శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అక్షయ తృతీయ గురించి అవగాహన ఉండాలి

>> Friday, May 3, 2019

మే నెల 7 వ తేదీ మంగళ వారము అక్షయ తృతీయ.

ఆ రోజునే

సింహాచల వరాహ నరసింహ స్వామి వారి  చందనోత్సవం.

అదే రోజున

పరశురామ  జయంతి .

మరిన్ని  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత

1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
*అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా?*

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. *అసలు ఈరోజున బంగారం  కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు. ఇది కేవలం వ్యాపార జిమ్మిక్ మాత్రమే*

అక్షయ తృతీయ నాడు, మనం  చేపట్టిన  ఏ  కార్య  ఫలమైనా, [ అది  పుణ్యం కావచ్చు; లేదా  పాపం  కావచ్చు.] అక్షయంగా,  నిరంతరం,  జన్మలతో  సంబంధం
లేకుండా,  మన  వెంట  వస్తూనే  ఉంటుంది. పుణ్య  కర్మలన్నీ  విహితమైనవే.  అందునా,  ఆ రోజు  ఓ  కొత్త  కుండలో గానీ,
కూజాలో గానీ,  మంచి నీరు  పోసి, దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే,  ఎన్ని  జన్మలలోనూ,  మన  జీవుడికి    దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు. అతిధులకు, అభ్యాగతులకు,  పెరుగన్నంతో  కూడిన  భోజనం  సమర్పిస్తే,  ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన  రోజు  రాదు. వస్త్రదానం వల్ల  తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు  స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు    సమర్పించుకుంటే,  మన  ఉత్తర జన్మలలో,  వాటికి  లోటు  రాదు. గొడుగులు, చెప్పులు,  విసన కర్రల లాటివి  దానం  చేసుకోవచ్చు.

ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం. ఓ  సారి  పరిశీలిస్తే, భాగవతం  ప్రధమ స్కంధం ప్రకారం,   పరీక్షిన్మహా రాజు  కలి పురుషుడికి  ఐదు  నివాస స్థానాలను  కేటాయించాడు.  అవి: 👇

*జూదం,  మద్య పానం, స్త్రీలు, ప్రాణి వధ,  బంగారం*.  వీటితో పాటు కలి కి  లభించినవి

👉 *ఇంకో  ఐదు* 👈

అసత్యం,గర్వం, కామం, హింస, వైరం.  జాగ్రత్తగా  పరిశీలిస్తే,  ఆ పైన  ఉన్న  ఐదిటికీ  ఇవి  అనుషంగికాలు.
ఆ  పై  ఐదిటినీ  ఇవి  నీడలా  వెన్నంటే  ఉంటాయి.

అక్షయ తృతీయ  రోజు  ఎవరైనా,  ఈ  ఐదిటిలో  దేని  జోలికి  వెళ్ళినా,  కలి పురుషుడి  దుష్ప్రభావం
అక్షయంగా  వెంటాడుతూనే  ఉంటుంది.

👉  *మరి అక్షయ తృతీయ నాడు ఏం చెయ్యాలి(పురాణకథనం)*  👈

మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. పరమశివుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.

ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు. శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది.
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదా?
అక్షయ తృతీయకు బంగారానికి లింకేంటి?..💐💐

హిందువుల సాంప్రదాయం ప్రకారం….సంవత్సరంలోని మూడు రోజులు ఏ పని ప్రారంభించడానికైనా చాలా మంచివి. అవి.
1) ఉగాది.
2) అక్షయ తృతియ
3) విజయదశమి.
అందుకే ఈ మూడు రోజులను పవిత్రదినములుగా చూస్తారు. అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి కాస్తంత వివరంగా చెప్పుకుందాం…

అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది.. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజు వస్తుంది కాబట్టి…దానిని అక్షయ తృతియ అంటారు.

మన పురాణాల ప్రకారం ఈ రోజు..💐
వేద వ్యాసుడు అక్షయ తృతీయనాడే మహాభారతం ఆరంభించాడు.
విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయనాడే.

అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే నియమానికి స్టార్టింగ్ పాయింట్ గా చెప్పుకునే లాజిక్:💐
కుచేలుడు దారిద్ర్యంతో అష్టకష్టాలు పడుతూ.. ఓ రోజు తన ప్రాణ స్నేహితుడైన శ్రీ కృష్ణుడిని చూసేందుకు వెళ్తాడు. కృష్ణుని వద్దకు వెళ్లేటప్పుడు అటుకులు తీసుకెళ్తాడు. స్నేహితుడిచ్చిన అటుకుల్లో పిడికిలి తీసుకుని తిన్న కృష్ణుడు అక్షయం ప్రాప్తించుగాక అని ఆశీర్వదించాడు.

కృష్ణుడి అనుగ్రహంతో కుచేలుడు అష్టైశ్వర్యాలను పొందుతాడు. ఆ రోజునే అక్షయ తృతీయగా పరిగణించబడుతోందని పురాణాలు చెబుతున్నాయి.

అయితే దీనిని ఆధారంగా చేసుకొని ఈరోజు కొన్న ప్రతి వస్తువు మూడింతలు అవుతుందని ఓ నమ్మకం.

వాస్తవానికి ఈ రోజు వ్రతం చేస్తే దానికి మూడు రెట్ల పుణ్యం వస్తుంది, పేదలకు దానం చేయడం వల్ల మూడు రెట్ల పుణ్యం వస్తుంది, కొత్త పనులు ప్రారభించడం వల్ల ఎక్కువగా సక్సెస్ అవుతాయి.

వాటిని వదిలి బంగారం కొనాలి అనే కొత్త కాన్సెప్ట్ ను మన మీద రుద్దింది మాత్రం బంగారు వ్యాపారస్థులు. మొదట అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే విధానం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేది..కాలక్రమేణ అదే భావన మన దక్షిణ భారతదేశానికి కూడా వ్యాపించింది.

సో వీలైతే ఈ రోజు దానం చేయండి, అంతేకానీ డబ్బులు లేకున్నా అప్పుచేసి మరీ బంగారు షాపులకు వెళ్లకండి. మన దేశంలోని బంగారపు షాపులలో అత్యధిక వ్యాపారం జరిగేది ఈరోజేనట...

అక్షయ తృతీయ ప్రాముఖ్యత.💐
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అక్షయ తృతీయ విశిష్టత.💐
వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు . కొందరు వైశాఖ శుక్లపక్ష తృతీయ (తదియ ) రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు . ఇది ఒక నమ్మకం మాత్రమే .

పూజలు , వ్రతాలు , నోములు , యజ్ఞాలు ,యాగాలు చేస్తే ధనము , ఐశ్వర్యము వస్తుందనేది ఎంతమాత్రము శాస్త్ర సమ్మతం కాదు . . . కాని నమ్మకం మూలానా మానవుడు కొంతవరకు ఆదా చేసే అవకాశము , కనీసము ఆరోజైనా భవిష్యత్తు అవసరాలకు ఆదాచేసే అవకాశము ఉంది.

ఒక తరము నుండి మరొక తరానికి " జ్ఞాపకాల " బదలాయింపు జరుగుతూ ఉండాలి ... ఉంటేనే మన సంస్కృతి , సంప్రదాయాలు కలకాలము నిలిచిఉంటాయి.
ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము.

ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ, మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి.

అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు. ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు, ఉపవాసాలు, పండుగలు అన్నవి. వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి.
అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ-ఉగాది" పర్వదినం. . .

అక్షయం అంటే క్షయం లేకుండుట. జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా, అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు చెబుతాడు.

ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు.

బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.

వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు.

వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్య ఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము. సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవీకి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం.

శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం.

బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.

అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి.

ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.

వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.

"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"
కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి.

కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందురు. ఈనాడే "బదరీనారాయణ" మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషీకేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును.

ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హొమ, దానాదులన్నియు "అక్షయము" పొందునుగాన! ఇది "అక్షయతృతీయ" మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు.

ఇందులకొక పురాణగాధకలదు..💐
పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా; సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు "వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము" అని చెప్పగా విని, ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్‌బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను.

అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట. "అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.

"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"

వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని, పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు.

అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.

లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐
From whatsapp

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP