శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గణిత గురువుకి వేల వేల వందనాలు

>> Monday, April 2, 2018

గణిత గురువుకి వేల వేల వందనాలు

🔸ఆనంద్ కుమార్, ఒక మ్యాథ్స్ టీచర్, లెక్కల మాష్టారు..

🔸ఆయన గురించి,  డిస్కవరి ఛానల్ ఒక గంట ప్రోగ్రాం చేసింది..

🔸న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక హాఫ్ పేజ్ రాసింది..

🔸BBC ప్రోగ్రామ్స్ లో అనేక సార్లు ఆనంద్ పాల్గొన్నారు..

🔸జర్మని, స్వీడన్, తైవాన్, దుబాయ్, ఫిలిప్పీన్స్ ఇలా ఒకటేమిటి..

🔸ఎన్నో దేశాల మీడియా ఆనంద్ కుమార్ గురించి కథనాలు రాసింది, ప్రసారం చేసింది.

🔸ఇప్పుడు బాలివుడ్ నిర్మాత దర్శకుడు వికాస్,  ఆనంద్ కుమార్ మీద ఒక సినిమా తీస్తున్నారు.

🔸ఒక మ్యాథ్స్ టీచర్ ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా తెచ్చుకున్నారు అంటే.. ?
.
🔸బిహార్ రాజధాని పాట్నా లో ఉండే ఆనంద్ కుమార్ అనే కుర్రాడికి కెరీర్ గురించి ఒక సందిగ్దం వచ్చింది..

🔸ఇంట్లో వాళ్ళు IIT లో సీటు తెచ్చుకోమని వత్తిడి చేస్తున్నారు.
కానీ తనకేమో మ్యాథ్స్ నేర్చుకోవాలని ఉంది.

🔸ఎటూ తేల్చుకోలేక తన గురువుని సలహా అడిగాడు.
“భద్రమైన జీవితం, మంచి ఇల్లు, చేతినిండా డబ్బు కావాలి అంటే  IIT కి వెళ్ళు,జ్ఞానం పెంచుకోవాలి, ఆ జ్ఞానం పదిమందికి పంచాలి అని అనుకుంటే గణితశాస్త్రం చదువు, పెద్దగాడబ్బు మాత్రం ఆశించకు” అని గురువు చెప్పారు..
ఆనంద్ కుమార్ జ్ఞానం వైపే మొగ్గు చూపాడు. అలా ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేసాడు.

.
🔸తను చదువుకునేటప్పుడే ఇతర విద్యార్థులకి సాయంత్రం వేళల్లోమ్యాథ్స్ క్లాసులు తీసుకునేవాడు. తనకి మ్యాథ్స్ అంటే ఎంత పిచ్చి అంటే..పాట్నా యూనివర్సిటీ లైబ్రరీ లో ఉన్న పుస్తకాలు సరిపోక,ప్రతి శుక్రవారం ట్రైన్ లో బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళి శనిఆదివారాలు తనతమ్ముడి గదిలో ఉండి, యూనివర్సిటీ లైబ్రరీలో ఉండే విదేశీ జర్నల్స్ చదువుకునేవాడు..

🔸అలా పెంచుకున్న జ్ఞానాన్ని పదిమందికి పంచేందుకు
రామానుజన్ స్కూల్ ఆఫ్ మాథమేటిక్స్ ను స్థాపించారు ఆనంద్.
.
🔸క్లాస్ రూమ్ రెంట్, మంచినీళ్ళ ఖర్చులకోసంకేవలం నెలకి రు.25 తీసుకుని ఆనంద్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడు. ఆ ట్యూషన్స్ కి ఎంత డిమాండ్ ఉండేదంటే, 100 మంది పట్టే హాలులో300 మంది కిక్కిరిసి కూర్చుని మరీ నాలుగు గంటలు మ్యాథ్స్ నేర్చుకునేవారు..కొన్నాళ్ళకి  IIT ఎంట్రన్స్ కోచింగ్ మొదలుపెట్టాడు.

🔸సబ్జెక్ట్ కి జస్ట్ 4 వేలు ఫీజు తీసుకుని కోచింగ్ ఇచ్చేవాడు..
ఆనంద్ ఇస్తున్న కోచింగ్ ను గుర్తించిన ఢిల్లీ కి చెందిన ఒక కార్పోరేట్ విద్యాసంస్థ 1998 లోనే నెలకి 10 లక్షల జీతం ఇస్తామని ఆఫర్ చేసింది. కానీ ఆనంద్ ఆలోచనలు మరోలా ఉన్నాయి..

🔸తనకి 1994 లో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో సీట్ వచ్చింది..అయితే ఆర్ధిక స్థోమత లేక ఆనంద్ ఆ అవకాశం వదులుకున్నారు..తనలాగా ఎంతోమంది మంచి ప్రతిభ ఉన్నా డబ్బులేకచదువుకోలేక పోతున్నారని, వాళ్ళకోసం ఏమైనా చేయాలని ఆనంద్ నిర్ణయించుకున్నారు. అలా మొదలయిందే సూపర్ 30..
.
🔸2003 సంవత్సరంలో ఆనంద్ IIT ఎంట్రన్స్ కి పూర్తి స్థాయి కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు.

🔸ఏడాదికి కేవలం 30 మంది విద్యార్థులని మాత్రమే ఈ కోచింగ్ క్లాస్ కి ఎంపిక చేసుకుంటారు. దీనికోసం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు (మన దగ్గర చుక్కారామయ్య IIT కోచింగ్ లాగా). ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో టాప్ వచ్చిన ముప్పై మందికి పూర్తి ఉచితంగా, హాస్టల్ వసతితో సహా 7 నెలల పాటు ఆనంద్ కోచింగ్ ఇస్తారు.

🔸ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది.

🔸అదేమిటంటే నిరుపేద విద్యార్థులకి మాత్రమే ఆనంద కోచింగ్ ఇస్తారు. ఇక్కడ సీట్ సంపాదించడం కోసం కొంతమంది డబ్బున్న వాళ్ళు తమ పిల్లలకి చిరిగిన, మాసిపోయిన బట్టలు వేసి, పేదవారి లాగా నటిస్తూ మోసం చేయాలని చూస్తారు కూడా. అయితే ఆనంద్ తన నెట్ వర్క్ ద్వారా విచారణ చేసుకుని, నిజమైన పేద పిల్లలని మాత్రమే ఎంపిక చేసుకుంటారు..
.
🔸తొలి ఏడాది 30 మందికి కోచింగ్ ఇస్తే 18 మందికి IIT లలో సీట్లు వచ్చాయి..

🔸2004 లో ఈ సంఖ్య 22, 2005 లో 26, 2006 లో 28 కి చేరింది..

🔸2007 లో కూడా 28 మందికి సీట్లు వచ్చాయి.

🔸2008 లో సూపర్ 30 పేరు దేశమంతా మారుమోగింది..

🔸ఆ ఏడాది ఆనంద్ శిష్యులు మొత్తం 30 మంది IIT లలో సీట్లు సాధించారు..

🔸2009 లో 2010 లో కూడా ముప్పై కి ముప్పై మంది IIT లలో సీట్లు సాధించారు..

🔸తొలి 8 ఏళ్లలో 240 మందికి కోచింగ్ ఇస్తే 212 మంది సక్సెస్ అయ్యారు..

🔸దీనితో ఆనంద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
తాజాగా 2016 లో 30 మంది ఆనంద్  విద్యార్థులలో 28 మంది IIT లలో సీట్లు సాధించారు.
.
🔶రాజకీయ నాయకులనుంచి బెదిరింపులు🔶

🔸ఆనంద్ చేస్తున్న విద్యాసేవను గుర్తించిన రతన్ టాటా, మిలిందా గేట్స్ ఫౌండేషన్ లాంటి ఎన్నో కార్పోరేట్ సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు, ముందుకు వచ్చాయి..
అయితే ఆ విరాళాలను సున్నితంగా తిరస్కరించిన ఆనంద్,
ఇప్పటికీ తను ఇతర విద్యార్థులకి ట్యూషన్స్ చెప్పడం ద్వారా
సంపాదించిన డబ్బుతోనే ఈ సేవ కొనసాగిస్తున్నారు.

🔸ఇక తమ పిల్లలకు సీట్లు కావాలని ఎంతోమంది
రాజకీయనాయకులు ఆనంద్ ను అడుగుతుంటారు. కొంతమంది బెదిరిస్తుంటారు.. తమ కార్పోరేట్ విద్యాసంస్థలో చేరితే కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినవాళ్లు కోకొల్లలు.
ఇవేమీ పట్టించుకోని ఆనంద్ తదేక దీక్షగా, విద్యాసేవ కొనసాగిస్తున్నారు.

🔸అంతేకాదు, ఇప్పటికీ నిరంతరం గణితశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, పరోశోధనలు చేసే
ఆనంద్ ప్రతినెలా కనీసం రెండు ఇంటర్నేషనల్ జర్నల్స్ కి వ్యాసాలు రాస్తారు.

🔸డబ్బు కోసం గణితాన్ని అమ్ముకునే ఈ రోజుల్లో కూడా
డబ్బుకి ఆశపడకుండా, ప్రలోభాలకి లొంగకుండా, ఒక యజ్ఞంలా మట్టిలోని మాణిక్యాలని వెలికితీస్తున్న ఆనంద్ కుమార్ కి నేను, మన గ్రూప్  మరియు మీరు ఒక బిగ్ సెల్యూట్ చేద్దాం.

1 వ్యాఖ్యలు:

శ్యామలీయం April 3, 2018 at 5:51 AM  

పాపం. ఇలాంటి వారికి బయట ప్రపంచంలో మొత్తానికి మంచి గుర్తింపు వచ్చినా సరే, మహాఐతే ఏ పద్మశ్రీనో వస్తుంది. అదీ మన రాజకీయనాయకులు కరుణిస్తే. ఈలోపల ఒకట్రెండు సెంచరీలు కొట్టిన బోలెడు మందికి పద్మశ్రీలూ అనేకమంది సినీతారళ్ళకు పద్మవిభూషణలూ కూడా వచ్చేస్తాయి. మెల్లగా ఈయన మరుగున పడిపోతాడు కాని ఆ తారళ్ళనీ ఈ ఆటలవీరుళ్ళనీ జనం ఎంతో అభిమానంగా గుర్తుంచుకుంటారు. అది మనదేశం ప్రత్యేకత!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP