శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కాటమూరి కిషోర్ కుమార్ అనే మిత్రుడి అనుభవం... ఆయన మాటల్లోనే......

>> Friday, October 27, 2017

కాటమూరి కిషోర్ కుమార్ అనే మిత్రుడి అనుభవం... ఆయన మాటల్లోనే......

ఇందాక అలా పనుండి పాట్నా లో ఉన్న వేదపారశాల కాంపౌండ్ లో ఉన్న SBI కి వెళ్లాను లింకు ఫెయిల్ అవడంతో అలా బయటపడి వేదం వల్లె వేస్తున్న పిల్లల్ని గమనిస్తూ అక్కడ ఉన్న గురువుగారైన సదానంద్ ద్వివేది గారిని "ఎందుకండీ ఇలా బట్టి వేయిస్తున్నారు చేతికి పుస్తకం ఇస్తే చూసి జాగ్రత్తగా చదువుతారు కదా అని అడిగా......

దానికి ఆయనిచ్చిన సమాధానం-....

నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన మొఘల్ రాజు కాలంలో కాల్చివేయ్యబడ్డాయి - తరువాతి కాలంలో మళ్ళీ ఆ వేద విద్యను, గ్రంధాలను తిరిగి రాయడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది భారతీయ విద్యావేత్తలను అత్యంత క్రూరంగా హింసించి చంపేయ్యడం జరిగింది.....

ఇది ముందే గమనించిన  మనవిద్యావేత్తలు  వేదాన్ని ఏనాటినుండో కంఠస్థం చెయ్యడం అలాగే మరికొంత మందికి కంఠోపాఠం గా నేర్పడం మొదలు పెట్టారు - అలా చాలా వరకు వేదాధ్యయనం ముఖత గానే కొనసాగింది అందువల్లే వేదాన్ని కంఠస్థం చెయ్యడం అలవాటుగా మారింది....

4 వేదాలు నోటికి వచ్చిన వాడిని చతుర్వేది అని

3 వేదాలు వచ్చినవాడిని త్రివేది అని

2 వేదాలు వచ్చిన వాడిని ద్వివేది అని

1 వేదం నేర్చినవాడిని ఉపాధ్యాయ అని

శాస్త్రాలు తెలిసినవాడిని శాస్త్రి అని....

మిశ్రమంగా కొన్ని విషయాలు నేర్చుకున్న వాడిని మిశ్రా అని....

శాస్త్రీయ కర్మ విధి విధానాలను నేర్చిన వాడిని శర్మ అని....

 ఇలా రకరకాలుగా విభజించి నేర్పించడం జరిగింది
మరి ఇప్పుడు రాయచ్చు కదండీ ఇప్పుడు మనం స్వతంత్రులం కదా అన్నాను
ఆయన నవ్వేసి - ఎవరు చెప్పారు మనం స్వతంత్రులమని గత 65 ఏళ్లుగా గమనిస్తున్నాను ఒక్కడంటే ఒక్క మహా మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఈ వేదాలను తిరిగి రాయించడం మీద దృష్టి పెట్టనేలేదు - ఇప్పటకి మనం మొఘల్ రాజుల పాలనలోనే ఉన్నాం - హిందుమత గ్రంధాలను అవహేళన చేస్తూనే ఇతర మత గ్రంధాలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం లేదా ఇతరులకు ఇంకా భయపడుతూనే ఉన్నాం అన్నారు
ఆయన మాటల్లో నిజం ఉందనిపించింది నాకు - మీరేమంటారు.......

ఫేస్ బుక్ నుండి సేకరణ

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP