శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మెర్సల్ సినిమా.....జి ఎస్ టి ...సింగపూర్.. భారతదేశం...వాస్తవం

>> Friday, October 27, 2017

Giddaluru krish:
మెర్సల్ అనే తమిళ సినిమా జి ఎస్ టి కి వ్యతిరేకం గా , భారత దేశాన్ని సింగపూర్ తో పోలుస్తూ , భారతదేశాన్ని కించపరచే వ్యాక్యాలు సదరు సినిమాలో హీరో పాత్రధారి అయిన విజయ్ చేసారంటూ కొందరు చంకలు గుద్దుకొంటు పోస్ట్ లు ఒకటే పెడుతున్నారు .. ఇందులో నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ..
2017 లెక్కల ప్రకారం సింగపూర్ జనాభా 57 లక్షలు మాత్రమే , అదే 2017 లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా 90 లక్షలు , హైదరాబాద్ జనాభా లో సగం కూడా లేని దేశాన్ని 130 కోట్ల జనాభా ఉండే భారతదేశం తో పోలుస్తారా ...
సింగపూర్ లో రిజర్వేషన్స్ అమలు లో ఉన్నాయా ? ఓకే భారత దేశాన్ని కూడా సింగపూర్ చేసేద్దాం రిజర్వేషన్స్ తీసేద్దాం ఓకే న
సింగపూర్ లో రైతులు ఎంత మంది ఉన్నారు , ఎన్ని వేల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు .. సింగపూర్ లో రైతుల రుణ మాఫీ పదకాలు ఉన్నాయా .. ఇవి మెర్సల్ సినిమాలో చూపిస్తున్నార
ఇండియా లో గ్యాస్ సబ్సిడీ లాగ సింగపూర్ ప్రభుత్వం అక్కడి ప్రజలకి ఏమేమి సబ్సిడీ లు ఇస్తోంది ..
సింగపూర్ లో ఒక నలుగు రూముల ఫ్లాట్ కి అయ్యే కర్చు 4,25,000 అమెరికన్ డాలర్లు అవుతుంది , అదే మన దేశ రూపాయలలో రెండు కోట్ల డెబ్బయి ఆరు లక్షల అరవయి ఆరు వేల నూట ఇరవయి అయిదు రూపాయలు .. అదే భరత దేశం లో ఒక నాలుగు రూముల ఇల్లు కట్టుకోవాలంటే నాలుగు లక్షల లో అయిపోతుంది కోట్లు అవసరం లేదు ... యెంత సేపు ఎదుటి వాడిది నాకే బదులు సొంత దేశం గొప్పతనం తెలుసుకోండి....
సింగపూర్ లో 7 % జి.యెస్.టి ..వైద్యం ఫ్రీ... బాగుంది...ఇక్కడ 28% మరి ఇక్కడ ఎందుకులేదు??? చాలా అమాయకంగా అడిగేసారుగా ఈ సినిమా వాళ్ళు !!! నిజానికి ఇక్కడ మన భారత్ లో పేదలకు ఇచ్చే ఉచిత వైద్యం ప్రపంచంలోని ఏదేశమూ కూడా ఇవ్వలేదు ..ఆయా ఆసుపత్రులలోని ఉన్నతాధికారులమీద ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఆధారపడి ఉంటుంది... గుర్తుందో లేదో డాక్టర్ శ్రీ కాకర్ల సుబ్బారావు గారి హయాంలో హైద్రాబాద్ లోని నిజాం హాస్పిటల్ పనితీరు ... ప్రపంచంలోని ప్రఖ్యాత హాస్పిటల్స్ తో పోటీపడింది... నిజానికి భారత్ 5.4 బిలియన్ డాలర్ల మందులు పేదలకు ఉచితంగా ఇస్తుంది...అంటే 351,162,000,000...కోట్లరూపాయల విలువ చేసే మందులు ..ఈ 351,162,000,000 కోట్లు కేవలం మందులే.. ఉచితంగా చేసే ఆపరేషన్లూ వైద్యం దీనికి 10 రెట్లు ఉంటుంది... ఈ మొత్తంలో కనీసం50 కోట్లు కూడా పేదలకు సింగపూర్ ఖర్చుపెట్టదు ..
ఇకపోతే అక్కడ టాక్స్ ఎగ్గొడితే విచారణ లేకుండా లోనేస్తారు .. ఇంకంటాక్స్ కు అప్పీల్ కు కూడా అవకాశం ఉండదు... ఆ డైలాగ్ రాసినోడికీ..చెప్పినోడికీ చెప్పండి....
మీ సొళ్ళంతా ఇక్కడే భావప్రకటన మనకెక్కువ కదా!!... క్రిమినల్ చట్టాలు కూడా మీరు ఆరాదించే దేశాలవి ఇక్కడ అమలు చేద్దామా??
సింగపూర్ లో ప్రజలు తాము సంపాయించిన దాంట్లో 10 పెర్సెంట్ వైద్య సేవలకి భీమాగా చెల్లించాలి .. ఇండియా లో యెంత మంది తాము సంపంయించిన దాంట్లో వైద్య సేవలకి చెల్లిస్తున్నారు ...
ఇక్కడ ఉంటూ ఇక్కడ తిండి తింటూ .. భారత దేశాన్ని కించపరుస్తూ ... ఇంకో దేశాన్ని పొగుడుతూ .. దాన్ని భావప్రకటన స్వేచ అంటూ ఉంటె ఎంతో కాలం లేదు....
జై హింద్.....!!!!!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP