శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాగణపతి హోమము తో మొదలైన హనుమత్ రక్షాయాగం

>> Saturday, November 18, 2017








హనుమత్ ప్రభువుల  అనుగ్రహంతో   హనుమత్ రక్షాయాగం  కార్తీక అమావాస్య శనివారం ప్రారంభమయినది.   దేశం సుభిక్షంగా ఉండాలని ,ఈ యాగ సమయంలో సాధనలో పాల్గొనే వారి జాతకదోషాలు తొలగి,ముఖ్యంగా శనీశ్చరుల ప్రభావం వలన వారిజీవితాలలో ఎదురవుతున్న సమస్యలన్నీ పరిహరింపబడి  శుభఫలాలు కలగాలని,ధర్మబధ్ధమైన వారి ఇచ్ఛితాలు నెరవేరాలని  సంకల్పం చేశారు రుత్విక్కులు .
ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం,శ్రీరామనామ లేఖనం,శనివారం రోజున హనుమత్ ప్రదక్షిణలు  నియమములుగా ఆచరిస్తూ    ఈసాధన లో పాల్గొన్న ఎంతోమంది తమ జీవితాలలో స్వామి అనుగ్రహం  నిరూపించబడింది. 
         ఇప్పుడు జరుగుతున్న పదవ  ఆవృతి లో పాల్గొనదలచుకున్న భక్తులు  తమగోత్రనామాలను పంపించాలి .శుభముహుర్తం చూసుకుని ఆరోజునుండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం ,సాధ్యమైనంత శ్రీరామ నామ లేఖనం చేయాలి.  శనివారం తమకు అందుబాటులో ఉన్న హనుమదాలయంలో ప్రదక్షిణలు  చేయాలి.
సాధారణ నియమాలు చాలు. ముఖ్యంగా మననుండి ఇతరజీవులకు హాని జరగకుండా , సాధ్యమైనంతవరకు ప్రకృతికి హానిచేసే ప్లాస్టిక్ కవర్లవాడకం  పై స్వీయ నియంత్రణ పాటించాలి .వీలైన చోట లోకక్షేమం కోరుతూ ఒక చెట్టును నాటి పెంచడం  చాలా శుభఫలితాలనిస్తుంది .
లిఖిత రామనామ ప్రతులను  జనవరి  2018  ఇరవై అయిదు  రోజుకు  అందేలా పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపాలి. విదేశాలలో ఉన్నవారు ప్రతులను పంపి ఫోన్లద్వారా తెలియపరచినా వారందరి తరపునా పూర్ణాహుతిలో  ఆహుతులను సమర్పించడం జరుగుతుంది  .  
ఇక యాగంలో ప్రత్యక్షంగా పాల్గొనదలచుకున్నవారు  ముందుగా తెలియపరచి ఇరవై ఆరవ తేదీకల్లా పీఠానికి చేరుకోవాలి . మాతోపాటు  కలసి ఉండగలగాలి. మాలాగానే సాధారణ వసతి ఉంటుంది.
 తమ సమస్యలను తమస్వయం సాధనద్వారా  పరిష్కరించుకోవచ్చు ననే  సత్యనాన్ని నిరూపించుకునే ఐ ఆత్యాత్మికప్రయోగం లో పాల్గొంటున్న వా రికి  న ముఖ్యంగా యువతకు  అభినందనలు
జైశ్రీరామ్
సంప్రదించవలసిన చిరునామా

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
 durgeswara
9948235641
durgeswara@gmail.com

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP