసిద్ధాంతాలు గుట్టుచప్పుడు కాకుండా దేశప్రజలను ముట్టడిస్తున్నాయి. సాధారణంగా యుద్ధాలు సైనికుల మధ్య జరుగుతాయి. ఓడిపోయిన దేశప్రజలను గెలిచిన సైనికులు దోచుకుంటారు. అయితే ఈ నవీన యుద్ధతంత్రాలలో సరాసరి దేశప్రజల మీదే జరుగుతుంది. ఇదే పరమదుర్మార్గమైన యుద్ధతంత్రం.

మెకాలే చేసిన ధ్వంసరచన వల్ల వెన్నెముక లేని జాతిని అవలీలగా ఆంగ్లేయులు ఆక్రమించి బ్రహ్మచర్యం, పాతివ్రత్యం, పితృదేవతార్చన వంటివి ఊహల్లోకి కూడా రాకుండా చేయగలిగారు. దీని వల్ల దుర్బలమైన జాతి వారికి తేలిగ్గా వశమైపోయింది.

జనాభా పెరుగుదల వల్ల ఆడైనా మగైనా ఒకటే అనే నినాదం జనాభానియంత్రణ విధానంలో భాగంగా హైందవ సమాజం తలకెత్తుకుంది. స్త్రీపురుషుల సమానత్వం నిజానికి ఇది హైందవానికి వ్యతిరేకమైంది కాదు. సనాతన ధర్మానికి ప్రాణమే సమానత్వం. కానీ హిందూధర్మస్ఫూర్తిని పితృస్వామ్యం పేరిట  దారుణంగా దెబ్బతీసింది.

మగసంతానం లేకపోతే ఆడసంతానం తమ తల్లితండ్రులకు పిండోదకాలు సంప్రాప్తించే మార్గం శాస్త్రబద్ధంగా చూడాలి. అది అల్లుడి వల్లా, తమకు పుట్టిన మగసంతానం వల్లా చేయాలని ధర్మశాస్త్రాలు దౌహిత్రలాభం ద్వారా చెబుతున్నాయి. కానీ దీన్ని అటు ఆడపిల్లలూ విస్మరించారు, ఇటు అల్లుళ్ళూ విస్మరించారు. అభ్రాతృక (సోదరుడు లేని యువతి)ని వివాహం చేసుకోకూడదు అనే సూక్తికి విరుద్ధంగా బావమరిది లేకుంటే అస్తి అంతా మనకే వస్తుంది అనే విపరీతతత్వం ప్రబలింది. చాలా విచిత్రంగా ఆడపడుచు ఉంటే పిల్లనివ్వకూడదనే మరో విషబీజం ఊడలు వేసింది. పరస్పర విరుద్ధమైన విషభావాలతో కుటుంబవ్యవస్థ అల్లాడుతోంది. పర్యవసానంగా ఆడసంతానం ఉన్నవారు పిండోదకాలు లేకుండా పిశాచగ్రస్తులై ఉండిపోతూ వచ్చారు. వీరంతా ఊరికి ఉత్తరాన చెట్లకు తల్లకిందులుగా వేళాడుతూ ఆ తరాలకు శాపాలు పెడుతూ తమ సంతానాన్ని దారుణమైన నష్టాలకు గురి చేస్తున్నారు. నేడు అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమంటే, ఈ శాపాలు కనీసం గుర్తించలేని స్థితికి సమాజం జారుకుంది. దాదాపు ప్రతి రెండు కుటుంబాలలో ఒక కుటుంబం ఈ శాపాల కారణంగా అల్లాడుతోంది.

నవీన విద్యావిధానం వల్ల సంప్రదాయాలు నాశనం కావడం జరిగి, ఆధునిక జీవనవిధానం వలన ఆచారవ్యవహారాలు మంటకలసిపోయాయి. దీని వలన జాతికి ముఖ్యమైన కుటుంబ జీవితం పితరుల శాపాలకు బలైపోతోంది. ఎప్పుడైతే ఇన్నీ నీళ్ళూ నువ్వులూ వదిలే సంప్రదాయానికి దూరం అయ్యామో, బ్రతికి ఉన్నవారికి అనాథశరణాలయాలు, వృద్ధాశ్రమాల అవసరం భారతదేశంలో ఏర్పడింది. ఇంకా కొంత సంస్కారం ఎక్కడో మనసు అనే పాడుపడిన బావిలో తగలబడకుండా ఉంది కనుక పెళ్ళీ పెటాకులతో నిమిత్తం లేకుండా, అది అక్రమసంబంధమా సహజీవనమా అనే ప్రశ్న లేకుండా సరోగసీతో పిల్లల్ని కనేద్దాం, మన విచ్చలివిడి జీవితాన్ని మనం జీవించేద్దాం అనే తరాలు బయల్దేరాయి. ఈ చార్వాక సిద్ధాంతాలను నిత్యదేవతార్చనలు అందుకుంటున్న తారామణితారకాసురులుగా మారిన నటీనటులు బోధిస్తున్నారు. ‘‘మమ్మల్ని బోలి బ్రతకమని‘‘ ఆశీర్వదిస్తున్నారు.

 తోటకూర నాడే చెప్పకపోతిన్రా కొడుకా అన్న చందాన, నీళ్ళు నువ్వులూ వదలక పోతే ఏమవుతుంది? అనే నిర్లక్ష్యవిషధోరణి నేడు కూటికి లేని ఇళ్ళ నుంచీ కోట్లకు పడగలెత్తిన కుటుంబాల వరకూ సమానంగా పాకింది. వృద్ధులైన తల్లి తండ్రులను సాక్షాత్తూ జాతి పిత పేరు పెట్టిన గాంధీ ఆసుపత్రిలో వదిలేసి దరిద్రులు పోతుంటే, వృద్ధాశ్రమాలలో కన్నతల్లితండ్రులను వదలి వారికి స్కైపులు, ఫేస్ బుక్కుల ద్వారా మమకారం పంచుతూ ఖండఖండాతరాలకూ తరలివలసవెళ్ళిపోతున్నాయి కడుపుచించుకు పుట్టిన కన్నపేగులు. ఫలితంగా బ్రతికుండగానే గుక్కెడు నీళ్ళు, నాలుగు మెతుకులూ పెట్టేవారులేని జీవులు భారతదేశంలో తయారయ్యాయి. పోనీ అలా వెళ్ళిపోయిన పిల్లలైనా సుఖంగా ఉంటున్నారా? అంటే విదేశీయులు కూడా అసహ్యించుకునే దుష్ట సంస్కృతులను అలవరచుకొని సంసారాన్ని నిస్తేజం చేసుకుని ఒంటరిగా బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకోవల్సిన పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నారు. మింగమెతుకు లేని వాడు కూడా రాత్రికి తన కుటుంబం చేరుకుని తన ఇంట్లో తాను మహారాజనే ఊరడింపు పొందుతాడు. మరునాటికి కావలసిన శక్తిని కుటుంబం ద్వారా సంపాదించుకునే వాడు. కానీ భయంకరమైన మానవవిషసంబంధాలుగా మారిన కుటుంబబంధాలు అష్టైశ్వర్యాలూ ఉన్నా ధనికులను కూడా మరింతగా క్షోభకు గురిచేస్తున్నాయి. బ్రతికి ఉన్న శవాలుగా నేటి సంసారాలు మారుస్తున్నాయి.

ఇవన్నీ అలనాడు మహావీరుడు అర్జునుడు భగవద్గీత విషాదయోగం ద్వారా వెల్లడించాడు. ‘‘లుప్తపిండోదక క్రియాః‘‘ అన్నాడు.

అర్జునుడు చెప్పింది నేడు అగ్రరాజ్యాలు చేస్తున్న సాంస్కృతికయుద్ధం గురించే.

కులస్త్రీలు చెడిపోతే, వర్ణసంకరం ఏర్పడి, కులధర్మాలు నశించి, సర్వం నాశనం అవుతుందని చెప్పాడు. కుటుంబం చెడిపోవడం వల్ల పెద్దలకు నీళ్ళు నిప్పులు పుట్టక పితృదేవతలు నరకంలో పడిపోతారని చెప్పాడు. ఫలితంగా వారు తమ సంతానాన్నే శపిస్తారు. ఇదే నేడు జరుగుతోంది. భారతదేశ సర్వనాశనానికీ కారణం - మనది కాని సాంస్కృతికజీవనాన్ని నెత్తిన రుద్దుకోవడమే ప్రధాన కారణం. మనదైన జీవనవిధానాన్ని వదలి వేయడమే మరో కారణం.

దీన్ని ఇప్పటికైనా సరిచేసుకోపోతే మరికొన్ని దశాబ్దాల్లో హిందూధర్మమే చరిత్రలోకి వెళ్ళిపోయి అంతరించిన రోమ్, ఈజిప్టు మతాల సరసన చేరుకుంటుంది. నిజానికి ఇటువంటి దుర్దశ అనేక సార్లు హిందూధర్మానికి సంప్రాప్తించింది. అటువంటి సందర్భాలలో వ్యాసభగవానుడు, శంకరాచార్యుల నుంచీ, నిన్నమొన్నటి వివేకానందుని వరకూ ఎంతో మంది భగవద్విభూతులుగా అవతరించి హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ వచ్చారు. వారు చేసిన కరెక్షన్ ఫాక్టర్లే నేటికీ హైందవ ధర్మాన్ని బ్రతికిస్తూ వచ్చాయి. చీడపీడలు పడుతూ ఉండడం మొక్కకు, చెట్టుకూ సహజమే. అయితే స్వీయరక్షణ వ్యవస్థ అయినా ఉండాలి. లేదా బహిర్గతరక్షణ వ్యవస్థ అయినా ఉండాలి. లేకుంటే మొక్క, చెట్టూ బ్రతకలేదు. రైతు కీటకనాశనమందులు చల్లాలి. ఇదే మత సంరక్షణకూ జరగాలి. అది నిరంతర ప్రక్రియ.

కనుక, తక్షణ కర్తవ్యం ఒక్కటే. ముందుగా పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడం. దీని ద్వారానే కుటుంబాన్ని రక్షించుకొని తద్వారా భారతదేశాన్ని పరిరక్షించుకోగలం. హైందవ శక్తి అంతా పితృదేవతార్చనలో ఉందని మా గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారు ఏలూరిపాటి అనంతరామయ్యగారు గుర్తుచేశారు. దీన్ని వదిలేయడం వల్లనే జాతి దుర్బలమైపోతోందని వారు ఉద్బోధించారు. మొత్తం 360 రోజుల్లో 120 రోజులకు పైగా పితృదేవతార్చనలు చేయాల్సి ఉండగా, నేడు తద్దినాలు కూడా విస్మరించే దుర్దశకు నవీనతరాలు జారుకున్నాయి.

మహాదోషదుర్ముహుర్తాలైన వ్యతీపాతవైధృతీయోగాల మొదలుకొని, తెలుగు వారి అతిపెద్దపండుగైన సంక్రాంతి వరకూ ప్రతి తరుణంలో చేయాల్సింది పితరుల అర్చనే అని శణ్ణోవతీ సాధన చెబుతోంది. మారిన జీవన విధానంలో మూడింట ఒక వంతు రోజులను పితరుల అర్చనకు కేటాయించే స్థితిలో ప్రస్తుత తరాలు లేవు. కనుక వేదశాస్త్రాలు చెప్పిన మార్గంలో నవీనకాలానికి అనుగుణంగా పితరుల ఆశీర్వాదాలు పొందే విధానాన్ని ప్రచారం చేయమని మా గురుదేవులు  ఆదేశించారు. గురుదేవుల ఆదేశాల మేరకు అర్జునుడు చెప్పిన విలయం హిందూధర్మానికి రాకుండా చేయడానికి సంకల్పించాలంటే మనం ఈ విధంగా నడుం కట్టి ముందుకు కదలాలి.

ఈ సాంస్కృతికమహావిలయం భారతదేశానికి తప్పించాలని గత ఏడాది ఇచ్చిన పిలుపునకు వేలాది మంది స్పందించారు. వారు తమ పితరులను అర్చించడం మొదలు పెట్టి పితృదేవతల ఆశీర్వాదాలు పొందుతూ వచ్చారు. ఈ సాధనలో వికారినామ సంవత్సరంలో సూర్యుని వృషభ రాశి సంక్రమణం, వ్యతీపాతయోగాలు 15 తేదీ, 17 వ తేదీలలో రానున్నాయి. కనుక 15 నుంచీ 18 వరకూ నాలుగు రోజులు పితరుల అర్చనకు దివ్యమైన సమయాలు.

కనుక ఈ రోజుల్లో గోసేవ చేయడం సకల దోషాలూ నివారిస్తుంది. ముఖ్యంగా పితరుల ఆశీర్వాదాలు పొందడానికి ఉత్తమమైనవి. పితరుల శాపాలు పొంది ఆర్థిక, సంతాన, వైవాహిక, ఉద్యోగవ్యాపార క్లేశాలు పడుతున్నవారు ఆవుకు ఒక రోజుకు సరిపడా మేత ప్రతి రోజూ వేయడం సకలపాపాలూ పరిహరించమే కాదు, పితరులను కూడా సంతోషపెడుతుంది. గోసేవ వల్ల విపరీత మనస్తత్వాలు వెంటనే అదుపులోకి వస్తాయి.

తీవ్రమైన పితృశాపాలు కలవారు కచ్చితమైన సంక్రమణ, వ్యతీపాత యోగాల కోసం పంచాగాన్నీ, స్మార్త బ్రాహ్మణులను సంప్రదించగలరు.     

మీరు చేస్తున్న ఉద్యోగవ్యాపారాలకు అవరోధాలు లేకుండా చేసే పితృదేవతార్చన ఈ విధంగా చేయండి. స్వధా నామ జపం చేయడం, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం, మాతృస్తోత్రం చదువుకోవడం, గోసేవ చేయడం - ఇదే మీరు చేయాల్సింది. ఆవుకు ఇంత గడ్డి వేయడం కాకుండా ఒక రోజుకు సరిపడా మేతను వేయాలి. మీకు తీరిక ఉన్న సమయంలో ఈ స్తోత్రాలు చదువుకోవాలి.

సామాజిక మాధ్యమానికి ఉన్న పరిమితుల కారణంగా ఈ స్తోత్రాలను కేవలం విశ్వాసం ఉన్నవారికి మాత్రమే ఇస్తున్నాము. కావలసినవారు 7842224469 కు వాట్సప్ మెసేజ్ చేసి పొందవచ్చు. దయచేసి ఎస్ ఎం ఎస్ లేదా కాల్ చేయడం చేయవద్దు.

ఆధునిక జీవితంలో శాస్త్రబద్ధంగా పితరుల అర్చనను సులభపద్ధతి పరిచయం చేయడం మా లక్ష్యం. దీనికి అందరినీ సహకరించమని కోరుతున్నాము.

వదాన్యులు తమ దానమును ఈ క్రింది విధంగా చేయవలసిందిగా కోరుతున్నాము.

*ఈ సందర్భంగా ఈ ప్రచారానికి సహకరించమని దాతలను కోరుతున్నాము. శక్తి ఉన్నదాతలు తమ దానాన్ని ఈ క్రింది వివరాల ప్రకారం పంపి సహాయం చేయమని కోరుతున్నాము.*

ఇచ్ఛ శక్తి ఉన్నవారు తమ దానములు భారతప్రభుత్వము ప్రారంభించిన భీమ్ ఆర్థిక మాధ్యమం ద్వారా చేయవచ్చును.

Anantananda@UPI
9247821505@UPI

g pay app:
swamiANANTAananda@okicici
(92478 21505)
అనే అనుసంధానం ద్వారా చరవాణి ఉపయోగించి తమ విరాళములు అందచేయమని కోరు న్నాము.
------------------------------------------------------

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP